
అవస్థల ప్రయాణం
పెద్దపల్లిరూరల్: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీ గా ఉండే పెద్దపల్లి – కూనారం మ ధ్యలోని రైల్వే లె వల్ క్రాసింగ్ గేట్ కష్టాలు ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి. దాదాపు మూడేళ్లుగా సా..గుతు న్న రైల్వే వంతెన పనుల్లో మరింత వేగం పెంచితేనే అవస్థల ప్రయాణానికి ముగింపు ఉంటుందని జిల్లావాసులు అభి ప్రాయపడుతున్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి నుంచి కూనారం, కాల్వశ్రీరాంపూర్, పెగడపల్లి మీ దుగా హుజూరాబాద్, హన్మకొండ, మంథని ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, వాహనదారులకు ఈ మార్గం ఎంతో ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వం రైల్వే వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
రూ.119.50 కోట్లతో పనులు
పెద్దపల్లి – కూనారం మార్గంలోని 39వ నంబరు రై ల్వే క్రాసింగ్‌ట్ వద్ద వంతెన పనులను రూ.119.50 కోట్ల అంచనా వ్యయంతో 10 అక్టోబర్ 2022 న ప్రారంభించారు. నిర్మాణం ప్రారంభించి దాదాపు మూడేళ్లు కావస్తున్నా.. ఇంక అసంపూర్తిగానే ఉంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో మరింత వేగం పెంచి వీలైనంత త్వరగా పూర్తిచేసి వంతెనను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
అప్రోచ్ రోడ్డుపై గుంతలు..
రైల్వేవంతెన పనులు చేపట్టిన ప్రాంతంలో వాహనాల రాకపోకల కోసం తాత్కాలికంగా మట్టితో నిర్మించిన రోడ్డు గుంతలమయమైంది. ప్రస్తుతం వానలు కురుస్తుండడంతో నీళ్లుచేరి కుంటలను తలపిస్తున్నాయి. బురదమయమైన గుంతల రోడ్డుపై అవస్థల ప్రయాణం సాగించాల్సి వస్తోందని వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు. గుంతలను గుర్తించక ప్రమాదాల బారిన పడిన సందర్భాలు కూడా లేకపోలేదు. అధికారులు స్పందించి కనీసం అప్రోచ్ రోడ్డుపై గుంతలు పూడ్పి వేయించాలని కోరుతున్నారు.
ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్ల రద్దీ
ఖాజీపేట – బల్హార్ష సెక్షన్‌లోని ప్రధాన రైలు మా ర్గం కావడంతో ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్ల రాకపోకలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతీ అరగంటకో రైలు వచ్చి పోతుండడం, ఒక్కోసారి వరుసగా రైళ్లు వస్తూ, పోతుండడంతో గంటల తరబడి గేట్ వేస్తున్నారు. దీంతో ట్రాక్‌కు ఇరువైపులా వాహనదారులు, ప్రయాణికులు నిరీక్షించాల్సి వ స్తోంది. దాదాపు చివరిదశకు చేరిన రైలు వంతెన పను లను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవా లని జిల్లావాసులు కోరుతున్నారు.
రైల్వే వంతెన సమాచారం
నిర్మాణం స్థలం
39వ నంబరు రైల్వేగేట్
మార్గం : పెద్దపల్లి – కూనారం మధ్య
మంజూరైన నిధులు
రూ.119.50 కోట్లు
పనులు ప్రారంభమైన తేదీ
10 అక్టోబర్ 2022
రైల్వేగేట్ దాటేదెలా?
సా.. గుతున్న వంతెన పనులు
గుంతలమయమైన అప్రోచ్ రోడ్డు
నరకం చూపుతున్న రాకపోకలు

అవస్థల ప్రయాణం

అవస్థల ప్రయాణం

అవస్థల ప్రయాణం