హడలెత్తించిన బంగారం, వెండి ధరలు నేడు ఇలా.. | Sakshi
Sakshi News home page

హడలెత్తించిన బంగారం, వెండి ధరలు నేడు ఇలా..

Published Sun, May 19 2024 11:48 AM

gold price today silver rate may 19

దేశవ్యాప్తంగా హడలెత్తించిన బంగారం, వెండి ధరలు ఈరోజు (మే 19) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున తులం బంగారం రూ.880, వెండి కేజీకి ఏకంగా రూ.4000 పెరిగి కొనుగోలుదారులను హడలెత్తించాయి. ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగడంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.68,400 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ. 74,620 వద్ద కొసాగుతున్నాయి.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,550, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.74,770 వద్ద ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,400లుగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.74,620 లుగా ఉన్నాయి.

ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,500 వద్ద 24 క్యారెట్ల పసిడి రూ.74,730 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.68,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.74,620 వద్ద ఉంది.

వెండి ధరలు
దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో క్రితం రోజున వెండి ధర కేజీకి రికార్డు స్థాయిలో రూ.4000 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500 వద్ద కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement
 
Advertisement
 
Advertisement