Top Stories
ప్రధాన వార్తలు
AP: సిట్ దూకుడు.. అజ్ఞాతంలోకి టీడీపీ నేతలు!
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం ప్రధానంగా దృష్టిసారించింది. కాగా, హింసాత్మక ఘటన తర్వాత అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్లను సిట్ నమోదు చేయనుంది. అయితే, కొందరు పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్లో పలు సెక్షన్లు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు సిట్ గుర్తించింది. ఇక, హింసాత్మక ఘటనలకు సంబంధించి సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను సిట్ బృందం పరిశీలిస్తోంది.
మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్ బాబును మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్ అనుమానాస్పదంగా తిరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటన ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు లోకేష్ ప్లాన్ చేయగా, తనిఖీల్లో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41ఏ నోటిస్ ఇచ్చిన శనివారం పంపించారు.తిరిగి ఆదివారం మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్ వచ్చాడు. ఎయిర్ పోర్ట్ అధికారుల తనిఖీల్లో లోకేష్ నుంచి శాటిలైట్ ఫోన్ బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇవ్వగా, లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా లోకేష్ శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నాడు. తుళ్ళూరు మండలం వెంకటాయపాలెంకు చెందిన లోకేష్.. గతంలో అమెరికాలో డాక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. లోకేష్‌ను గన్నవరం పోలీసులు విచారిస్తున్నారు.
గుడుల పేరుతో మేం ఓట్లడగలేదు: కేటీఆర్
సాక్షి,యాదాద్రి భువనగిరిజిల్లా: మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా అని ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు నెరవేరలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భువనగిరిలో ఆదివారం(మే19) జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘మోదీ గుడి కట్టినం అని ఓట్లు అడుగుతుండు. మేం కూడా గుడి నిర్మించాం. గుడి పేరుతో ఓట్లు అడగలేదు. మేము ప్రాజెక్టులు కట్టాం. అవికూడా దేవుళ్ళ పేరు మీద కట్టాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు నాట్లు వేస్తునప్పుడు రైతు బంధు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లు వేస్తునప్పుడు మాత్రమే రైతులకు రైతు బంధు వేస్తున్నారు.కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చి నేనిచ్చా అని చెప్పుకోవడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలి. ఒక వైపు బిట్స్ బిలాని చదువుకున్న అభ్యర్థి ఉన్నాడు. మరోవైపు బ్లాక్ మెలర్, లాబీయింగ్, పైశాచిక ఆనందం పొందే అభ్యర్థి ఉన్నాడు. ఎవరికి ఓటు వేయాలో పట్టభద్రులు తేల్చుకోవాలి’అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
T20 WC 2024 Trophy At Sakshi: సెమీస్ చేరే జట్లు ఇవే: పీయూశ్ చావ్లా
టీ20 ప్రపంచకప్-2024 టూర్ భారత్‌లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న స్టార్ స్పోర్ట్స్ బృందం ఆదివారం ‘సాక్షి’ ఆఫీస్‌కు విచ్చేసింది.హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో.. ప్రముఖ క్రికెటర్, టీ20 వరల్డ్‌కప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 విజేత పీయూశ్ చావ్లా ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాక్షి జర్నలిస్టులతో ఆయన చిట్‌చాట్ చేశారు. ఈ క్రమంలో ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలకు పీయూష్ చావ్లా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టులపై మీ అంచనా?ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్.. ఈ మూడింటితో పాటు ఇంగ్లండ్ లేదంటే న్యూజిలాండ్ జట్లను టాప్-4లో చూసే అవకాశం ఉంది.స్పిన్నర్‌గా మీరు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ ఎవరు?వీరూ భాయ్(వీరేంద్ర సెహ్వాగ్), రాహుల్ భాయ్(రాహుల్ ద్రవిడ్).కీలక సమయంలో ముఖ్యంగా డెత్ ఓవర్లలో మీరు ఒత్తిడిని ఎలా జయిస్తారు?కెరీర్ ఆరంభంలో ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురికావడం సహజం. అయితే, అనుభవం గడిస్తున్న కొద్దీ మేనేజ్ చేసుకోగలుగుతాం.టీ20 వరల్డ్‌కప్-2024లో పేసర్లు, స్పిన్నర్లలో ఎవరు కీలకం కానున్నారు?వెస్టిండీస్ పిచ్‌లు స్లోగా ఉంటాయి. నాకున్న సమాచారం ప్రకారం అమెరికాలోనూ పరిస్థితి ఇలాగే ఉండబోతోంది. కాబట్టి స్పిన్నర్లు ఈసారి కీలక పాత్ర పోషిస్తారని అనుకుంటున్నా.టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఎదుర్కొనబోయే కఠినమైన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు?ఆస్ట్రేలియా. ఎందుకంటే ఐసీసీ టోర్నీలో ఒత్తిడిని ఎలా జయించాలో వాళ్లకు బాగా తెలుసు.టీమిండియా స్పిన్నర్లలో ఈసారి ఎవరు కీలక పాత్ర పోషించనున్నారు?కుల్దీప్ యాదవ్.జస్ప్రీత్ బుమ్రా వరల్డ్‌కప్‌నకు సిద్ధంగా ఉన్నాడా?అవును. మెగా టోర్నీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కచ్చితంగా ఈసారి అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. మెగా టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో తను ఐపీఎల్లో ఆఖరి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఇలా పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ పీయూశ్ చావ్లా సరదాగా గడిపారు. కాగా ఐపీఎల్-2024లో పీయూశ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. 11 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టారు.చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్
May 19th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 19th AP Elections 2024 News Political Updates5:15 PM, May 19th, 2024సిట్ అధికారులకు నాకు తెలిసిన సమాచారం ఇచ్చా: మంత్రి అంబటి రాంబాబుకన్నా లక్ష్మీనారాయణ దగ్గర కొందరు అధికారులు డబ్బులు తీసుకున్నారుసిట్ అధికారులు అన్ని విషయాలు తెలుసుకుంటారని భావిస్తున్నానుపల్నాడులో జరిగిన హింసకు కారణం చంద్రబాబేనా నియోజకవర్గంలో శాంతి భద్రతలు లేవు.. గ్రామాలు వదిలి వెళ్లిపోయారుకొండపిలో ముస్లింలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారుగ్రామాలు విడిచి వెళ్లిన వారిని తిరిగి రప్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందిఅలసత్వం వహించిన వారిపై సిట్ అధికారులు చర్యలు తీసుకోవాలిజూన్ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు3:50 PM, May 19th, 2024పల్నాడు:సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటిపలు విషయాలు సిట్ బృందానికి నివేదించిన అంబటిఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడూ జరగలేదుపోలీసులతో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారు. దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారుపోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై కూడా సిట్ బృందానికి అంబటి వివరించారు3:00 PM, May 19th, 2024కృష్ణాజిల్లా:మరోసారి గన్నవరం ఎయిర్ పోర్టులో ఉయ్యూరు లోకేష్ బాబుఅదుపులోకి తీసుకున్న పోలీసులురెండ్రోజుల క్రితం అనుమానాస్పదంగా ఎయిర్ పోర్ట్ లో తిరిగిన ఉయ్యూరు లోకేష్సీఎం జగన్ పర్యటన ఎయిర్ పోర్టుకు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు ప్లాన్ చేసిన లోకేష్తనిఖీల్లో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు41ఏ నోటీస్ ఇచ్చి శనివారం పంపించిన పోలీసులుతిరిగి ఆదివారం మరోసారి డిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన లోకేష్ఎయిర్ పోర్ట్ అధికారుల తనిఖీల్లో శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్న లోకేష్గన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎయిర్ పోర్ట్ అధికారులులోకేష్ను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులుకేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్న లోకేష్ 12:30 PM, May 19th, 2024తిరుపతిలో సిట్ బృందం పరిశీలనతిరుపతి జిల్లా..చంద్రగిరి మండలం కూచివారిపల్లిలో సిట్ బృందం పరిశీలనటీడీపీ నాయకుల దాడిలో ధ్వంసమైన కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇల్లును పరిశీలించిన బృందంచంద్రగిరి వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్‌మెన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్న సిట్ బృందంసీఐ రామయ్య, కానిస్టేబుల్ వెంకటరమణను ఆరోజు జరిగిన సంఘటన గురించి వివరాలు తెలుసుకున్న సిట్ అధికారులు 11:45 AM, May 19th, 2024టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్సీపీ ఏజెంట్ తండ్రి మృతి..శ్రీకాకుళంటీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్సీపీ ఏజెంట్ తండ్రి మృతిగురువారం వైఎస్సార్సీపీ ఏజెంట్ మాధవరావు తండ్రి తోట మల్లేష్‌పై అచ్చెన్నాయుడు అనుచరుల దాడికోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ బూత్-288లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న మాధవరావుమాధవరావు కుటుంబ సభ్యులపై ఒక్కసారిగా దాడికి పాల్పడిన టీడీపీ నాయకులుమాధవరావు తండ్రి తోట మల్లేష్ గుడిలో పూజ చేస్తుండగా దాడికి పాల్పడిన అచ్చెన్నాయుడి అనుచరులుదాడిలో తీవ్రంగా గాయపడిన తోట మల్లేష్ రావు.వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు తరలింపు.పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించిన వైద్యులుచికిత్స పొందుతూ కేజీహెచ్‌లో మరణించిన తోట మల్లేశ్వరరావు 11:10 AM, May 19th, 2024ఎన్నికల విధులకు వెళ్తూ ఏఎస్ఐ రమణ మృతిఎన్టీఆర్ జిల్లాఎన్నికల విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన విజయవాడ సీపీఎస్ ఏఎస్ఐ రమణరమణను వేగంగా ఢీకొట్టిన ఎర్టిగా కారు.తీవ్రగాయాల పాలైన రమణ..పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుచికిత్సపొందుతూ మృతి చెందిన రమణ 10:40 AM, May 19th, 2024పరారీలో చింతమనేని..ఏలూరు జిల్లాపరారీలో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ఈనెల 16 రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన చింతమనేనిబెంగళూరు వెళ్ళినట్టు ప్రాథమిక సమాచారంఆయనతోపాటు మరో 14 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తింపుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి సినీ పక్కిలో దౌర్జన్యం చేసి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేనిచింతమనేనితో పాటు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచింతమనేని అతని అనుచరులను పట్టుకునేందుకు ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీంలు ఏర్పాటుచింతమనేని అతని అనుచురులపై సెక్షన్ 353, 224, 225, 143, 149 సెక్షన్ల కింద కేసులు నమోదుచింతమనేని కేసును పర్యవేక్షిస్తున్న నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్యముద్దాయి రాజశేఖర్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పెదవేగి పోలీస్ సిబ్బంది.కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన ఏలూరు జిల్లా కోర్టు.రిమాండ్ విధించిన ముద్దాయిని ఏలూరు జిల్లా సబ్ జైలుకు తరలించిన పెదవేగి పోలీస్ సిబ్బంది. 10:00 AM, May 19th, 2024ఏపీలో దూకుడు పెంచిన సిట్ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై దర్యాప్తు జరుపుతున్న సిట్మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై ప్రధానంగా దృష్టిసారించిన సిట్అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదారాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు గుర్తించిన సిట్సోమవారం ఈసీకి నివేదిక ఇవ్వనున్న సిట్ సారథి వినీత్ బ్రిజిలాల్ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో పని ప్రారంభించిన సిట్ బృందాలుఅల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న సిట్సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్న సిట్ 9:30 AM, May 19th, 2024ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై చర్యలు..చిత్తూరు జిల్లాజిల్లావ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరు కానీ అధికారులపై చర్యలుజిల్లాలో 228 మంది పీవో, ఏపీవో, ఓపీవోలపై క్రమశిక్షణ చర్యలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.షన్మోహన్ 8:00 AM, May 19th, 2024నెల్లూరులో పోలీసుల కార్డన్ సెర్చ్..ఎస్పీ ఆరిఫ్ హఫీస్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్డెన్ సర్చ్ నిర్వహణ సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 7:00 AM, May 19th, 2024మాట నిలుపుకున్న సీఎం జగన్విజయవాడమాట నిలుపుకున్న సీఎం జగన్ ప్రభుత్వంఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ నిధులు జమనాలుగు రోజుల్లో రూ.5,868 కోట్లు నిధులు జమవైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ.1843 కోట్లు జమఇన్‌ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో రూ.1236 కోట్లు జమవైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1552 కోట్లు జమఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ.629 కోట్లు జమజగనన్న విద్య దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద రూ.605 కోట్లు జమఎన్నికల కమిషన్ అడ్డుకోవడంతో ఇన్నాళ్లు ఆగిన నిధుల జమఈసీకి తీవ్రంగా చీవాట్లు పెట్టిన ఎన్నికల కమిషన్సీఎం జగన్ హామీ ఇచినట్టుగానే ఎన్నికలు అవ్వగానే చెల్లింపులు 6:50 AM, May 19th, 2024తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంఅనంతపురం:తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంపోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై విచారణ చేపట్టిన సిట్ బృందం సభ్యులుటీడీపీ నేతలు రాళ్లు రువ్విన జూనియర్ కాలేజీ మైదానాన్ని పరిశీలించిన సిట్ బృందం సభ్యులు 6:40 AM, May 19th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్గేట్ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం 6:30 AM, May 19th, 2024అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడుప్రణాళిక బద్ధంగా వైస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారుగతంలో ఇటువంటి పరిస్థితులు లేవుఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడుఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయిఅమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడుఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడుటీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందికులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడుప్రజలే బాబుకి బుద్ధి చెబుతారువైస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండిటీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం
మల్లారెడ్డి భూ వివాదంలో మరో ట్విస్ట్..
సాక్షి, కుత్బుల్లాపూర్: సుచిత్ర సెంటర్లోని భూమి వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, బాధితుల మధ్య తీవ్ర విగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) భారీ బందోబస్తు మధ్య పోలీసులు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ సందర్భంగా వివాద స్థలం ఉన్న ప్రాంతానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలు వచ్చారు. తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో అధికారులు తమకు సహకరించడంలేదని మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్వే ముగిసిన తర్వాత మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సర్వే రిపోర్ట్ వచ్చేందుకు ఒక్కరోజు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ల్యాండ్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ స్పందించారు. ఆ భూమిలో తాను కూడా కొంత ల్యాండ్ కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2015 82/e సర్వే నెంబర్లో వేరే వ్యక్తి దగ్గరి నుంచి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిసిన తర్వాతే మేము భూమి కొనుగోలు చేశాము. 15 మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని.మల్లారెడ్డితో ఈ ల్యాండ్ వివాదంపై పలుమారు మాట్లాడాము. బేరి సుభాష్ రెడ్డితో పాటు మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదు. తనకు సర్వే అవసరంలేదని చెప్పారు. 82/e సర్వే నెంబర్లో ల్యాండ్‌పై ఇంజెక్షన్ అర్డర్ వేసినా దానికి కౌంటర్ వేయలేదు.మల్లారెడ్డి పలుమార్లు నాపేరు ప్రస్తావించినందుకే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పారు. కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారు. అధికారికంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి ఎన్నో ఆటలు ఆడాడు. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో మల్లా రెడ్డి ఆధీనంలో ఉన్న భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. శనివారం రోజున సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం, మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సాక్షి ఎక్స్‌క్లూజివ్: ‘సుష్మా స్వరాజ్ కూతురికి టికెట్ ఇవ్వొచ్చా?’
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రసక్తే లేదన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత సోమనాథ్ భారతి. వారసత్వ రాజకీయాలను బీజేపీ కూడా పోత్సహిస్తోందని సోమనాథ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ సాక్షి ప్రతినిధితో సోమనాథ్ భారతి ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. అన్యాయంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు. స్వాతి మలివాల్ ఘటనను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేయండి. అబ్ కీ బాత్ బీజేపీ తడి పార్. బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రసక్తే లేదు. కేంద్రంలో ఇండియా కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులే గెలుస్తారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని బీజేపీ నేతలు చెప్పుకుంటారు. మరి సుష్మా స్వరాజ్ కూతురు టికెట్ ఎలా ఇచ్చారు?. దీన్ని రాజకీయ వారసత్వం అనరా?. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్
ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు.. తమ ఉద్యోగులకు ఆఫీస్ నుంచే పనిచేయాలని (రిటర్న్-టు-ఆఫీస్) ఆదేశాలు జారీ చేశాయి. ఈ విధానాన్ని ఇప్పుడు 'కాగ్నిజెంట్' కంపెనీ అమలు చేసింది. ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పకుండా 'రిటర్న్ టు ఆఫీస్' పాలసీకి అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. 2023లో విప్రో, టీసీఎస్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసుకు రప్పించే ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో కాగ్నిజెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.టెక్ సంస్థలన్నీ కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్న క్రమంలో.. కాగ్నిజెంట్ సీఈఓ 'రవి కుమార్' తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఇండియాలో పనిచేస్తున్న కంపెనీ ఎంప్లాయిస్ ఆఫీసు నుంచి వారానికి కనీసం మూడు రోజులు పనిచేయాలని పేర్కొన్నారు.కాగ్నిజెంట్ కంపెనీలు మొత్తం 3.47 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 2.54 లక్షల మంది భారతదేశంలోనే పనిచేస్తున్నట్లు సమాచారం. ఇంటి నుంచి పని చేయడంలో కంటే ఆఫీసు నుంచి పనిచేస్తేనే పనితీరు మెరుగ్గా ఉంటుందని సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు కంపెనీల సీఈఓలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.
చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!
కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు. కొన్ని ఎప్పటికో గాని తీరవు. 35 ఏళ్ల క్రితం ‘చాందిని’ సినిమా చూసి శ్రీదేవిలా అలాంటి లొకేషన్లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందనుకుందామె. 35 ఏళ్ల తర్వాత ఆ కోరిక తీరింది. ‘తేరె మేరె హోటోంపె’ అనే పాటకు ముంబైకి చెందిన అనిత వడేకర్ అనే మహిళ డాన్స్ తెగ వైరల్ అవుతోంది.1989లో రిలీజైన ‘చాందిని’ సినిమా భారీ హిట్ అయ్యింది. శ్రీదేవిని దేశంలోనే నంబర్ 1 హీరోయిన్గా నిలబెట్టింది. ఏ మూల చూసినా ఏ షాపు వెతికినా చాందినీ చీరలు, చాందినీ చుడీదార్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. చాందిని పాటలు కూడా సూపర్ హిట్. ‘మేరే హాతోంమే’, ‘చాందిని ఓ మేరి చాందిని’, ‘లగీ ఆజ్ సావన్ కీ’... ఇవన్నీ రేడియోల్లో టీవీల్లో మారుమోగాయి. వాటి తోపాటు ‘తేరే మేరే హోటోంపే మిత్వా’... పాట కూడా ఆదరణ అందింది. విదేశాల్లో పర్వత ప్రాంతాల్లో పచ్చదనంలో తీసిన ఈ పాటలో శ్రీదేవి రిషి కపూర్‌తో వేసే స్టెప్స్ కోసం జనం విరగబడ్డారు. ఆ పాటను గుర్తు పెట్టుకుని అలా డాన్స్ చేయాలనుకున్న ముంబైకి చెందిన అనిత వడేకర్ దాదాపు 35 ఏళ్ల తర్వాత హిమాచల్ ప్రదేశ్ వెళ్లింది. అక్కడ సేమ్ చాందినీ సినిమాలోని లొకేషన్ చూసి తన మనసులోని ముచ్చట తీర్చుకుంది. ‘తేరే మేరే హోటోంపే మిత్వా పాటకు శ్రీదేవిలాగానే పరవశంతో నాట్యం చేసింది. ఆమె కొడుకు ఆవి వడేకర్ షూట్ చేసి ‘అమ్మ 40 ఏళ్ల కల’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే పది లక్షల లైకులు కొట్టి అనిత వడేకర్‌ను ప్రశంసించారు. ఇన్నాళ్లకైనా ఒక సరదా కోరిక నెరవేర్చుకున్నందుకు ముచ్చటపడ్డారు. వయసుదేముంది పక్కన పడేస్తే పడి ఉంటుంది... మనసులోని ఉత్సాహం ముఖ్యం అంటూ ఇలా ఏవైనా కోరికలున్నవారు ‘తుజే దేఖాతో ఏ జానా సనమ్’లాంటి పాటలకు డాన్స్ చేయడానికి లొకేషన్స్ వెతుక్కుంటున్నారు. View this post on Instagram A post shared by Aavi Vadekar🐢 (@wakeup_aavi) (చదవండి: ఫోటో అదుర్స్! దెబ్బకు కస్టమర్ బేరం ఆడకుండా కొనాల్సిందే!)
'జబర్దస్త్' కమెడియన్‌కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!
ఏంటో ఈ మధ్య పవిత్ర అనే పేరున్న వాళ్లకు అస్సలు కలిసి రావట్లేదు. ఈ మధ్య తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం.. కారు ప్రమాదంలో మరణించింది. ఇప్పుడు అదే పేరున్న మరో నటి కారు ఇలానే యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఇక్కడ ఎవరికీ ఏం కాలేదు. ఇది జరిగిన దాదాపు వారం రోజులు పైనే అయింది. ఇప్పుడు తనకు జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ గురించి 'జబర్దస్త్' ఫేమ్ పవిత్ర బయటపెట్టింది. ప్రాణాలతో బయటపడ్డామని చెబుతూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించిన పవిత్ర.. 'జబర్దస్త్' షోలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటోంది. గత కొన్నేళ్ల నుంచి ఇదే షోలో చేస్తున్న పవిత్ర.. ఏడాదిన్నర క్రితం కారు కూడా కొన్నది. ఇప్పుడు ఆ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు పిన్ని, పిల్లలతో కలిసి పవిత్ర సొంతూరు వెళ్లింది. కాకపోతే నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి గోతిలో పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చిన్న దెబ్బలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.'మా పిన్ని, ఆమె పిల్లలిద్దరూ ఫస్ట్ టైమ్ నా కారు ఎక్కారు. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోపు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న వెహికల్ డ్రైవర్ కన్ఫ్యూజ్ చేయడంతోనే మాకు ఇలా జరిగింది. ఎవ్వరికీ ఎలాంటి దెబ్బలు తగలకపోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లే నాకు దెబ్బలేం తగల్లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుటపడటానికి రోజంతా పట్టింది. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ నన్ను గుర్తుపట్టారా కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదు. వీడియోలు తీశారు. అదొక్కటే నాకు బాధగా అనిపించింది' అని చెబుతూ పవిత్ర ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?)
తప్పక చదవండి
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్‌గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్రయాణం
సినిమా
ఐశ్వర్య రాయ్ చేతికి సర్జరీ.. డాక్టర్స్ సూచనతోనే కేన్స్‌లో మెరిసిందా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసింది. తాజాగా ఆమె తన కూమార్తెతో ఫ్రాన్స్ నుంచి ముంబైకి తిరిగొచ్చింది. గత 20 ఏళ్లుగా కేన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఆమె మెరుస్తూనే ఉంది. అయితే ఈసారి తన చేతికి గాయం అయింది. దానిని ఏమాత్రం లెక్కచేయని ఐశ్వర్య నూతన డిజైనర్ దుస్తుల్లో కార్పెట్‌పై హొయలుపోతూ కనిపించింది.యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం అంటే ఆ హీరోయిన్లకు దక్కిన గౌరం అని అందరూ అంటారు. కానీ, ఐశ్వర్య గ్లామర్‌తో ఆ ఫెస్టివల్‌కు మరింత అందాన్ని ఇచ్చిందని ఆమె అభిమానులు అంటారు. ఐశ్వర్య చేతికి గాయం కావడంతో ఆమె అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. అయితే, తన కుమార్తె ఆరాధ్య సాయంతో ఆమె కేన్స్‌లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఐశ్వర్యరాయ్ గత వారాంతంలో మణికట్టుకు గాయమైంది, గాయం ఉన్నప్పటికీ, ఆమె ఈ సంవత్సరం కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. నిపుణులు, వైద్యులతో చర్చించిన తర్వాతే ఆమె ఫ్రాన్స్ వెళ్లారు. త్వరలో ఆమె చేతికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే వారంలో ఆమె చేతికి శస్త్రచికిత్స చేయించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
నేనే హీరో..నేనే విలన్..తగ్గేదేలే అంటున్న స్టార్స్
సినీ ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. సినిమాలో కొత్తదనం ఉంటేనే థియేటర్స్‌కి వెళ్తున్నారు. అందుకే మన హీరోలు కూడా రొటీన్‌గా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు సినిమాలో హీరో పాజిటివ్‌గా ఉంటే..విలన్ నెగటివ్‌గా ఉండేవాడు. కానీ ప్రస్తుతం హీరోనే విలన్‌గాను మారుతున్నాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో రెచ్చిపోయి నటిస్తున్నారు. ఒకే సినిమాలో నాయకుడిగా..ప్రతి నాయకుడిగానూ నటిస్తూ తమలో దాగిఉన్న మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఎప్పుడూ చేసిందే చేస్తే ఏం బావుంటుందబ్బా... అప్పుడప్పుడూ కొత్తగా చేయాలి అంటున్న ఈ స్టార్ హీరోలపై ఓ లుక్కేయండి.
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
'బేబి'తో హిట్ కొట్టిన యువ హీరో ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇతడు హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆనంద్ తన కెరీర్లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది. దీంతో సిక్స్ ప్యాక్ కూడా చేశాడు.(ఇదీ చదవండి: 'జబర్దస్త్' కమెడియన్‌కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!)ఈ నెల 31న 'గం గం గణేశా' సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నెల 20న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ సిక్స్ ప్యాక్ ఫొటోని మేకర్స్ విడుదల చేశారు. అయితే ఇందులో ఆనంద్ ని చూసి చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంతలా మారిపోయాడేంటని కామెంట్స్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార సిండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు దాటినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కాస్మొటిక్స్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఈ మధ్య ఎక్కువగా ఆమె పలు దేవాలయాల చుట్టు తిరుగుతూ తన భర్తతో కలిసి పూజలు నిర్వహిస్తుంది. దీంతో వరుసగా పుణ్యక్షేత్రాలు, ప్రత్యేక పూజలు చేయడం వెనుక కారణం ఏమైనా ఉందా..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒకటే చర్చ జరుగుతుంది.నయనతార జాతకంలో దోషం ఉందని, అందుకే విక్కీతో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఆమె పలు దేవాలయాలను సందర్శిస్తూ పూజలు, పరిహారాలు చేస్తోందని ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చి మరీ.. పుణ్యక్షేత్రాల చుట్టూ ఆమె తిరగడం విశేషం. వాస్తవంగా నయనతారకు కాస్త దైవభక్తి ఎక్కువేనని చెప్పవచ్చు. తన వివాహం అయిన వెంటనే ఆ పట్టు వస్త్రాలతోనే తిరుమల శ్రీవారిని ఆమె సందర్శించిన విషయం తెలిసిందే. వారి పెళ్లి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం నయన్,విక్కీ విడిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వారు క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడింది. ఇలాంటి వార్తలు వచ్చిన కొద్దిరోజుల తర్వాత నయనతార జంటగా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారని సమాచారం. తన భర్తతో కలిసి సంతోషంగా జీవించేందుకు పలు పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫొటోలు
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
సుడిగాలి సుధీర్ బర్త్‌డే.. రష్మిగౌతమ్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
రెడ్ కార్పెట్‌పై తెలుగందం.. చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు! (ఫోటోలు)
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
Pratibha Ranta: నిన్నెవరు పెళ్లాడతారు? అని నానమ్మ కలవరపడినా.. హీరోయిన్ అయింది(ఫోటోలు)
క్రీడలు
T20 WC 2024 Trophy At Sakshi: సెమీస్ చేరే జట్లు ఇవే: పీయూశ్ చావ్లా
టీ20 ప్రపంచకప్-2024 టూర్ భారత్‌లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న స్టార్ స్పోర్ట్స్ బృందం ఆదివారం ‘సాక్షి’ ఆఫీస్‌కు విచ్చేసింది.హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో.. ప్రముఖ క్రికెటర్, టీ20 వరల్డ్‌కప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 విజేత పీయూశ్ చావ్లా ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాక్షి జర్నలిస్టులతో ఆయన చిట్‌చాట్ చేశారు. ఈ క్రమంలో ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలకు పీయూష్ చావ్లా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టులపై మీ అంచనా?ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్.. ఈ మూడింటితో పాటు ఇంగ్లండ్ లేదంటే న్యూజిలాండ్ జట్లను టాప్-4లో చూసే అవకాశం ఉంది.స్పిన్నర్‌గా మీరు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ ఎవరు?వీరూ భాయ్(వీరేంద్ర సెహ్వాగ్), రాహుల్ భాయ్(రాహుల్ ద్రవిడ్).కీలక సమయంలో ముఖ్యంగా డెత్ ఓవర్లలో మీరు ఒత్తిడిని ఎలా జయిస్తారు?కెరీర్ ఆరంభంలో ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురికావడం సహజం. అయితే, అనుభవం గడిస్తున్న కొద్దీ మేనేజ్ చేసుకోగలుగుతాం.టీ20 వరల్డ్‌కప్-2024లో పేసర్లు, స్పిన్నర్లలో ఎవరు కీలకం కానున్నారు?వెస్టిండీస్ పిచ్‌లు స్లోగా ఉంటాయి. నాకున్న సమాచారం ప్రకారం అమెరికాలోనూ పరిస్థితి ఇలాగే ఉండబోతోంది. కాబట్టి స్పిన్నర్లు ఈసారి కీలక పాత్ర పోషిస్తారని అనుకుంటున్నా.టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఎదుర్కొనబోయే కఠినమైన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు?ఆస్ట్రేలియా. ఎందుకంటే ఐసీసీ టోర్నీలో ఒత్తిడిని ఎలా జయించాలో వాళ్లకు బాగా తెలుసు.టీమిండియా స్పిన్నర్లలో ఈసారి ఎవరు కీలక పాత్ర పోషించనున్నారు?కుల్దీప్ యాదవ్.జస్ప్రీత్ బుమ్రా వరల్డ్‌కప్‌నకు సిద్ధంగా ఉన్నాడా?అవును. మెగా టోర్నీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కచ్చితంగా ఈసారి అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. మెగా టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో తను ఐపీఎల్లో ఆఖరి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఇలా పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ పీయూశ్ చావ్లా సరదాగా గడిపారు. కాగా ఐపీఎల్-2024లో పీయూశ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. 11 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టారు.చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్
T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆటల్లో క్రికెట్ ఒకటి. బ్రిటిష్ నేలకు ఒకప్పుడు అది వేసవి క్రీడ. క్రమంగా ఆదరణ చురగొని ‘జెంటిల్మెన్ గేమ్’గా అన్ని దేశాలకు విస్తరించింది(ఇలా ఎందుకు పిలుస్తారో చివర్లో చెబుతాం). ఇప్పుడు.. కోట్ల మందికి వినోదాన్ని పంచే విశ్వక్రీడ ఇది. ఇందులోనే ప్రధాన టోర్నీలను కైవసం చేసుకునేందుకు పలు జట్లు పోటీ పడుతుంటాయి. ఇందులో ఒకటే టీ 20 ప్రపంచకప్. స్టేడియంలో సీటుల్లో కూర్చోనివ్వకుండా వేల మందిని.. స్మార్ట్తెరలకు అతుక్కుపోయేలా కోట్లమందిని అలరించేందుకు.. మస్త్ మజా టీ20 వరల్డ్ కప్ టోర్నీ మరోసారి వచ్చేస్తోంది.‘‘హాయ్.. నా పేరు పొట్టోడు. క్రికెట్‌కు పుట్టిన ముగ్గురం పిల్లల్లం మేం. పెద్ద కొడుకు.. నా అన్న టెస్టు. రెండో కొడుకు.. నా చిన్నన్న వన్డే. ఇంక నేనేమో చిన్నోడిని.. పేరు టీ20. ఎంతైనా ఫార్మట్ చిన్నది కదా!. అందుకే అంతా ముద్దుగా నన్ను పొట్టోడు అంటారు. నా కోసం కూడా ఓ మహా సంగ్రామం జరుగుతుంటుంది. ఆ సంబురం పంచేందుకు మరో రెండు వారాల్లో మళ్లీ మీ ముందుకు వస్తున్నా. నన్ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని 20 దేశాల జట్లు సమరం తలపడబోతున్నాయి. అందుకే నా గురించి మీతో కొన్ని ముచ్చట్లు పంచుకునేందుకు వచ్చా. క్రికెట్‌కు పెద్దన్నగా వ్యవహరించే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆధ్వర్యంలో నా కోసం ఈ టీ20 ప్రపంచ కప్ జరుగుతుంది. తుది సమరంలో నెగ్గిన జట్టుకే నన్ను బహుకరిస్తారు. లండన్‌లోని లింక్స్ లండన్ కంపెనీ వాళ్లు నన్ను తయారు చేస్తున్నారు. సిల్వర్-రోడియం కలయికతో ఏడున్నర కేజీల బరువు ఉంటా నేను. ఇప్పటి వరకు 8 సార్లు టోర్నీ నిర్వహిస్తే.. రెండు జట్లు(ఇంగ్లండ్, వెస్టిండీస్) రెండేసిసార్లు నన్ను గెల్చుకున్నాయి. మిగతా నాలుగు సార్లు నాలుగు జట్లు గెలిచాయి. ఆస్ట్రేలియా తప్పించి ఇందులో మూడు ఆసియా దేశాలే ఉన్నాయి. అయితే.. 2007లో తొలిసారి దక్షిణాఫ్రికా ఆతిథ్యంలో నా కోసం తొలి టోర్నీ జరిగితే.. ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఉత్కంఠభరిత విక్టరీతో నన్ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ప్రతీ టోర్నీలోనూ నా కోసం టఫ్ ఫైట్ జరుగుతూనే వస్తోంది.గెలిచిన జట్టుకు ఐసీసీ కేవలం నా టోర్నీని మాత్రమే చేతులో పెట్టదు. ప్రైజ్‌మనీ కూడా ఉంటుంది. గత టోర్నీలో గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల(సుమారు రూ.13 కోట్లు) ప్రైజ్‌మనీ ఇచ్చారు. రన్నరప్‌గా నిలిచిన పాక్‌కు 8,00,000 డాలర్లు ఇచ్చారు. కేవలం విన్నర్ రన్నర్ మాత్రమే కాదు.. టోర్నీలో పాల్గొనే మిగతా జట్లకు కూడా వాళ్ల వాళ్ల ఫర్ఫార్మెన్స్ను బట్టి రివార్డు ఇస్తారు. అలా కిందటి సీజన్లో మొత్తం 5.6 మిలియన్ డాలర్లను(రూ46 కోట్ల పైనే) 16 జట్లకు పంచారు. మరి ఈసారి 20 జట్లు కదా. ఆ ప్రైజ్ మనీని పెంచుతారేమో!.నేనిప్పుడు భారత్‌లోనే ఉన్నా.వహ్.. ఈ దేశం ఇస్తున్న ఆతిథ్యం అంతా ఇంతా కాదు. ఈసారి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. నేనే కాదు సగటు భారతీయ అభిమానులు.. నన్ను ఎలాగైనా దక్కించుకుని దాదాపు 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు ఈసారైనా ముగింపు పలికాలని కోరుకుంటున్నారు.జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ నెదర్లాండ్ లాంటి చిన్నజట్టుతో అయినా.. జూన్ 9న పాకిస్థాన్‌తో గ్రూప్ స్టేజ్‌లో టీమ్ఇండియా తలపడనుంది. అయితే, ఆ ఒక్కసారే కాకుండా టైటిల్ పోరు దాయాదుల మధ్యే జరగాలని.. ఆ మ్యాచ్ వీక్షిస్తే అద్భుతంగా ఉంటుందేమో కదా!.చివరిసారిగా 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుందట. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరినప్పటికీ ప్చ్.. కప్‌ను అందుకోలేకపోయిందట. అందుకే ఈసారి నన్ను ఎలాగైనా దక్కించుకోవాలని భారత జట్టు సన్నద్ధం అయ్యింది. మిగతా జట్లకు చెప్పినట్లే టీమిండియాకు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం.అన్నట్లు.. ఈరోజు పీయూష్ చావ్లాతో కలిసి తెలుగు మీడియా సంస్థ సాక్షి ఆఫీస్‌కు వచ్చా ఇవాళ. ఇక్కడ నన్ను చూసేందుకు ఉద్యోగులు ఉత్సాహం ప్రదర్శించారు. నాతో సెల్ఫీలు దిగారు. నన్ను తీసుకొచ్చిన వాళ్లతో సరదాగా ముచ్చటించారు. సాక్షిలో గడిపిన కాసేపు క్షణాలు ఎంతో బాగున్నాయి.C- కస్టమర్ ఫోకస్ (వినియోగదారునిపై దృష్టి)R - రెస్పెక్ట్ ఫర్ ఇండివిడ్యువల్ (ప్రతీ వ్యక్తికీ గౌరవం)I- ఇంటిగ్రిటీ (సమగ్రత)C- కమ్యూనిటీ కంట్రిబ్యూషన్ (సామాజిక సహకారం)K- నాలెడ్జ్ వర్షిప్ (జ్ఞాన ఆరాధన)E-ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ (వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణ)T- టీమ్వర్క్క్రికెట్లోని ప్రతీ అక్షరానికి ఒక అర్థం ఉంది. ఈ లక్షణాలన్నీ హుందాతనం కలిగిన వాళ్లలో కనిపిస్తాయి. అందుకే క్రికెట్‌ను జెంటిల్మన్ గేమ్ అంటారు.
యశ్ దయాల్‌పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ చివరి బెర్తును ఖరారు చేసే పోటీలో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నువ్వా- నేనా అన్నట్లుగా తలపడ్డాయి. వర్షం రాకతో ఆరంభం నుంచే ఆసక్తి రేపుతూ.. హోరీహోరీగా సాగిన ఈ పోరులో ఎట్టకేలకు ఆర్సీబీదే పైచేయి అయింది.ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్ సత్తా చాటి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో చెన్నైకి చెక్ పెట్టి టాప్-4కు అర్హత సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు ఓవర్ల పాటు ఆర్సీబీ బ్యాటింగ్ పూర్తైన తరుణంలో వరణుడి రాక అభిమానులను కలవరపెట్టింది. అయితే, కాసేపటికే మ్యాచ్ తిరిగి ఆరంభమైంది. ఈ క్రమంలో ఓపెనర్లు విరాట్ కోహ్లి(47), ఫాఫ్ డుప్లెసిస్(54).. వన్‌డౌన్ బ్యాటర్ రజత్ పాటిదార్(41) రాణించారు.వీరికి తోడు నాలుగో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ ధనాధన్ ఇన్నింగ్స్(17 బంతుల్లో 38 నాటౌట్)తో చెలరేగాడు. మిగతా వాళ్లలో దినేశ్ కార్తిక్ 14, మాక్స్వెల్(16) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఆరంభంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర(61) రాణించగా.. అజింక్య రహానే(33) అతడికి సహకరించాడు.రవీంద్ర జడేజా సైతం 22 బంతుల్లో 42 పరుగులతో దుమ్ములేపాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా మెరుపులు(13 బంతుల్లో 25) మెరిపించాడు. కానీ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా సీఎస్కే బ్యాటర్లు చేతులెత్తేశారు.కాగా అనూహ్య రీతిలో చివరి ఓవర్లో ఆర్సీబీ సారథి డుప్లెసిస్ బంతిని యశ్ దయాల్ చేతికి ఇచ్చాడు.అతడి బౌలింగ్‌లో తొలి బంతికే ధోని సిక్సర్ బాది ఆశలు రేకెత్తించాడు. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారింది.దయాల్ అప్పటికే తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లి అతడికి దగ్గరికి దిశా నిర్దేశం చేశాడు. ధోని లాంటి లెజెండ్ క్రీజులో ఉన్నపుడు యార్కర్ కాదు స్లో బాల్ వేయాలంటూ కాస్త గట్టిగానే హెచ్చరించాడు.దీంతో యశ్ దయాల్ ధోనికి స్లో బాల్ సంధించగా.. ట్రాప్‌లో చిక్కుకున్న తలా స్వప్నిల్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక మిగిలిన నాలుగు బంతుల్లో సీఎస్కే కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించడంతో.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది.అలా కోహ్లి దెబ్బకు సెట్ అయిన యశ్ దయాల్ కీలక వికెట్ తీసి ఆర్సీబీ గెలుపునకు ప్రధాన కారణమయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆద్యంతం కీలక సమయంలో ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ సానుకూల ఫలితాలు రాబట్టడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఫాఫ్ డుప్లెసిస్ తన అవార్డును యశ్ దయాల్‌కు అంకితమివ్వడం మరో విశేషం. Nail-biting overs like these 📈Describe your final over emotions with an emoji 🔽Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvCSK pic.twitter.com/XYVYvXfton— IndianPremierLeague (@IPL) May 18, 2024pic.twitter.com/xgmfhb0Fri— The Game Changer (@TheGame_26) May 19, 2024
RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు.. ఆర్సీబీ నామస్మరణతో హోరెత్తుతూ ఆగని జోరు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఐపీఎల్-2024 టైటిల్ సాధించిందా? అన్నంతగా సంబరాలు..ఖండాంతరాలు దాటిన సంబురం.. అమెరికాలోనూ పేలుతున్న విన్నింగ్ క్రాకర్స్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరిన క్రమంలో ‘నమ్మ బెంగళూరు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేషన్స్.. అంత ప్రత్యేకమాఈ విజయం అంత ప్రత్యేకమా అంటే అవుననే చెప్పాలి. ఇంత వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవనే లేదు. అయితే, అనూహ్య రీతిలో ఈసారి మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో తొలిసారి బెంగళూరు ఫ్రాంఛైజీకి ట్రోఫీ దక్కింది.స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆర్సీబీ వుమెన్ టీమ్ కప్ కొట్టింది. ఇదే జోరులో పురుషుల జట్టు కూడా ఈసారి ట్రోఫీ సాధిస్తుందని.. టైటిల్ లేదన్న వెలితిని పూరిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే, ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ ఓటమిపాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయంతో సీజన్‌ను మొదలుపెట్టింది.ఆ తర్వాత సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన బెంగళూరు జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. వరుస వైఫల్యాలతో చతికిల పడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టు అవుతుందేమోనన్న భావన కలిగించింది. KGF త్రయంలో విరాట్ కోహ్లి రాణించినా గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంచనాలు అందుకోలేకపోయారు.మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగాఫలితంగా విమర్శల పాలయ్యారు. దీంతో మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఇలాంటి ఒత్తిడిలో ఏ జట్టైనా చిత్తవుతుంది. కానీ ఆర్సీబీ అందుకు విరుద్ధం.ఎంత ఒత్తిడి పెరిగితే అంతగా చెలరేగిపోతాం అన్నట్లుగా వరుసగా ఆరు విజయాలు సాధించి.. ఇప్పుడిలా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఊహించని విజయం సాధించింది. రిపీట్ అవుతుందా?సీఎస్కేపై గెలిచినా నెట్ రన్‌రేటు పరంగా కూడా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలో ఉంటేనే టాప్-4కు అర్హత సాధిస్తుందన్న తరుణంలో అద్భుతం చేసి.. టాప్-4కు అర్హత సాధించింది. కాగా 2016లోనూ ఆరంభంలో ఆకట్టుకోలేకపోయిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి.. అటుపై ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా 2016 ఫైనల్లో ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఆర్సీబీ వర్సెస్ చెన్నై స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: చెన్నై.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 218/5 (20)👉చెన్నై స్కోరు: 191/7 (20)👉ఫలితం: చెన్నైపై 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్స్‌లో ఎంట్రీ👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫాప్ డుప్లెసిస్(39 బంతుల్లో 54, కీలక సమయంలో రెండు క్యాచ్‌లు).చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్ Winning celebration of RCB in North America right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/2M2FipXGYX— Kohlified. (@123perthclassic) May 19, 2024Winning celebration of RCB near Trump building Chicago. right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/dy1Oko6QS7— #RCBNation (@9Sxventy3) May 19, 2024Bengaluru won't sleep tonight 😎RCB RCB all over the city @RCBTweets ❤️🔥pic.twitter.com/6jvvAAVERT— M. (@RCB_Hiv3) May 18, 2024Hear the Roar, Hear "Kohli, Kohli & RCB, RCB" Chants when they qualify for playoffs.- King Kohli & RCB are emotions..!!!! pic.twitter.com/Afqck4jNSH— Tanuj Singh (@ImTanujSingh) May 18, 2024📽️ RAW Reactions post a surreal win ❤️When emotions spoke louder than words at Chinnaswamy 🏟️A special lap of honour for the @RCBTweets fans that continue to believe in their side 👏👏#TATAIPL | #RCBvCSK pic.twitter.com/CrBQUBRKEI— IndianPremierLeague (@IPL) May 19, 2024
బిజినెస్
డ్రైవింగ్ లైసెన్స్‌లో కొత్త రూల్స్.. జూన్ 1 నుంచే..
డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది.కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు మీరు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రైవేట్ సంస్థలు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లను జారీ చేస్తాయి. ఈ కొత్త రూల్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలుప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం కోసం కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ ట్రైనింగ్ కోసమైతే అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి.డ్రైవింగ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తగిన సౌకర్యాలను కలిగి ఉండాలి.శిక్షకులకు కనీసం హై స్కూల్ డిప్లొమా అర్హత తప్పనిసరి. దీంతో కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలి.శిక్షణ సమయంలైట్ వెహికల్ శిక్షణ తప్పనిసరిగా 4 వారాల్లో పూర్తి చేయాలి (కనీసం 29 గంటలు). శిక్షణను రెండు విభాగాలుగా విభజించాలి. ఇందులో థియరీ విభాగం 8 గంటలు, ప్రాక్టికల్ 21 గంటలు ఉండాలి.హెవీ మోటారు వాహనాల కోసం 38 గంటల శిక్షణ ఉంటుంది. ఇందులో 8 గంటల థియరీ ఎడ్యుకేషన్, 31 గంటల ప్రాక్టికల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ శిక్షణ 6 వారాల్లో పూర్తవుతుంది.
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్‌తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఎప్పటికప్పుడు తన ఉనికిని పెంచుకుంటూనే ఉంది. ఫ్యూయెల్ కార్లతో పాటు, ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఈ కంపెనీ ఇటీవల హైదరాబాద్‌కు చెందిన OHM E లాజిస్టిక్స్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.OHM E లాజిస్టిక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సిట్రోయెన్ 1000 ఈ-సీ3 ఎలక్ట్రిక్ వాహనాలను దశల వారీగా సరఫరా చేయనుంది. మొదటి ఫ్లీట్ ఇండక్షన్ దశలో కంపెనీ 120 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేయనుంది. ఆ తరువాత 12 నెలల్లో మరో 880 కార్లను డెలివరీ చేస్తుంది.అక్టోబర్ 2022లో కేవలం 100 ఎలక్ట్రిక్ క్యాబ్‌లతో ప్రారంభమైన ఓహెచ్ఎమ్ ఇప్పుడు విస్తృతమైన సేవలు అందిస్తోంది. సిట్రోయెన్ ఈ-సీ3 ఎలక్ట్రిక్ కార్లు ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతూ భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని ఉత్పత్తులను దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.
భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
భారత్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీని బట్టి పాలసీని రూపొందించలేదని, అన్నీ ఈవీ కంపెనీలకు ఒకేరకమైన పాలసీ ఉంటుందంటూ నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ మార్కెట్లోకి టెస్లా ఎంట్రీపై అమితాబ్ కాంత్ ఓ కార్యక్రమంలో పరోక్షంగా స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పాలసీలు అన్ని కంపెనీలు ఆ విధానాన్ని మాత్రమే అనుసరించాలని అమితాబ్ కాంత్ చెప్పారు. కొన్ని నిర్దిష్ట కంపెనీల ప్రకారం భారత్ తన ఈవీ పాలసీ విధానాన్ని మార్చదని స్పష్టం చేశారు. అంతేకాదు టెస్లా సంస్థ తమకు ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి ఉండొచ్చు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వం ఈవీ పాలసీని ప్రవేశ పెట్టిందని అన్నారు. భారత్‌లో కనీసం రూ.4150 కోట్ల పెట్టుబడి పెట్టే ఈవీ సంస్థలకు రాయితీలు అందిస్తామని కేంద్రం తెలిపింది. పాలసీ ప్రకారం దేశంలో ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలి. లేదంటే దేశీయంగా తయారయ్యే విడిభాగాలను కనీసం 25శాతం వినియోగించాలి. ఐదేండ్ల తర్వాత ఆ మొత్తం వినియోగాన్ని 50 శాతానికి పెంచాలి అని ఈవీ పాలసీలో పేర్కొంది.కొత్త విధానం ప్రకారం, భారతదేశంలో ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంది.
టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీ విడుదల.. ధర ఎంతంటే?
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్.. టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీని భారత్‌లో విడుదల చేసింది. రెండు స్మార్ట్ఫోన్లు ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇక తాజాగా విడుదలైన టెక్నో క్యామాన్ 30 ప్రో 5జీ, క్యామన్ 30 ప్రీమియర్ 5జీ ధరలు ఇలా ఉన్నాయి. ముందుగా టెక్నో క్యామాన్ 30 5జీ 8జీబీ ర్యామ్/ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 ఉండగా.. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉందిక్యామన్ 30 ప్రీమియర్ 5జీ 12 జీబీ ర్యామ్,512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. టెక్నో క్యామన్ 30 5జీ స్పెసిఫికేషన్స్:టెక్నో క్యామన్ 30 5జీ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2436 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ 360హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160హెచ్ జెడ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమన్సిటీ 7020 చిప్సెట్, గరిష్టంగా 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనిని 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్, 10డబ్ల్యూ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
వీడియోలు
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
టీడీపీపై బొత్స సెటైర్లు
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు
సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..
కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..
బాటిల్స్ లో నో పెట్రోల్...ఈసీ ఆదేశం
తెలంగాణాలో మరో 3 రోజులు వర్షాలు
ఫ్యామిలీ
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
బాలీవుడ్లో రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా ఎట్సెట్రా.. హీరోలు కారు. నటులు! వీళ్ల గ్లామర్, గ్రామర్ అంతా కూడా వాళ్ల యాక్టింగ్ టాలెంటే! కానీ ఫ్యాషన్ అండ్ స్టయిల్లో వీళ్లిప్పుడు రణ్వీర్ సింగ్‌తో పోటీపడుతున్నారు! క్రెడిట్.. స్టయిలిస్ట్ ఈశా భన్సాలీదే!ఈశా భన్సాలీ పుట్టిపెరిగింది ముంబైలో! డిజైన్ అండ్ ఇన్నొవేషన్‌లో మాస్టర్స్ చేసింది. చదువైపోయాక చాలామంది ఫ్యాషన్ డిజైనర్స్లాగే ఈశా కూడా ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా వ్యవహరించింది. ఆ బాధ్యతల్లో తలమునకలుగా ఉంటూనే ఫ్యాషన్ షోల్లో పాల్గొనేది. ఆమె అభిరుచి, సూక్ష్మ పరిశీలనే ఈశాకు బాలీవుడ్లో ఎంట్రీ కల్పించాయి. సమకాలీన పోకడలకు సంప్రదాయ సోకును అద్దే ఈశా శైలి బాలీవుడ్లో ఆమెకు ప్రత్యేకతనిచ్చింది.ఆ స్పెషాలిటీయే రాజ్‌కుమార్ రావు ఆమెను సంప్రదించేలా చేసింది.. తనకు స్టయిలిస్ట్‌గా ఉండమని! ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ ఇసుమంత కూడా లేని ఆ నటుడికి స్టయిలిస్ట్‌గా పనిచేయడమంటే సవాలే! ఒకింత రిస్క్ కూడా! తన ఎక్స్పరిమెంట్స్ ఏ కొంచెం అటూ ఇటూ అయినా తన పేరుతో పాటు రాజ్‌కుమార్ రావు ఖ్యాతీ అభాసుపాలవుతుంది. కానీ ఫ్యాషన్ అండ్ స్టయిల్ అంటే పర్సనాలిటీని మెరుగుపరచడమే కదా అనే తన ఫ్యాషన్ స్టెప్ని గుర్తు తెచ్చుకుంది. ఫాలో అయిపోయింది. ఆమె చేసిన స్టయిలింగ్‌తో రాజ్‌కుమార్ రావు సెల్యులాయిడ్ మీద అపియర్ అయ్యాడు. ఆడియెన్స్ మురిసిపోయారు ఆయన నటనతోపాటు ఆ స్టయిల్‌కీ! రాజ్‌కుమార్ రావు న్యూ లుక్స్ అజయ్ దేవ్గణ్నీ అబ్బురపరచాయి. ఆరా తీస్తే ఈశా భన్సాలీ పేరు వినిపించింది. అంతే కబురు పంపాడు. తనకు పర్సనల్ స్టయిలిస్ట్ అవసరం లేదు కానీ సినిమాల్లో తనకు కాస్ట్యూమ్ డిజైన్ చేసేపెట్టే బాధ్యతను తీసుకోమన్నాడు. రాజ్‌కుమార్ రావును మించిన చాలెంజ్ అది. అజయ్ దేవ్గణ్కున్న హీరో ఇమేజే పెద్ద హర్డల్. అయినా అధిగమించింది ఏకంగా ఒక ప్రయోగంతో. ఆ కటౌట్ పర్సనాలిటీకి వైట్ జీన్స్, చెక్స్ బ్లేజర్ కాంబినేషన్ కాస్ట్యూమ్ని డిజైన్ చేసి! ఆ ప్రతిభతో బాలీవుడ్ అటెన్షన్ అంతా ఈశా మీదకు మళ్లింది. చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాలకు ఆమెను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పెట్టుకున్నారు. వాటిల్లో పీకూ, హిందీ మీడియం చిత్రాలూ ఉన్నాయి.ఈశా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌ని ధరించిన స్టార్స్‌లో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఉన్నాడు. పని పట్ల ఆమెకున్న కమిట్మెంట్, ఎక్స్‌పరిమెంట్స్‌కి స్టార్స్‌ని ఆమె కన్విన్స్ చేసే విధానం నచ్చిన ఆయుష్మాన్ ఖురానా.. ఈశాను తనకు పర్సనల్ స్టయిలిస్ట్‌గా ఉండమని రిక్వెస్ట్ చేశాడు. ఆయుష్మాన్ ఖురానాకు ఫ్యాషన్ స్పృహ మెండు. ఇది కూడా ఆమెకు చాలెంజే అయింది. అన్నిట్లో ప్రవేశం .. కొన్నిట్లో ప్రావీణ్యం ఉన్న ఆయుష్మాన్లాంటి వాళ్లను మెప్పించడం మహా కష్టం. అయితే ఆ నటుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది ఈశా.. ఆయన వ్యక్తిత్వానికి తగిన స్టయిల్ని జోడించి.. ఆ పర్సన్‌ని మరింత ఎలిగెంట్‌గా ప్రెజెంట్ చేసి! ఆ కాంబినేషన్ ఆఫ్ జర్నీ ఇంకా కొనసాగుతోంది!‘ఆడవాళ్లకు స్టయిలింగ్ చేయడం కష్టం అనుకుంటారు కానీ.. ఈజీ! మగవాళ్లకే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్.. రెడ్‌కార్పెట్ కోసం ఫీమేల్ స్టార్స్‌కి స్టయిలింగ్ చేయాలనుకోండి.. గౌను.. దానికి తగ్గ జ్యూలరీ అండ్ షూస్ మీద దృష్టి పెడితే చాలు. అదే మగవాళ్లకైతే.. జాకెట్, టై ఉండాలా.. వద్దా.. ఉంటే మ్యాచింగ్ టై, లేపల్ పిన్, షూస్, సాక్స్, కఫిన్స్.. ఓ మై గాడ్.. ఎన్ననీ! ఆయుష్మాన్ ఖురానాతో ప్రమోషన్స్ అంటే చాలా ఎక్సయిట్మెంట్గా ఉంటుంది. క్రియేటివిటీ హై లెవెల్లో ఉంటుంది! నా పర్సనల్ స్టయిల్ని డిస్క్రైబ్ చేయాలంటే నేను మినిమలిజమ్ని ఇష్టపడతాను. నా స్టేట్మెంట్ పీస్ ఒక్కదానితో నా ఎంటైర్ లుక్‌ని ప్రెజెంట్ చేస్తాను. ఒక్కమాటలో చెప్పాలంటే సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఎలెక్టిక్ అన్నమాట!’ --ఈశా భన్సాలీ
ఈ డివైజ్‌తో క్షణాల్లో సిల్కీ హెయిర్ సొంతం!
సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్‌ని ఇష్టపడనిదెవరు.. దానికోసం కష్టపడనిదెవరు! ఆ తలకట్టు కోసం పార్లర్లు, హెయిర్ స్పాల చుట్టూ తిరగడం ఆపి ఈ చిత్రంలోని హెయిర్ ట్రీట్మెంట్ అప్లికేటర్‌ను తెచ్చుకోండి. ఇది జుట్టును క్షణాల్లో మృదువుగా మార్చేస్తుంది.ఈ డివైస్.. అరచేతిలో అమరిపోయే చంద్రవంకలా కనిపిస్తుంది. వెనుకవైపు ఉన్న మినీ ట్యాంకర్లో నీళ్లతో పాటు.. సీరమ్ లేదా లోషన్ వంటివి మిక్స్ చేసి బటన్ నొక్కితే ఆవిరి రూపంలో బయటికి వస్తుంది. ఆ ఆవిరిని జుట్టు మొత్తానికి పట్టించుకుంటే చాలు.. సెట్ చేసిన హెయిర్ స్టైల్ సెట్ చేసినట్లుగా.. కదలకుండా ఆకర్షణీయంగా నిలుస్తుంది.అధునాతన మైక్రోటెక్నాలజీతో రూపొందిన ఈ మెషిన్‌తో.. జుట్టుకే కాదు ముఖానికీ ఆవిరి పట్టుకోవచ్చు. ఈ మినీ ట్యాంకర్‌ను డివైస్ నుంచి సులభంగా వేరు చేసుకోవచ్చు. అలాగే ఆ ట్యాంకర్‌కి ప్రత్యేకమైన లాకర్ లాంటి మూత ఉంటుంది. దాన్ని బాటిల్ మూతలా బిగించుకుంటే సరిపోతుంది. ఈ డివైస్ చాలా రంగుల్లో లభిస్తోంది. ఇది అన్ని రకాల జుట్టు స్వభావాలకు అనుకూలమైనది! (చదవండి:
వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..
అంటర్కాటికాలో ఉన్న ‘మౌంట్ ఎరిబస్’ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అగ్నిపర్వతం. ఇది బంగారు ధూళిని ఎగజిమ్ముతోంది. ఈ అగ్నిపర్వతం సముద్ర మట్టానికి 12,448 అడుగుల ఎత్తున ఉంది. ఇది ప్రతిరోజూ ఎగజిమ్మే ధూళిలో దాదాపు 80 గ్రాముల వరకు బంగారు ఉంటోంది. దక్షిణధ్రువ ప్రాంతంలో మంచుతో నిండి ఉన్న ఈ అగ్నిపర్వతాన్ని తొలిసారిగా 1841లో బ్రిటిష్ నావికాదళం అధికారి జేమ్స్ క్లార్క్ రాస్ కనుగొన్నాడు.అంటార్కిటికాలో 138 అగ్నిపర్వతాలు ఉన్నా, వాటిలో ఎరిబస్, డిసెప్షన్ ఐలండ్ అగ్నిపర్వతాలు మాత్రమే క్రియాశీలమైనవి. తొలిసారి గుర్తించే నాటికి ఎరిబస్ అగ్నిపర్వతం నిద్రాణంగానే ఉన్నా, 1972 నుంచి ఇది పొగను, ధూళిని ఎగజిమ్ముతూ క్రియాశీలంగా మారింది.ఈ అగ్నిపర్వతం అడుగున దాదాపు వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వెలువడే వాయువులు పైకి ఎగజిమ్మేటప్పుడు వెలువడే ధూళితో పాటు అడుగున ఉన్న బంగారం కూడా కరిగి బయటకు వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అగ్నిపర్వతాల నుంచి వెలువడే ధూళిలో బంగారం బయటపడటం చాలా అరుదని కొలంబియా యూనివర్సిటీలోని లామెంట్–డోహర్తీ ఎర్త్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్త కోనర్ బేకన్ చెబుతున్నారు. (చదవండి: మిణుగురుల్లా మిలమిలలాడే పూల మొక్కలు!)
మిణుగురుల్లా మిలమిలలాడే పూల మొక్కలు!
పూలు ఘుమఘుమలాడటం సహజం. మరి పూలకు మిలమిలలు ఎక్కడివని కోప్పడిపోకండి. రాత్రివేళ మిణుగురుల్లా మిలమిల మెరిసే పూలను ఒక శాస్త్రవేత్త సృష్టించాడు. అమెరికా ప్రాంతాల్లో విరివిగా కనిపించే పిటూనియా మొక్కలకు జన్యుమార్పిడి చేసి, పిటూనియా పూలు మిణుగురుల్లా మిలమిలలాడేలా చేశాడు.అమెరికన్ కంపెనీ ‘లైట్ బయో’లో పనిచేస్తున్న డాక్టర్ కీత్ వుడ్ అనే శాస్త్రవేత్త ఈ అద్భుతాన్ని సాధించాడు. మాలిక్యులర్ అండ్ కెమికల్ బయాలజీలో విస్తృత పరిశోధనలు సాగిస్తున్న డాక్టర్ కీత్ వుడ్, తొలుత పొగాకు మొక్కల్లోకి మిణుగురుల జన్యువును ప్రవేశపెట్టాడు. పొగాకు మొక్క చిన్నది కావడంతో ఆ ప్రయోగం విజయవంతం కాలేదు. తర్వాత పీటూనియా మొక్కల్లోకి మిణుగురుల జన్యువును ప్రవేశపెట్టి, అద్భుత ఫలితాలను సాధించాడు. పీటూనియా మొక్క ఎదిగిన తర్వాత దానికి పూసే పూలు రాత్రివేళ అచ్చంగా మిణుగురుల్లా మిలమిలలాడుతూ కనిపించాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ‘లైట్ బయో’ కంపెనీ పెరటి తోటల్లో పెంచుకునేందుకు వీలుగా రాత్రివేళ మిలమిల వెలుగులు వెదజల్లే పీటూనియా మొక్కలకు ‘ఫైర్ ఫ్లై పీటూనియా’గా నామకరణం చేసి, వాటిని అమ్మడం ప్రారంభించింది. అమెరికన్ జనాలు ఈ మిణుగురు పూలమొక్కలను ఎగబడి మరీ కొంటున్నారు. (చదవండి: చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!)
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
ప్రేమోన్మాది నాగరాజుకు ఉరిశిక్ష విధించాలి
నెల్లూరు(అర్బన్): ప్రేమ పేరుతో వెంటపడి వేధించి పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో తల్లీకూతుళ్లపై హత్యాయత్నం చేసిన క్రూరుడు నాగరాజును సమాజంలో తిరగనీయకూడదని, అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించాలని మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో పూజిత, ఆమె తల్లి కాంతమ్మలపై నిందితుడు నాగరాజు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరులోని ఎనెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజిత, కాంతమ్మను మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి శనివారం పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం ఆమె దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న వన్‌స్టాప్ సఖి సెంటర్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి వల్లెం విమల, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయనిర్మల, రాజ్యలక్ష్మి, అధికార ప్రతినిధి సుప్రియ పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులకే కుచ్చుటోపి
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శినంటూ ప్రజా ప్రతినిధులనే మోసం చేస్తున్న ఘరానా మోసగాణ్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎస్ మట్టం రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి/ దాసరి అనిల్ కుమార్ మై నేత.కామ్ వెబ్సైట్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. వారికి ఫోన్ చేసి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా పరిచయం చేసుకునేవాడు. ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుందని, గ్రాంట్‌ను విడుదల చేయనుందని వివరించేవాడు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కావాలని కోరేవాడు. నిజమేనని నమ్మిన ప్రజా ప్రతినిధులు బాలాజీ నాయుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేసేవారు. ఆ తర్వాతి నుంచి ఫోన్ స్విఛాఫ్ చేసేవాడు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి.. కొత్త ప్రభుత్వం రుణ పథకాన్ని ప్రారంభిస్తుందని, తనతో పాటు వంద మంది సభ్యులు పాల్గొనాల్సి ఉంటుందని సూచించాడు. నిజమేనని నమ్మిన సదరు శాసనసభ సభ్యుడు రూ.3.60 లక్షలు నిందితుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. నగదు విత్‌డ్రా చేసిన తర్వాత నిందితుడు కాల్స్ చేయడం మానేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన ఎమ్మెల్యే సూచన మేరకు తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు బాలాజీని అరెస్టు చేశారు.లంచం కేసులో దొరికే, జాబ్ పోయే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు 2008లో రామగుండంలోని ఎనీ్టపీసీలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు. చేరిన ఏడాది కాలంలోనే 2009 ఫిబ్రవరిలో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటుండగా.. సీబీఐ చేతికి చిక్కాడు. దీంతో బాలాజీని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జైలుకు తరలించారు. దీంతో ఎనీ్టపీసీ సంస్థ బాలాజీని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. జైలు నుంచి బయటికి వచ్చిన కొంత కాలం తర్వాత బాలాజీ మళ్లీ విశాఖ పరవాడ సింహాద్రీ పవర్ ప్లాంట్‌లో తిరిగి ఉద్యోగంలో చేరాడు. కానీ, అతని ప్రవృత్తిలో మార్పు రాకపోవడంతో 2009లో అతన్ని సరీ్వస్ నుంచి తొలగించారు. ఇక అక్కడ్నుంచి మోసాలకు పాల్పడటే వృత్తిగా ఎంచుకున్నాడు. బాలాజీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 37 కేసులున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతని చేతిలో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర
విమానాశ్రయం (గన్నవరం): విదేశీ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి సీఎం జగన్ విదేశీ పర్యటనకు బయల్దేరేముందు ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుట్ర విఫలమైంది. టీడీపీ సానుభూతిపరుడైన ఆయన్ని అమెరికా పౌరసత్వం కలిగిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్బాబుగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పార్కింగ్ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డాక్టర్ ఉయ్యూరు లోకేష్‌బాబును గుర్తించారు. ఆయన సెల్‌ఫోన్ నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన మేసెజ్‌లను పంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై ఆయన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్తున్న సీఎంను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు అతను వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల ఎల్లో మీడియాకు చెందిన పలు ఛానళ్లలో జరిగిన చర్చల్లో కూడా లోకేశ్‌బాబు పాల్గొని సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వరప్రసాద్ తెలిపారు. ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.టీడీపీ నేతలు, ఎల్లో మీడియాకు ముందస్తు సమాచారంఎయిర్పోర్ట్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుంటున్నట్లుగా డాక్టర్ లోకేశ్‌బాబు ముందుగానే టీడీపీ నేతలకు, ఎల్లో మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సీఎం లండన్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు రావాలని వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించారు. ఈ సంఘటనను ఎల్లో మీడియా ప్రసారం చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ బాబు ఎన్నికలకు ముందు స్వదేశానికి వచ్చినట్లు తెలిసింది. నిత్యం సోషల్ మీడియా, ఎల్లో మీడియా వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన విషం కక్కుతున్నారు. ఇదిలా ఉండగా విజయవాడలో లోకేశ్‌బాబును టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు కలిశారు.
పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. పోలింగ్ రోజు రెండు మూడు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినా ఎక్కడా ప్రత్యక్ష సంబంధం లేకపోవడంతో ఆయనపై కేసులు నమోదు కాలేదు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఈ నెల 13న ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని అదే రోజు భారీ సంఖ్యలో అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సినీ ఫక్కీలో పోలీసులపై దౌర్జన్యం చేసి నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే చింతమనేనితో పాటు అతని అనుచరుల మొబైల్ ఫోన్లు విజయవాడ సమీపంలో స్విచాఫ్ చేశారు. అక్కడ నుంచి తాడేపల్లి ప్రాంతం వెళ్లి బెంగళూరుకు పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. నూజివీడు డీఎస్పీ కేసు పర్యవేక్షిస్తున్నారు. 94కు చేరిన కేసుల సంఖ్య...చింతమనేనిపై ఈ నెల 16న ఐపీసీ సెక్షన్ 353, 224, 225, 143, 149 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 93 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుతో కలిపి వాటి సంఖ్య 94కు చేరింది. చింతమనేని బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకుని ప్రత్యేక టీమ్‌లను అక్కడికి పంపారు. హైదరాబాద్‌కు కూడా మరో టీమ్‌ను పంపినట్టు సమాచారం. చింతమనేని తీసుకువెళ్లిన నిందితుడు రాజశేఖర్‌ను శుక్రవారమే అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు.