
ఏఐ టూల్స్ వినియోగంపై శ్రద్ధ
● కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తూనే.. ఏఐ టూల్స్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రామగుండం మండల ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచలు అడిగి తెలుసుకున్నారు. ప్రైమరీ పాఠశాల విద్యార్థులు రోజూ 20 నిమిషాలపాటు హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించుకోవాలన్నారు. వచ్చే ఐదేళ్లలో అమల్లో ఉండేలా చూడాలన్నారు. తరగదిలో విద్యా బోధనలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని అన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సంపూర్ణ వివరాలను యూఐడైస్ పోర్టల్‌లో నమోదు చేయాలని, విద్యార్థులు వర్క్ బుక్ వినియోగించేలా చూడాలని ఆయన సూచించారు. డీఈవో మాధవితోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందించాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): పేషెంట్లకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూ చించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, తహసీల్దార్ బషీరొద్దీన్, పంచాయతీ అధికారి సమ్మిరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఏఈ సచిన్, ఎంఈవో రాజయ్య, వ్యవసాయాధికారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.