
చెత్త సేకరణలో నిర్లక్ష్యంపై నిరసన
● వినూత్న రీతిలో నిరసన తెలిపిన మహిళా మాజీ కార్పొరేటర్ ● అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆగ్రహం
కోల్‌సిటీ(రామగుండం): తన డివిజన్‌లో చెత్త సే కరణలో నిర్లక్ష్యం వహిస్తున్న రామగుండం బల్ది యా అధికారుల తీరుపై మాజీ కార్పొరేటర్ నగు నూరి సుమలత శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కొత్తగా 48వ డివిజన్‌గా మారిన ఆర్టీసీ కాలనీలో తానే స్వయంగా ద్విచక్ర వాహ నం నడుపుతూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించా రు. వాహనానికి ఇరువైపులా ప్లాస్టిక్ డబ్బాలు క ట్టి తడి, పొడి చెత్తను వేర్వేరుగా పోగుచేశారు. కా లనీకి దూరంగా తరలించి నిరసన వ్యక్తం చేశా రు. సుమలత మాట్లాడుతూ.. నెల రోజులుగా చెత్త సేకరించే ఆటోట్రాలీలు రావడం లేదన్నారు. డివిజన్‌కు కేటాయించిన రెండు ఆటోట్రాలీలను ఇతర ప్రాంతాలకు కేటాయించారని ఆరోపించా రు. ఇళ్లలో చెత్త పేరుకుపో దుర్వాసన వస్తోందని, దోమలు వృద్ధి చెంది అనారోగ్య సమస్యలు తలె త్తే ప్రమాదం ఆమె తెలిపారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లతోపాటు కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని, కలెక్టర్ ఫిర్యాదు చేసి నా స్పందన లేదని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల డివిజన్లకు క్రమం తప్పకుండా ఆటోట్రాలీలను తరలిస్తున్న అధికారులు.. తన డివిజన్‌పై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు. ఫాగింగ్ కూడా చేపట్టడం లేదని, డ్రెయినేజీలు కంపుకొడుతున్నాయన్నారు. శానిటేషన్ సిబ్బంది స్పందించకుంటే రోజుకోతీరున నిరస న తెలుపుతానని ఆమె హెచ్చరించారు. కాగా, చెత్త సేకరణలో తలెత్తిన సమస్యలపై బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బాధ్యులను సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం.