
భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమపూజలు
మంథని: పట్టణంలోని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా 108 కిలోల కుంకుమతో అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 300 మంది ఆర్యవైశ్య మహిళలు పూజలకు హాజరయ్యారు. అదేవిధంగా మహాలక్ష్మీ, లలితాదేవీ తదితర దేవతామూర్తుల ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ఎల్లంకి వంశీకృష్ణ, జిల్లా అధ్యక్షుడు నలమూసు ప్రభాకర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాచర్ల తిరుమల, రావికంటి మనోహర్, జయన్న, కిశోర్, నాగరాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
5 నుంచి ఆదివరాహస్వామి జయంతి ఉత్సవాలు
కమాన్‌పూర్(మంథని ): ప్రసిద్ధ శ్రీఆదివరా హస్వామి జయంతి ఉ త్సవాలు ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆ లయ ఈవో కాంతరెడ్డి, ప్రధాన అర్చకుడు కల కుంట్ల వరప్రసాద్ తెలిపారు. ఈనెల 5న ఆదివరాహ హవనం, 6న శ్రీభూఆదివరాహస్వామి కల్యాణం, 7న అష్టోత్తర శతఘటాభిషేకం, 108 కలశాలతో అభిషేకం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ముగిసిన రెస్క్యూ శిక్షణ
గోదావరిఖని: మహిళా రెస్క్యూ రెండోబ్యాచ్ శిక్షణ శుక్రవారం ముగిసింది. ఆర్జీ–2 ఏరియా మెయిన్ రెస్క్యూ స్టేషన్‌లో 61రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తిచేసుకున్న అండర్ మేనేజర్లకు రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి సర్టిఫికెట్లు, డ్రెస్స్‌కోడ్ అందజేశారు. మై నింగ్ థియరీ, గ్యాస్, గ్యాస్ డిటెక్టర్స్, ఫస్ట్ ఎ యిడ్, రెస్క్యూ రికవరీ, ఫైర్ ఫైటింగ్, ఫైర్ ఎ గ్జిస్టర్, స్పెషలిజెడ్ ఎక్విప్మెంట్స్ తదితర అంశాలపై ప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు. రెస్క్యూ సూపరిండెంట్ రాజేందర్‌రెడ్డి, ఇన్‌స్ట్రక్టర్లు కిషన్‌రావు, శ్రవణ్, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు ‘మోడల్’ విద్యార్థుల ఎంపిక
ధర్మారం(ధర్మపురి): స్థానిక మోడల్ స్కూల్(ఆదర్శ పాఠశాల) విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఈర వేని రాజ్‌కుమార్ తెలిపారు. గోదావరిఖనిలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఇంటర్ ఫస్టియర్‌కు చెందిన అఖిల 200 మీటర్లు, శ్రీజ 100 మీటర్లు, పందెం శ్రీవాణి 400 మీటర్లు, శరణ్య 200 మీటర్ల పరుగు పందంలో ప్రతిభ చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా పదోతరగతి విద్యార్థి మనోజ్ఞ లాంగ్ జంప్, తొమ్మిదో తరగతి విద్యార్థి సౌజ్ఞశ్రీ 600 మీటర్లు, ఎనిమిదో తరగతి విద్యార్థి 100 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌తోపాటు పీఈటీలు బైకని కొమురయ్య, మేకల సంజీవరావు తదితరులు అభినందించారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌లో మరమ్మతులు పూర్తి
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఎరువుల కర్మాగారాన్ని(ఆర్‌ఎఫ్‌సీఎల్) శుక్రవా రం పునరుద్ధరించారు. జూలై 16న అమ్మో నియా పైప్‌లైన్ లీక్ కావడంతో ప్లాంట్‌ను షట్‌డౌన్ చేశారు. కర్మాగారంలో మరమ్మతులు పూర్తిచేయడంతో ప్లాంట్‌ను పునరుద్ధరించారు. మరోరెండు రోజుల్లో యూరియా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులు తెలిపారు. ప్లాంట్ షట్‌డౌన్ కావడంతో సుమారు 69,300 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సుమారు రూ.600 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు వివరించారు.

భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమపూజలు

భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమపూజలు

భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమపూజలు