కొత్తపల్లి రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ మూసివేత
పెద్దపల్లిరూరల్: కొత్తపల్లిలోని 37వ నంబరు లెవల్‌క్రాసింగ్ గేట్ మూసివేతకు రైల్వే ఉన్నతాధికారు లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో బుధవారం గే ట్‌ను మూసిఉంచారు. రైల్వేగేట్‌తో అవసరం లే కుండా.. రాకపోకలు సాగించేలా అధికారులు అండర్‌బ్రిడ్జి నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే అండర్ బ్రిడ్జి ద్వారా తమ పంట పొలాల కు వెళ్లాలన్నా, పనుల కోసం జిల్లా కేంద్రం, ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా దూరభారం అవుతోందని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బాలసాని లెనిన్, కలవేన రాజయ్య, పల్లె సదానందం, షుకూర్, శ్రీనివాస్, సతీశ్, అశోక్, సుందర్, సాయి, రాజేందర్, ప్రతాప్, అరుణ్, శంకర్ తదితరులు డిమాండ్ చేశారు. దూరభారమే కాకుండా వానాకాలంలో భూగర్భ వంతెనలోకి వరదనీరు వచ్చిచేరి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.


