
పనులు పూర్తిచేయాలి
రైల్వే వంతెన పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజల ఇబ్బందులను దూరం చేయాలి. ఈ వంతె న వినియోగంలోకి వస్తేనే అందరికీ మేలు కలుగుతుంది. పనులను పూర్తిచేయడంపై దృష్టి సారించాలి.
– కనుకుంట్ల సదానందం, స్థానికుడు
జాప్యం ఎందుకో?
కేంద్ర ప్రభుత్వం ప్రజావసరాలను గుర్తించి రైల్వేవంతెన పనులకు నిధులు కేటాయించింది. మూడేళ్ల క్రితం మొదలైన పనులు పూర్తికావడం లేదు. అధికారులు పనుల్లో వేగం పెంచేలా చూసి రైల్వేగేట్ కష్టాలు తీర్చాలి.
– జంగ చక్రధర్‌రెడ్డి, బీజేపీ నేత
వినియోగంలోకి తేవాలి
పెద్దపల్లి – కూనారం మధ్య చేపట్టిన రైల్వే వంతెన పనులు పూర్తయితేనే వాహనదారులు, ప్రజలకు మేలు కలుగుతుంది. పనులు దాదాపు చివరిదశకు వచ్చాయి. మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తేవాలి. – బొడ్డుపల్లి శ్రీనివాస్, పెద్దపల్లి

పనులు పూర్తిచేయాలి

పనులు పూర్తిచేయాలి