ప్రముఖ నటికి సర్జరీ.. షాకయ్యానన్న మాజీ భర్త! | Sakshi
Sakshi News home page

Rakhi Sawant: రాఖీ సావంత్‌కు సర్జరీ.. అది చూసి షాకైన మాజీ భర్త!

Published Sun, May 19 2024 4:47 PM

Rakhi Sawant's Tumour Surgery Is Successful

బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ ఇటీవల తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.  ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె సోదరుడు వెల్లడించారు. అయితే రాఖీసావంత్‌ గర్భాశయంలో భారీ కణతి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెకు సర్జరీ చేయాల్సి వచ్చిందని ఆమె మాజీ భర్త రితేశ్ సింగ్ తెలిపారు.

ప్రస్తుతం రాఖీ సావంత్‌కు శస్త్రచికిత్స విజయవంతంగాపూర్తైనట్లు ఆమె మాజీ భర్త తెలిపారు. తాజాగా ఆమెకు ఆపరేషన్‌ చేసిన వైద్యులు దాదాపు 10 సెంటిమీటర్ల కణతిని తొలగించారని పేర్కొన్నారు.  మే 18న శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారని వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతర ఆమె అపస్మారక స్థితిలో ఉందని మాజీ భర్త చెప్పారు. 

రాఖీ గర్భాశయంలో కణితి చాలా పెద్దదిగా ఉందని.. దాదాపు అరచేతి పరిమాణంలో ఉందని రితేశ్ తెలిపారు. మొదటిసారి అది చూసి తాను షాకయ్యానని చెప్పారు. ఆమెకు దాదాపు మూడు గంటల పాటు ఆపరేషన్‌ జరిగినట్లు వివరించారు. రాఖీ కోలుకోవాలంటూ ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement