
వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ సీపీఐ
● కమ్యూనిస్టులకు దూరమై బీఆర్‌ఎస్ అధికారాన్ని పోగొట్టుకుంది ● కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కరీంనగర్: దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సీ పీఐ ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ కరీంనగర్ జిల్లా 23వ మహాసభలు నగరంలోని మధుగార్డెన్‌లో మంగళవారం ప్రారంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకుడు వే ముల వెంకట్రాజం ఆవిష్కరించారు. అమరవీరుల స్మారకస్తూపం చిహ్నాన్ని శ్రీరాముల రామచంద్రం ప్రారంభించారు. సాంబశివరావు మాట్లాడుతూ క మ్యూనిస్టులను దూరం చేసుకుని అధికారాన్ని పో గొట్టుకున్నామనే బాధలో బీఆర్‌ఎస్ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సీపీఐ ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులందరూ నాలుగు లేబర్‌కోడ్‌లను వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్‌కుమార్, బోయిని అశోక్, అందెస్వామి, టేకుమల్ల సమ్మయ్య, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.