‘బండ’బారిన బతుకులు | - | Sakshi
Sakshi News home page

‘బండ’బారిన బతుకులు

May 1 2025 1:55 AM | Updated on May 1 2025 1:55 AM

‘బండ’

‘బండ’బారిన బతుకులు

కండలు కరిగించినా..

కొండలు పగులదీసినా..

కుండలో మెతుకులు కరువు

కష్టజీవులకు దక్కని హక్కులు

ప్రమాదబీమా ఊసేలేదు

రెక్కాడితే తప్ప డొక్కాడని తుర్కాశీ కార్మికులు

రాజన్నసిరిసిల్ల జిల్లాలో 82 గ్రామాల్లో..

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 82 గ్రామాల్లో తుర్కాశీ కార్మికులు ఉన్నారు. వీరంతా నిత్యం గుట్టలు, గుట్టబోరును నమ్ముకుని బండలు కొడుతున్నారు. భవన నిర్మాణాలకు, ప్రహరీలకు, పునాదుల నిర్మాణాలకు బండలను సరఫరా చేస్తారు. ఎంతో కష్టతరమైన పనిలో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. కండలు కరిగించి కొండలు పగలదీసినా ఇంట్లో కుండలు వెలితిగానే ఉంటున్నాయి. ఎదుగుబొదుగు లేని జీవితంతో బతుకు జట్కాబండిని భారంగా ఈడుస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ధైన్యం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎండా, వాన, చలి ఇవేవి వాళ్లని భయపెట్టవు... రేపటికి పని దొరక్కపోతే ఎలాగన్న వేదన తప్ప... పండుగ పబ్బాలకు పరమాన్నం రుచి ఎరుగరు. జిల్లాలో అట్టడుగు స్థాయిలో జీవిస్తున్న తుర్కాశీల బతుకుచిత్రం దుర్భరం. అటవీ ప్రాంతాల్లో పనిచేయడంతో ఫారెస్ట్‌ అధికారులు బండలు కొట్టవద్దని పనిముట్లను లాకెళ్తున్నారని కార్మికులు వాపోయారు. రెక్కల కష్టాన్ని నమ్మకున్న కార్మికుల బతుకులు బండలవుతున్నాయి.

గుర్తింపు లేదు

తుర్కాశీ కార్మికులను భవన నిర్మాణరంగ కార్మికులుగా గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాల్సి ఉండగా.. కార్మికశాఖ వారిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణానికి అవసరమైన బండలను కొట్టి సరఫరా చేస్తున్నా గుర్తింపుకార్డులు, భవన నిర్మాణ కార్మికులుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కడం లేదు. ఇప్పటికై నా జిల్లా అధికారులు చొరవచూపి జిల్లాలోని తుర్కాశీ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు ఇస్తాం

భవన నిర్మాణ కార్మికులుగా తుర్కాశీ కార్మికులను గుర్తిస్తాం. తుర్కాశీ కార్మికులు దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. ఇప్పటికే జిల్లాలో చాలా మందికి గుర్తింపు కార్డులు ఇచ్చాం. ఇంకా ఎవరైనా గుర్తింపు కార్డులు లేని వారు ఉంటే కార్మిక శాఖ ఆఫీస్‌ను సంప్రదిస్తే జారీ చేస్తాం. – నాజర్‌ అహ్మద్‌,

అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, సిరిసిల్ల

సిరిసిల్ల: కండలు కరిగించి.. గుట్టలను పిండి చేస్తున్నారు. ఎండ..వాన..చలి.. లెక్కచేయని తనంతో కష్టపడుతున్నారు. అయినా పూటగడవని స్థితిలో తుర్కాశీలు కాలం వెల్లదీస్తున్నారు. భవన నిర్మాణాలకు బండలను సరఫరా చేస్తున్నా వారికి కనీసం కార్మికులుగా గుర్తింపుకార్డులు లేవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. బండలు కొడుతూ ‘బండ’బారిన జీవనం గడుపుతున్న తుర్కాశీలపై మేడే సందర్భంగా ప్రత్యేక కథనం.

‘బండ’బారిన బతుకులు1
1/3

‘బండ’బారిన బతుకులు

‘బండ’బారిన బతుకులు2
2/3

‘బండ’బారిన బతుకులు

‘బండ’బారిన బతుకులు3
3/3

‘బండ’బారిన బతుకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement