
మంథనికి ఎల్‌ఈడీ వెలుగులు
మంథని: మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రవేశ ప్రధాన రహదారుల్లో ఇకనుంచిఎల్‌ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. పెద్దపల్లి – కాటారం మెయిన్ రోడ్డుతోపాటు గోదావరిఖని ప్రధాన రహదారికి ఇరువైపులా రూ.6 కోట్ల 70లక్షల వ్యయంతో సెంట్రల్ లైంటింగ్ సిస్టమ్, పాతపెట్రోల్ బంక్ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. పెద్దపల్లి రోడ్డులో శ్రీరాంనగర్ నుంచి, కాటారం రోడ్డులో మతాశిశు ఆరోగ్య కేంద్రం నుంచి, గోదావరిఖని రోడ్డులో పోచమ్మవాడకు వెళ్లే పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఇలా.. పట్టణానికి ఇరువైపులా ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. అలాగే పోచమ్మవాడకు వెళ్లే ప్రధాన కూడలి, గంగాపురి, ఆర్టీసీ బస్‌డిపో సమీపంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. పట్టణంలోకి ప్రవేశించే ప్రధానదారిలో రాత్రి వేళ చీకటి ఉండేది. నూతనంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లతో ఆ సమస్య పరిష్కారం కానుంది.
ట్రాఫిక్ సిగ్నల్స్‌తో సమస్యలకు చెక్..
పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని పట్టణవాసులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పాతపెట్రోల్ బంక్ కూడలిలో రెండుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. బస్సుడిపో సమీపంలో, అంబేడ్కర్ కూడలి, శ్రీపాదచౌక్ ఏరియాలో సైతం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. పైగా వాహనదారులు ఇష్టారీతిన వెళ్లడం, వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయడంతో పట్టణ ప్రజలకు తీవ్రఅసౌకర్యం కలుగుతోంది. ట్రాఫిక్ సమస్య ఉన్నప్రాంతాల్లో సిగ్నల్స్‌తోపాటు ట్రాఫిక్ కానిస్టేబుళ్లను నియమించాలని చేయాలని పట్టణ ప్రజలు కోరురుతున్నారు. కాగా మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
రూ.6.70 కోట్లతో సెంట్రల్ లైటింగ్ .. ట్రాఫిక్ సిగ్నల్స్
నేడు ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్‌బాబు

మంథనికి ఎల్‌ఈడీ వెలుగులు