ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ సందర్శన | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ సందర్శన

Apr 22 2025 12:09 AM | Updated on Apr 22 2025 12:09 AM

ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ సందర్శన

ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ సందర్శన

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను రామగుండం ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు సోమవారం సందర్శించినట్లు వరంగల్‌ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్తగా ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తుండడంతో.. ఈ సెంటర్‌ నిర్వహణపై అధ్యయనం చేసేందుకు అక్కడి సీపీ ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ పోలీసులు సందర్శించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్‌ సెంటర్‌లో నిర్వహించాల్సిన రికార్డులు, డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహణ తదితర అంశాలను ఏసీపీ సత్యనారాయణ వివరించారు. అనంతరం మందుబాబులకు కౌన్సెలింగ్‌ విధానాన్ని రామగుండం పోలీస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారెడ్డి, ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement