
పర్యావరణ పరిరక్షణకు కృషి
రామగిరి(మంథని): గనుల విస్తరణ సందర్భంగా తలెత్తే సమస్యల నుంచి బయట పడేందుకు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వ పర్యావరణ సలహాదారు, హైద రాబాద్ రీజియన్ శాస్త్రవేత్త కె.తరుణ్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆర్జీ–3, ఏపీఏ ఏరియా లో పర్యటించారు. జీఎం కార్యాలయంలో ఎన్విరాన్‌మెంట్ జీఎంలు సుధాకర్‌రావు, నాగేశ్వరరా వు, సైదులుతో కలిసి సమీక్షించారు. జీడీకే–10 ఇంక్లయిన్, ఏపీఏ, ఓసీపీ–2 గనుల విస్తరణ సందర్భంగా తలెత్తే పర్యావరణ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎస్‌వోటూ జీఎం రామ్మోహన్, పీవోలు వెంకటరమణ, రాజశేఖర్ ఉన్నారు.