
డాక్టర్ కావాలనేదే లక్ష్యం
రామగిరి(మంథని): పన్నూర్ గ్రామానికి చెందిన నల్ల హర్షిత ఇంటర్ బైపీసీలో 991 మార్కులు సాధించింది. నల్ల రజిత – శ్రీనివాస్ దంపతుల పెద్ద కూతురు హర్షిత.. రాఘవాపూర్ మైనార్టీ రెసిడెన్షియల్ బా లికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివింది. ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు రావడం సంతోషంగా ఉందని, డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని హర్షిత తెలిపింది. మంచి విద్యాబోధన అందుబాటులో ఉండటంతో తనకు కలిసి వచ్చిందని పేర్కొంది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదని, భవిష్యత్లో మరింత కష్టపడి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకుని వస్తానని తెలిపింది.