
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య
పెద్దపల్లిరూరల్: మీసేవ కేంద్రాల నిర్వాహకు లు నిబంధనల మేరకు పనిచేయాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ వేణు హెచ్చరించారు. కలెక్టరేట్‌లో మంగళవారం మీ సేవ కేంద్రాల నిర్వహణపై సమీక్షించారు. సేవ లు, ఫీజులను అందరికీ తెలిసేలా బోర్డులు ఏ ర్పాటు చేయాలన్నారు. ధ్రువీకరణపత్రాల జా రీపై ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవన్నా రు. నిబంధనల మేరకే ఫీజు వసూలు చేయా లని పేర్కొన్నారు. ఈడీఎం కవిత, జిల్లా మేనేజర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
అన్యాయం చేశారని ఆందోళన
పాలకుర్తి(రామగుండం): ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని ఆ రోపిస్తూ స్థానికులు మంగళవారం మండల ప రిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. దూట సతీశ్, నంది శ్రీకాంత్, దారవేణి ఓదెమ్మ, పాటాకుల సూర్య ప్లకార్డులు పట్టుకుని బైఠాయించారు. భూములు, ఆస్తులు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని, అద్దెఇళ్లలో ఉంటున్నవారికి, నిరుపేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు మరోసారి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. పోలీసుల జో క్యంతో వారు శాంతించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.
ఉపాధి కూలీల నిరసన
జూలపల్లి(పెద్దపల్లి): ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకర్ తమను పరుష పదజాలంతో దూ షించారని ఆరోపిస్తూ మహిళా కూలీలు మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదు ట నిరసన తెలిపారు. దాదాపు వంద మంది కూలీలు ఎస్సారెస్పీ డీ– 83 మెయిన్ కాలువ లో పూడిక తొలగించే పనులను ఫీల్డ్ అసిస్టెంట్ నర్సయ్య చేయిస్తున్నారని, పరిశీలనకు వచ్చిన శ్రీకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. ఈ విషయమై టీఏ శ్రీకర్‌ను సంప్రదించగా, తాను ఎవరినీ దూషించలేదన్నారు.
31 వరకు గడువు
కోల్‌సిటీ(రామగుండం): లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి ఈనెల 31వ తేదీ వరకు గడువును పొడి గించినట్లు రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. 2020లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే బల్దియా కార్యాలయంలోని టౌ న్‌ప్లానింగ్ విభాగంలో సంప్రదించాలన్నారు. నిర్ణీత రుసుం, డాక్యుమెంట్లు సమర్పించి స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని, 25 శాతం రాయితీ వర్తిస్తుందని ఆమె వివరించారు.
కొనసాగుతున్న మరమ్మతులు
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఎ రువుల కర్మాగారంలో వార్షిక మరమ్మతుల కో సం ఈనెల 6న కర్మాగారాన్ని షట్‌డౌన్ చేశారు. దీంతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. 21 రోజులుగా వార్షిక మరమ్మతులు సాగుతు న్నాయి. పనులు పూర్తికావడానికి మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. జూన్ రెండోవారంలో యూరియా ఉత్పత్తి ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
‘డబుల్’ ఇళ్లు పంపిణీ చేస్తాం
పెద్దపల్లిరూరల్: పేదల కోసం నిర్మించిన డ బుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీని 15 రోజుల్లోగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. చందపల్లి, కూనారం రైల్వేగేట్ స మీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎ మ్మెల్యే పరిశీలించారు. జూన్ 10లోగా లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని సూచించారు.
అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
పెద్దపల్లిరూరల్: రాష్ట్రావతరణ వేడుకల నిర్వ హణకు ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. స్వశక్తి సంఘాలు, ప్రతినిధులు హాజరు కావాలన్నారు. డీసీపీ కరుణాక ర్, ఏసీపీ కృష్ణ, ఆర్డీవో గంగయ్య ఉన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య