
కేంద్రం నుంచి రాయితీ అందుతోందా?
● జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ ఆరా
పెద్దపల్లిరూరల్: మత్స్యకార సొసైటీల ద్వారా రు ణాలు పొందారా.. కేంద్రప్రభుత్వం నుంచి సబ్బిడీ అందుతోందా? అని జాతీయ ఎస్సీ కమిషన్ స భ్యుడు వడ్డేపల్లి రాంచందర్ ఆరా తీశారు. దళిత సొ సైటీల్లో సభ్యులుగా ఉన్నామే తప్ప రాయితీ గురించి తెలియదని సభ్యులు బదులిచ్చారు. రాయితీపై ఎందుకు అవగాహన కల్పించలేదని అధికారులపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర ధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహం అందిస్తూ, అనేక పథకాలను అమలు చేస్తోందని రాంచందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా అందిస్తున్న పథకాలు, రాయితీలపై దళిత సొసైటీల సభ్యులకు జిల్లా కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. రాంచందర్ మాట్లాడుతూ, రాయితీ పథకాలను సభ్యులకు ఎందుకు అందించలేకపోతున్నారని అధికారులను నిలదీశారు. జిల్లాలో ఆరు సొసైటీలు ఉన్నాయని జిల్లా మత్స్యశాఖ అధికారి నరేశ్ తెలిపారు. సబ్సిడీ కోసం వారు దరఖాస్తు చేసుకోలేదని చెప్పడంతో ఆగ్రహించిన వడ్డేపల్లి.. వారికి అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం చేశారని, ఇకనుంచి ఇలా చేయొద్దని హెచ్చరించారు. దళితులకే కాకుండా అర్హులైనవారికీ పథకాల ఫలాలు అందేలా చూడాలని చెప్పారు. మత్స్యశాఖ ఈడీ నెహ్రూ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ దీపాసుమన్, జిల్లా అధికారి నరేశ్‌కుమార్ నాయుడు ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిలారపు పర్వతాలు, గనెబోయిన రాజేందర్ తదితరులు రాంచందర్‌ను సన్మానించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, సురేందర్, దళిత సంఘాల నాయకులు బాపయ్య, కుక్క అశోక్, తిరుపతి, నరేందర్, కై లాసం పాల్గొన్నారు.