
యూడైస్ ప్లస్ పునఃపరిశీలన
జ్యోతినగర్(రామగుండం): విద్యా వ్యవస్థను బలోపేతం చేసేక్రమంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన యూడైస్ ప్లస్ పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఎన్టీపీసీ సుభాష్‌నగర్ పాఠశాలను కరీంనగర్ డైట్ కళాశాల విద్యార్థిని మాసుమా రికార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్, మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, తరగతి గదుల సంఖ్య, మూత్రశాలలు తదితర అంశాలపై ఆ రా తీస్తున్నామన్నారు. నివేదికను యూడైస్‌లో పొందుపరిచిన ఆ తర్వాత మార్పులు, చేర్పుల గురించి హెచ్‌ఎం శారదకు వివరించారు. క్లస్ట ర్ రిసోర్స్ పర్సన్ రామ్‌కుమార్ ఉన్నారు.
లెక్చరర్ల ఇంటింటి ప్రచారం
రామగుండం: పదో తరగతి పరీక్షలు రాసిన వి ద్యార్థుల కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ క ళాశాల లెక్చరర్లు బుధవారం ఇంటింటా పర్యటించారు. అంతర్గాం మండలం పొట్యాల, మ ద్ధిర్యాల తదితర గ్రామాల్లో ప్రిన్సిపాల్ చింతల మోహన్ ఆదేశాల మేరకు లెక్చరర్లు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలిశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని గ్రూపులు, వసతులు, ని ష్ణాతులైన అధ్యాపకులు తదితర అంశాల గు రించి వివరించారు. తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేర్పించాలని కోరారు.
30లోగా దరఖాస్తు చేయాలి
పెద్దపల్లిరూరల్: ‘టెట్’ కోసం ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో మాధవి తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు https://tgtet.apton line.in/tgtet/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు నమోదు చేసుకోవాలని డీఈవో సూచించారు.
ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్
పెద్దపల్లిరూరల్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధ వారం తెలిపారు. సన్నరకం ధాన్యం క్వింటాల్ రూ.500 బోనస్ వర్తింపజేస్తామన్నారు. ఐకేపీ, ప్యాక్స్‌లు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు గోనె సంచులు, లారీల ట్రాన్స్‌పోర్ట్ విషయంలో ఇబ్బందులు ఉంటే 79950 50780 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కంట్రోల్‌రూమ్ ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తుందని, రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్‌నంబర్ 08728–224045కు ఫోన్‌చేసి ఫిర్యాదు అందించాలని ఆయన పేర్కొన్నారు.
ముగిసిన ‘సబార్డినేట్’ పరీక్షలు
రామగిరి(మంథని): మంథని జేఎన్టీయూలో బుధవారం జ్యుడీషియల్, మినీస్టరియల్, సబార్డినేట్ ఆన్‌లైన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించారని అధికారు లు తెలిపారు. ఉదయం వేళ 100 మందికి 67 మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యా హ్నం సెషన్‌లో జరిగిన పరీక్షకు 56 మంది హా జరు కాగా 44 మంది గైర్హాజరయ్యారని ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగిరి ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు చేపట్టారు.
నేటి నుంచి ‘భూ భారతి’పై సదస్సులు
పెద్దపల్లిరూరల్: భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన భూ భారతి(ఆర్‌వోఆర్) చట్టంపై ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 17న అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి, ఎన్టీపీసీ టీటీఎస్ మిలీనియం హాల్, 19న ధర్మారం మండలం నందిమేడారం, 21న ఎలిగేడు మండలం ఎలిగేడు, జూలపల్లి మండలం గోల్డెన్ ఫంక్షన్‌హాల్, 22న రామగిరి మండలం సెంటినరీకాలనీ సింగరేణి కమ్యూనిటీహాల్, కమాన్‌పూర్ మండలం నాగారం, 23న మంథని మండలం నాగారం, 24న ఓదెల మండల కేంద్రం, ముత్తారం తహసీల్దార్ కార్యాలయం, 25న పాలకుర్తి మండలం పాలకుర్తి, కాల్వశ్రీ రాంపూర్ రెడ్డి ఫంక్షన్‌హాల్, 26న సుల్తానాబాద్ మండలం సుద్దాల, 28న పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రోజూ ఉదయం 10.00 గంటలకు ఒకటి, మధ్యాహ్నం 2.00 గంటలకు మరో అవగాహన సదస్సు ఉంటుందన్నారు.

యూడైస్ ప్లస్ పునఃపరిశీలన