సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు

Apr 29 2025 12:08 AM | Updated on Apr 29 2025 12:08 AM

సీఎంన

సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు

గోదావరిఖని(రామగుండం): డీఎంఎఫ్‌టీ నిధులు విడుదల చేయాలని కోరుతూ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు. సీఎంను కలిసినవారిలో విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఉన్నారు.

అడిషనల్‌ జూనియర్‌ జడ్జికి సన్మానం

మంథని: మంథని కోర్టులో అడిషనల్‌ జూని యర్‌ జడ్జిగా మూడున్నరేళ్లు పనిచేసి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు బదిలీపై వెళ్తున్న మూల స్వాతిగౌడ్‌కు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అసోసియేషన్‌ తరఫున సన్మానించి మెమొంటో అందించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి భవాని, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరిబాబు, జనరల్‌ సెక్రెటరీ సయేందర్‌రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ కె.రఘోత్తంరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం మే 1 నుంచి జూన్‌ 10వరకు ఉచితంగా సమ్మర్‌క్యాంపు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 7వతరగతి చదివే విద్యార్థుల కోసం వేసవి సెలవుల్లో 400 మంది వలంటీర్లతో 305 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక సమ్మర్‌క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు క్యాంపు ఉంటుందన్నారు. ఈ క్యాంపులో శిక్షణ పొందేందుకు వచ్చే విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఉచిత బోధన అందిస్తామన్నారు. విద్యార్థులకు చదవు పట్ల ఆసక్తి పెంచేలా సూచనలు ఇవ్వడం తోపాటు ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. పాఠాలు భోధించడం, ఆట, పాటలతో చదవడం, నీతికథలు వినిపించడం, కుటుంబ బంధాలు, విలువలు, చదువు ప్రాముఖ్యత తదితర అంశాలను వివరించేలా వలంటీర్ల బోధన సాగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పని సరిగా సమ్మర్‌క్యాంపులకు పంపించి సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.

నేడు బల్దియాలో దరఖాస్తుల పరిశీలన

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తులు పరిశీలించనున్నట్లు కమిషనర్‌(ఎఫ్‌ఏసీ) జె.అరుణశ్రీ తెలిపారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్కండేయకాలనీ శాఖ, రమేశ్‌నగర్‌ శాఖ, లక్ష్మీనగర్‌శాఖ పరిధిలోని అభ్యర్థుల అర్జీలు పరిశీలించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్‌ పాన్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఆధార్‌, ఆహారభద్రత కార్డు, ఆదాయం, కులధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కమిషనర్‌ కోరారు.

ప్రభుత్వానికి పంట నష్టం నివేదిక

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలు, రైతుల పేర్లతో కూడిన జాబితాను కలెక్టర్‌ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించామని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి తెలిపారు. మార్చి 21న కురిసిన అకాల వర్షాలతో 1,175 ఎకరాల 16 గుంటల్లో పంటనష్టం జరిగిందన్నారు. అలాగే ఈ నెల 15న కురిసిన వానలకు 2,391 ఎకరాల 7గుంటల్లో పంట నష్టం సంభవించిందని వివరించారు. ఇందులో వరి 2,7 83 ఎకరాల 30 గుంటలు, మొక్కజొన్న 642 ఎకరాల 7గుంటలు, ఇతరపంటలు 140 ఎకరా ల 26 గుంటలుగా ఉందని పేర్కొన్నారు. రైతు ల వారీగా పంట నష్టం వివరాలు, బ్యాంకుఖా తా, ఆధార్‌కార్డు వివరాలు నివేదించామని, ప్ర భుత్వం నుంచి పరిహారం నిధులు నేరుగా రై తుల ఖాతాకే జమ చేసే అవకాశముందన్నారు.

సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు1
1/2

సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు

సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు2
2/2

సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement