
రోడ్డు దాటడం కష్టమైతంది
పెద్దపల్లి పట్టణంలో వాహనాల రద్దీ పెరిగింది. రాజీవ్ రోడ్‌ను దాటాలంటే కష్టమైతంది. ఏ వాహనం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానకూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసినా వాహనదారులను కట్టడి చేసేందుకు పోలీసులను నియమించాలి.
– సోడాబాబు, పెద్దపల్లి
బైపాస్ రోడ్డు పనులు చేపట్టాలి
రాజీవ్ రోడ్డుపై బైక్‌పై ప్రయాణించడం సాహసం చేసినట్టే అవుతోంది. వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో ట్రాఫిక్ సమస్య పెరిగింది. పట్టణానికి మంజూరైందంటున్న బైపాస్ రోడ్డు పనులను వెంటనే చేపట్టాలి. బైపాస్ రోడ్డు నిర్మిస్తే భారీ వాహనాలతో ఇబ్బందులుండవు.
–ముత్యాల రాజయ్య, తుర్కలమద్దికుంట
కూడళ్ల వద్ద నియంత్రణ చర్యలు
ప్రధాన కూడళ్ల వద్ద నియంత్రణ చర్యలు చేపడతాం. కమాన్ వద్ద యూటర్న్ తీసుకోవడం ఇబ్బందిగా ఉన్న కారణంగా ఇటు చీకురాయి క్రాస్‌రోడ్డు, అటు కూనారం క్రాస్‌రోడ్డు వద్ద నుంచి యూటర్న్ తీసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటాం. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలను నియంత్రిస్తాం.
– అనిల్‌కుమార్, ట్రాఫిక్ సీఐ, పెద్దపల్లి

రోడ్డు దాటడం కష్టమైతంది

రోడ్డు దాటడం కష్టమైతంది