టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌..! | BCCI Approaches Gautam Gambhir To Become India's Head Coach | Sakshi
Sakshi News home page

టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌..!

Published Sat, May 18 2024 8:29 PM

BCCI approaches Gautam Gambhir to become India's head coach

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 త‌ర్వాత  టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియ‌నున్న విష‌యం విధిత‌మే. భారత హెడ్ కోచ్ ప‌ద‌వికి దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. 

మే 27 లోపు హెడ్ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే భార‌త హెడ్‌కోచ్ రేసులో టీమిండియా మాజీ ఓపెన‌ర్ గౌతం గంభీర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రధాన కోచ్‌గా ఉండాలని గంభీర్‌ను బీసీసీఐ కోరినట్లు స‌మాచారం. గంభీర్ ప్ర‌స్తుతం కేకేఆర్ జట్టుకు గంభీర్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. 

ఐపీఎల్-2024 సీజ‌న్ ముగిసిన త‌ర్వాత గంభీర్‌తో బీసీసీఐ పూర్తి స్ధాయి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. గంభీర్ గ‌తంలో ఎప్పుడూ కోచ్‌గా ప‌నిచేయ‌న‌ప్ప‌టికి మెంటార్‌గా మాత్రం అపార‌మైన అనుభవం ఉంది. 

ప్ర‌స్తుతం కేకేఆర్‌తో పాటు గ‌తంలో రెండు సీజ‌న్ల పాటు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మెంటార్‌గా కూడా గంభీర్ ప‌నిచేశాడు. ప్రస్తుతం అతడు మెంటార్‌గా ఉన్న కోల్‌కతా అద్భుత ఆటతో ఐపీఎల్‌ 2024 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. 

కెప్టెన్‌గా కూడా కేకేఆర్‌కు రెండు సార్లు టైటిల్‌ను గౌతీ అందించాడు. అంతేకాకుండా ఆట‌గాడిగా  గంభీర్ త‌న‌దైన ముద్ర వేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే గౌతీకి భార‌త హెడ్‌కోచ్ బాధ్య‌త‌లు అప్పజెప్పాలని బీసీసీఐ పెద్ద‌లు భావిస్తున్న‌ట్లు వినికిడి.

Advertisement
 
Advertisement
 
Advertisement