నిర్మాణ రంగంపై ధరల ప్రభావం
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెరిగిన సిమెంట్ ధరలు నిర్మాణ రంగంపై ప్రభావం చూపుతాయని పలు వురు ఇళ్ల నిర్మాణదారులు పేర్కొంటున్నారు. బ్రాండ్‌ను బట్టి బస్తాపై రూ.70 నుంచి రూ.100 వరకు ధర పెరిగింది. అసలే వేసవి కావడంతో ఇళ్ల నిర్మా ణం జోరుగా సాగుతోంది. పెరిగిన సిమెంట్ ధరలతో తమపై మరింత ఆర్థిక భారం పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 28మంది డీలర్లు..
జిల్లాలో సిమెంట్ హోల్‌సేల్ డీలర్లు సుమారు 28 మంది వరకు ఉన్నారు. వీరికితోడు పట్టణాలు, గ్రా మాల్లో రిటైల్ డీలర్లు కూడా వ్యాపారం సాగిస్తున్నా రు. అయితే, అధిక స్టాక్ హోల్‌సేల్ డీలర్లు తెప్పించుకుని నిల్వ చేసుకుంటారు. సిమెంట్ పరిశ్రమ యజమానులు ధరలు పెంచడంతో డీలర్లు సైతం చేసేదేమీలేక పెంచిన ధరలు అమలు చేస్తున్నారు.
రెండేళ్లుగా నిలకడగానే..
సుమారు రెండేళ్ల నుంచి సిమెంట్ ధరలు నిలకడగానే ఉంటున్నాయని, అయితే, ఈనెలలోనే ధరలు ఒక్కసారిగా పెరిగాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ఈ ప్రభావం రిటైల్ రంగంపై ఉంటుందని వారు అంటున్నారు. ఒక్కోబస్తాపై గతంలో రూ.250 ధర ఉండగా ఈనెలలో రూ.280 – రూ.390 వరకు ధర పలుకుతోంది. బ్రాండ్, నాణ్య తను బట్టి ఈ ధరల్లో హెచ్చుతగ్గులూ ఉంటున్నా యి. మరోవైపు.. స్టీల్ ధరలు సైతం క్వింటాల్‌కు రూ.6,500 నుంచి రూ.8,000 వరకు పలుకుతోందని ఇళ్ల నిర్మాణదారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ నిర్మాణాలపైనా ప్రభావం..
జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పె ద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. పెరిగిన సిమెంట్ ధరలు వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంటున్నారు.
పెరిగిన సిమెంట్ ధరలు
ఒక్కో బస్తాపై రూ.100 వరకు పెంపు
సబ్సిడీపై ఇవ్వాలి
నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నిర్మాణం పూర్తిచేసేందుకు సిమెంట్ అవసరం. ఇప్పుడు సిమెంట్ ధర పెరి గింది. ఇది మాకు ఆర్థికంగా భారం అవుతుంది. ప్రభుత్వమే ఆలోచన చేసి రాయితీపై సిమెంట్ అందించాలి.
– దాసరి రాజమల్లు, ఇందిరమ్మ లబ్ధిదారు, కాట్నపల్లి
నిర్మాణ రంగంపై ధరల ప్రభావం


