'జబర్దస్త్' కమెడియన్‌కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు! | Sakshi
Sakshi News home page

Jabardasth Pavithra: కారు ప్రమాదం.. ఎమోషనల్ అయిన పవిత్ర

Published Sun, May 19 2024 11:21 AM

Jabardasth Pavithra Car Accident And Emotional Video

ఏంటో ఈ మధ్య పవిత్ర అనే పేరున్న వాళ్లకు అస్సలు కలిసి రావట్లేదు. ఈ మధ్య తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం.. కారు ప్రమాదంలో మరణించింది. ఇప్పుడు అదే పేరున్న మరో నటి కారు ఇలానే యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఇక్కడ ఎవరికీ ఏం కాలేదు. ఇది జరిగిన దాదాపు వారం రోజులు పైనే అయింది. ఇప్పుడు తనకు జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ గురించి 'జబర్దస్త్' ఫేమ్ పవిత్ర బయటపెట్టింది. ప్రాణాలతో బయటపడ్డామని చెబుతూ ఎమోషనల్ అయింది.

(ఇదీ చదవండి: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)

సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించిన పవిత్ర.. 'జబర్దస్త్' షోలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటోంది. గత కొన్నేళ్ల నుంచి ఇదే షోలో చేస్తున్న పవిత్ర.. ఏడాదిన్నర క్రితం కారు కూడా కొన్నది. ఇప్పుడు ఆ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు పిన్ని, పిల్లలతో కలిసి పవిత్ర సొంతూరు వెళ్లింది. కాకపోతే నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి గోతిలో పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చిన్న దెబ్బలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.

'మా పిన్ని, ఆమె పిల్లలిద్దరూ ఫస్ట్ టైమ్ నా కారు ఎక్కారు. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోపు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న వెహికల్ డ్రైవర్ కన్ఫ్యూజ్ చేయడంతోనే మాకు ఇలా జరిగింది. ఎవ్వరికీ ఎలాంటి దెబ్బలు తగలకపోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లే నాకు దెబ్బలేం తగల్లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుటపడటానికి రోజంతా పట్టింది. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ నన్ను గుర్తుపట్టారా కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదు. వీడియోలు తీశారు. అదొక్కటే నాకు బాధగా అనిపించింది' అని చెబుతూ పవిత్ర ఎమోషనల్ అయింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?)

Advertisement
 
Advertisement
 
Advertisement