Stock Market: ముహూరత్‌ ‍ట్రేడింగ్‌ ముగిసిందిలా.. | Stock Market Muhurat Trading Sensex Nifty dips Sun Pharma Tata Steel shine | Sakshi
Sakshi News home page

Stock Market: ముహూరత్‌ ‍ట్రేడింగ్‌ ముగిసిందిలా..

Nov 8 2026 3:57 PM | Updated on Nov 8 2026 4:02 PM

Stock Market Muhurat Trading Sensex Nifty dips Sun Pharma Tata Steel shine

దీపావళి సందర్భంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఆదివారం నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్‌ స్వల్ప నష్టాల్లో ముగిసింది. బ్యాంకులు, ఐటీ షేర్ల ఒత్తిడితో బెంచ్ మార్క్ సూచీలు ప్రతికూలంగా మ్యూట్ నోట్ లో స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 28.62 పాయింట్లు లేదా 0.04 శాతం క్షీణించి 80,999.40 వద్ద ముగిసింది. ఈ స్పెషల్ ట్రేడింగ్ సెషన్ లో నిఫ్టీ ఒక దశలో 25,132 వద్ద గరిష్టానికి ఎగబాకింది. చివరికి 43.95 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 24,986.40 వద్ద స్థిరపడింది

సెన్సెక్స్‌లో సన్ ఫార్మా, టాటా స్టీల్ టాప్‌ గెయినర్స్‌గా లాభాలు పొందగా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.13 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.94 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ అత్యధికంగా లాభపడగా, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ అత్యధికంగా క్షీణించాయి.

అయినా.. దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రత్యేక ట్రేడింగ్‌కు సిద్ధమయ్యాయి. ప్రతి ఏడాది దీపావళి రోజున నిర్వహించే ముహూరత్ ట్రేడింగ్‌ను ఈరోజు (నవంబర్ 8) NSE, BSE ఎక్స్ఛేంజీలు నిర్వహించనున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాది విక్రమ సంవత్ 2083 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక సెషన్ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement