
పరిహారం చెల్లించే వరకూ పనులు సాగనివ్వం
మంథనిరూరల్: సింగరేణి ఓసీపీ– 3 విస్తరణ కోస సర్వం కోల్పోతున్న తమకు పూర్తిస్థాయిలో పరిహా రం చెల్లించే వరకు పనులు సాగనివ్వమని అక్కెపల్లి గ్రామస్తులు హెచ్చరించారు. బుధవారం ఎల్ – 6 కాలువ కోసం సిద్దపల్లిలో సింగరేణి ఇళ్ల కూల్చివేత చేపట్టగా గ్రామస్తులు అడ్డుకున్నారు. 2015లో తమ గ్రామాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయిందని, పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తోందన్నారు. తొలిసారి చేపట్టిన సర్వే ఆధారంగా పరిహారం చె ల్లించకుండా ప్రైవేటుగా సర్వే చేయించి సగం పరిహారమే ఇచ్చిందన్నారు. తాము కోర్టుకు వెళ్తే.. తొమ్మిదేళ్ల తర్వాత తమకు అనుకూలంగానే తీర్పు వచ్చిందని, ఏడాది గడిచినా సింగరేణి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పూర్తిపరిహారం చెల్లించే వరకు పనులను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసిన స్థానిక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. స్థానిక నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు.