
వేటగాడి నిప్పు.. చెట్టుకు ముప్పు
బోయినపల్లి(చొప్పదండి): వణ్యప్రాణుల కోసం ఓ వేటగాడు భారీ వృక్షం మొదట్లో నిప్పుపెట్టగా.. అది నేలకొరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పివేశారు. బోయినపల్లి మండలం తడగొండ నుంచి గంగాధర వెళ్లే మార్గంలో ఓ పెద్దచెట్టు మొదలుకు ఓ వేటగాడు రెండు రోజుల క్రితం నిప్పుపెట్టాడు. చెట్టు బొర్రెలో దాగి ఉన్న వణ్యప్రాణుల కోసం మొదట్లో నిప్పు పెట్టాడు. పెద్ద ఎత్తున మంటలు లేవడంతో చెట్టు కూలిపోయి రోడ్డుపై పడింది. అయినా మంటలు తీవ్రంగా ఉండడంతో సమీప పొలాల్లోని రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. అనంతరం చెట్టును తొలగించారు.