వాసవీమాతకు అభిషేకాలు | - | Sakshi
Sakshi News home page

వాసవీమాతకు అభిషేకాలు

Jul 31 2025 7:16 AM | Updated on Jul 31 2025 9:07 AM

వాసవీ

వాసవీమాతకు అభిషేకాలు

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): స్థానిక శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయంలో ఆ ర్యవైశ్య సంఘం నేతృత్వంలో శ్రావణమాసం సందర్భంగా బుధవారం ప్రత్యేకపూజలు చేశా రు. పంచామృతాలతో అభిషేకాలు, పసుపుకొమ్ములతో కుంకుమ పూజలు చేశారు.

సింగరేణి ఆస్పత్రికి వైద్యనిపుణుల రాక

గోదావరిఖని: హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి చెందిన సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు వచ్చే నెల 3న గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి రానున్నట్లు ఆర్జీ –1 అధికార ప్రతినిధి రవీందర్‌రెడ్డి తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, మెడికల్‌ గ్యాస్ట్రోలజిస్ట్‌, యూరోలజీ నిపుణులు ఇందులో ఉంటారని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులు, వారికుటుంబ సభ్యులు ఈనెల 31 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు సింగరేణి ఏరియా ఆస్పత్రిలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు.

రైతు సంక్షేమమే లక్ష్యం

మంథని: రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని మంథని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న అన్నారు. బుధవారం స్థానిక ఏ ఎంసీ కార్యాలయంలో చైర్మన్‌ కుడుదుల వెంక న్న, వైస్‌ చైర్మన్‌ ముస్కుల ప్రశాంత్‌రెడ్డితోపా టు పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభు త్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నా రు. అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గాన్ని స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నాయకు లు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు శా లువాలు, పూలమాలలతో సన్మానించారు.

స్కూల్‌ బస్సుల్లో సీసీ కెమెరాలు బిగించాలి

గోదావరిఖనిటౌన్‌: పాఠశాల, కళాశాల బస్సు ల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌ సూచించారు. నగరంలోని అ డ్డగుంటపల్లిలో బుధవారం సబ్‌ డివిజన్‌లోని పాఠశాలు, కళాశాలల యజమానులు, బస్సు డ్రైవర్లతో సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు పొ రపాటు చేసినా స్కూల్‌ యాజమాన్యమే బా ధ్యత వహించాలన్నారు. నైపుణ్యం కలిగిన డ్రై వర్లనే నియమించుకోవాలని యాజమాన్యాలకుసూచించారు. సీట్లకు సరిపడా విద్యార్థులనే తరలించాలని పేర్కొన్నారు. ఏసీపీ రమేశ్‌, సీఐ లు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, రాజు, రాజేశ్వరరావు, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మధు, ఎస్సైలు రమేశ్‌, భూమేశ్‌, అనూ ష, ఉదయ్‌కిరణ్‌, సంధ్యారాణి, వెంకటేశ్‌, ప్రసాద్‌, శ్రీనివాస్‌, రమేశ్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

నిరంతరం విషయ పరిజ్ఞానం నేర్చుకోవాలి

రామగిరి(మంథని): లక్ష్యం, విజయం సాధించేందుకు విషయపరిజ్ఞానాన్ని నిరంతరం నే ర్చుకుంటూనే ఉండాలని గ్లోబల్‌ స్పీకర్‌, కార్పొరేట్‌ ట్రెయినర్‌ వేముకంటి రమేశ్‌ అన్నారు. మంథని జేఎన్టీయూలో బీ టెక్‌ ఎ రివార్డింగ్‌ క్యారియర్‌ అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కమ్యూనికేషన్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, సమయపాలన, మోటివేషన్‌ లాంటి అంశాలపై ఆయన సుదీర్ఘంగా వివరించారు. సబ్జెక్టుల పరిజ్ఞానం, జనరల్‌ స్టడీస్‌, ప్రొడక్ట్‌, మార్కెట్‌, మారుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌పై అవగాహన పెంచుకోవాలని ఆ యన సూచించారు. నిత్యం ఏదోఒక ఆట కనీ సం గంటసేపైనా ఆడాలని, తద్వారానే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. ప్రిన్సిపాల్‌ విష్ణువర్ధన్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఉదయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వాసవీమాతకు అభిషేకాలు 1
1/3

వాసవీమాతకు అభిషేకాలు

వాసవీమాతకు అభిషేకాలు 2
2/3

వాసవీమాతకు అభిషేకాలు

వాసవీమాతకు అభిషేకాలు 3
3/3

వాసవీమాతకు అభిషేకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement