May 19th: ఏపీ పొలిటికల్‌​ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

May 19th: ఏపీ పొలిటికల్‌​ అప్‌డేట్స్‌

Published Sun, May 19 2024 7:01 AM

AP Elections 2024: May 19th Political Updates In Telugu

May 19th AP Elections 2024 News Political Updates

5:40 PM, May 19th, 2024

తిరుపతి: 

టీడిపి కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోంది: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 • లోకేశ్ ట్విట్టర్‌లో  మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడు
 • నారా లోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు
 • పప్పు లోకేష్ అందుకే అనేది
 • దేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేక పోయావు
 • 2013 నుంచి ఆఫ్రికాలో మేము వ్యాపారం చేస్తున్నాం
 • ఇక్కడ నుంచి వాహనాలు, మెషినరీ అక్కడకు పంపిస్తున్నాము,
 • ఫెరో మగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి
 • స్వర్ణ మెటల్స్‌కు 100 వెహికల్స్ అవసరం ఉంది , ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నాము,
 • మేము వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నాము,
 • మేము విదేశాలకు పారిపోతున్నాము అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
 • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
 • పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
 • ఐదేళ్లు నువ్వు మంత్రిగా చేసి, సీటు తెచ్చుకోలేని నువ్వు మాట్లాడతావా
 • బీజేపీ నాయకురాలు హైదారాబాద్‌లో ఓటు ఉంది, చంద్రబాబుకు హైదారాబాద్‌లో ఓటు పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తున్నారు
 • నేను విద్యార్ది దశ నుంచి స్టూడెంట్ యునియన్ నాయకుడిగా చంద్రబాబుకి పోటీగా నిలబడి ఉన్నాను
 • 4వ తేది ఎన్నికలు ఫలితాలు తర్వాత మీరు ఎక్కడ ముఖాలు పెట్టుకుంటారో చూడాలి
 • మేము చేసిన సంక్షేమ పథకాలు వల్లే పోలింగ్ పెరిగింది
 • 4వ తేదీ రిజల్ట్ తర్వాత అన్ని మాట్లాడదాం
 • దేవినేని ఉమా ఇరిగేషన్ శాఖ మంత్రి గా వేల కోట్లు దోచుకున్నది నువ్వు
 • పోలింగ్ శాతం పెరగటానికి మహిళలే కారణం, ఐ పాక్ టీమ్ ఇదే చెప్పింది
 • ఏడు నుంచి 8 శాతం పెరిగింది
 • అందరి కృషివల్లే మేము ఎక్కువ సీట్లు ఘన విజయం సాధిస్తున్నాము
 • చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే ఘర్షణలు కారణం
 • వైఎస్సార్‌సీపీ గతం కంటే ఎక్కువ సీట్లు సాధించడం ఖాయం. మొదటి నుంచి అదే మాట చెప్తున్నా

5:38 PM, May 19th, 2024

అనంతపురం:

తాడిపత్రి లో సిట్ దర్యాప్తు బృందానికి వినతి పత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ టీమ్‌

 • సిట్‌ బృందానికి వినతి పత్రం అందించిన వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నేతలు ఉమాపతి, సత్యనారాయణ రెడ్డి
 • ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
 • ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో దౌర్జన్యం చేసిన పోలీసులపై విచారణ చేయాలని డిమాండ్
 • ఎస్పీ అమిత్ బర్దర్, ఏఎస్పీ రామకృష్ణ చౌదరిలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు
   

5:15 PM, May 19th, 2024

సిట్‌ అధికారులకు నాకు తెలిసిన సమాచారం ఇచ్చా: మంత్రి అంబటి రాంబాబు

 • కన్నా లక్ష్మీనారాయణ దగ్గర కొందరు అధికారులు డబ్బులు  తీసుకున్నారు
 • సిట్‌ అధికారులు అన్ని విషయాలు తెలుసుకుంటారని భావిస్తున్నాను
 • పల్నాడులో జరిగిన హింసకు కారణం చంద్రబాబే
 • నా నియోజకవర్గంలో శాంతి భద్రతలు లేవు.. గ్రామాలు వదిలి వెళ్లిపోయారు
 • కొండపిలో ముస్లింలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు
 • గ్రామాలు విడిచి వెళ్లిన వారిని తిరిగి రప్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది
 • అలసత్వం వహించిన వారిపై సిట్‌ అధికారులు చర్యలు తీసుకోవాలి
 • జూన్‌ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు

3:50 PM, May 19th, 2024

పల్నాడు:

 • సిట్‌ బృందాన్ని కలిసిన మంత్రి అంబటి
  పలు విషయాలు సిట్‌ బృందానికి నివేదించిన అంబటి
  ఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడూ జరగలేదు
  పోలీసులతో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారు. 
  దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు
  పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై కూడా సిట్‌ బృందానికి అంబటి వివరించారు

3:00 PM, May 19th, 2024

కృష్ణాజిల్లా:
మరోసారి గన్నవరం ఎయిర్ పోర్టులో ఉయ్యూరు లోకేష్ బాబు

 • అదుపులోకి తీసుకున్న పోలీసులు
 • రెండ్రోజుల క్రితం అనుమానాస్పదంగా ఎయిర్ పోర్ట్ లో తిరిగిన ఉయ్యూరు లోకేష్
 • సీఎం జగన్ పర్యటన ఎయిర్ పోర్టుకు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు ప్లాన్ చేసిన లోకేష్
 • తనిఖీల్లో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు
 • 41ఏ నోటీస్ ఇచ్చి శనివారం పంపించిన పోలీసులు
 • తిరిగి ఆదివారం మరోసారి డిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన లోకేష్‌
 • ఎయిర్ పోర్ట్ అధికారుల తనిఖీల్లో శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్న లోకేష్
 • గన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎయిర్ పోర్ట్ అధికారులు
 • లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు
 • కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్న లోకేష్
   

12:30 PM, May 19th, 2024
తిరుపతిలో సిట్‌ బృందం పరిశీలన

 • తిరుపతి జిల్లా..

 • చంద్రగిరి మండలం కూచివారిపల్లిలో సిట్  బృందం పరిశీలన

 • టీడీపీ నాయకుల దాడిలో ధ్వంసమైన కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇల్లును  పరిశీలించిన బృందం

 • చంద్రగిరి వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్‌మెన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్న సిట్ బృందం

 • సీఐ రామయ్య, కానిస్టేబుల్ వెంకటరమణను ఆరోజు జరిగిన సంఘటన గురించి వివరాలు తెలుసుకున్న సిట్ అధికారులు

 

 

11:45 AM, May 19th, 2024
టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ తండ్రి మృతి..

 • శ్రీకాకుళం
 • టీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ తండ్రి మృతి
 • గురువారం వైఎస్సార్‌సీపీ ఏజెంట్ మాధవరావు తండ్రి తోట మల్లేష్‌పై అచ్చెన్నాయుడు అనుచరుల దాడి
 • కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ బూత్-288లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న మాధవరావు
 • మాధవరావు కుటుంబ సభ్యులపై ఒక్కసారిగా దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు
 • మాధవరావు తండ్రి తోట మల్లేష్ గుడిలో పూజ చేస్తుండగా దాడికి పాల్పడిన అచ్చెన్నాయుడి అనుచరులుదాడిలో తీవ్రంగా గాయపడిన తోట మల్లేష్ రావు.
 • వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు తరలింపు.
 • పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించిన వైద్యులు
 • చికిత్స పొందుతూ కేజీహెచ్‌లో మరణించిన తోట మల్లేశ్వరరావు

 

11:10 AM, May 19th, 2024
ఎన్నికల విధులకు వెళ్తూ ఏఎస్‌ఐ రమణ మృతి

 • ఎన్టీఆర్ జిల్లా
 • ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన విజయవాడ సీపీఎస్ ఏఎస్ఐ రమణ
 • రమణను వేగంగా ఢీకొట్టిన ఎర్టిగా కారు.
 • తీవ్రగాయాల పాలైన రమణ..
 • పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు
 • చికిత్సపొందుతూ మృతి చెందిన రమణ
   

 

10:40 AM, May 19th, 2024
పరారీలో చింతమనేని..

 • ఏలూరు జిల్లా
 • పరారీలో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
 • ఈనెల 16 రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన చింతమనేని
 • బెంగళూరు వెళ్ళినట్టు ప్రాథమిక సమాచారం
 • ఆయనతోపాటు మరో 14 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తింపు
 • హత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి సినీ పక్కిలో దౌర్జన్యం చేసి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేని
 • చింతమనేనితో పాటు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు
 • చింతమనేని అతని అనుచరులను పట్టుకునేందుకు ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీంలు ఏర్పాటు
 • చింతమనేని అతని  అనుచురులపై సెక్షన్ 353, 224, 225, 143, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు
 • చింతమనేని కేసును పర్యవేక్షిస్తున్న నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్య
 • ముద్దాయి రాజశేఖర్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పెదవేగి పోలీస్ సిబ్బంది.
 • కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన ఏలూరు జిల్లా కోర్టు.
 • రిమాండ్ విధించిన ముద్దాయిని ఏలూరు జిల్లా సబ్ జైలుకు తరలించిన పెదవేగి పోలీస్ సిబ్బంది.

 

10:00 AM, May 19th, 2024
ఏపీలో దూకుడు పెంచిన సిట్‌

 • ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్
 • పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై దర్యాప్తు జరుపుతున్న సిట్
 • మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై ప్రధానంగా దృష్టిసారించిన సిట్
 • అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదారాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు గుర్తించిన సిట్
 • సోమవారం ఈసీకి నివేదిక ఇవ్వనున్న సిట్ సారథి వినీత్ బ్రిజిలాల్
 • ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో పని ప్రారంభించిన సిట్ బృందాలు
 • అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్న సిట్
 • సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్న సిట్
   

9:30 AM, May 19th, 2024
ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై చర్యలు..

 • చిత్తూరు జిల్లా
 • జిల్లావ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరు కానీ అధికారులపై చర్యలు
 • జిల్లాలో 228 మంది పీవో, ఏపీవో, ఓపీవోలపై  క్రమశిక్షణ చర్యలు 
 • జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.షన్మోహన్
   

8:00 AM, May 19th, 2024
నెల్లూరులో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌..

 • ఎస్పీ ఆరిఫ్ హఫీస్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలోని  పోలీస్ స్టేషన్‌ పరిధిలో కార్డన్ సెర్చ్
 • జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్డెన్ సర్చ్ నిర్వహణ  
 • సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్
 • అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
   

7:00 AM, May 19th, 2024
మాట నిలుపుకున్న సీఎం జగన్

 • విజయవాడ
 • మాట నిలుపుకున్న సీఎం జగన్ ప్రభుత్వం
 • ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ నిధులు జమ
 • నాలుగు రోజుల్లో రూ.5,868 కోట్లు నిధులు జమ
 • వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ.1843 కోట్లు జమ
 • ఇన్‌ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో రూ.1236 కోట్లు జమ
 • వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1552 కోట్లు జమ
 • ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ.629 కోట్లు జమ
 • జగనన్న విద్య దీవెన ఫీజు రియంబర్స్‌మెంట్ కింద రూ.605 కోట్లు జమ
 • ఎన్నికల కమిషన్ అడ్డుకోవడంతో ఇన్నాళ్లు ఆగిన నిధుల జమ
 • ఈసీకి తీవ్రంగా చీవాట్లు పెట్టిన ఎన్నికల కమిషన్
 • సీఎం జగన్ హామీ ఇచినట్టుగానే ఎన్నికలు అవ్వగానే చెల్లింపులు

 

6:50 AM, May 19th, 2024
తాడిపత్రి చేరుకున్న సిట్ బృందం

 • అనంతపురం:
 • తాడిపత్రి చేరుకున్న సిట్ బృందం
 • పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై విచారణ చేపట్టిన సిట్ బృందం సభ్యులు
 • టీడీపీ నేతలు రాళ్లు రువ్విన జూనియర్ కాలేజీ మైదానాన్ని పరిశీలించిన సిట్ బృందం సభ్యులు

 

6:40 AM, May 19th, 2024
పల్నాడుపై పగబట్టిన బాబు

 • టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులు
 • నాటి నుంచి నేటి వరకు అదే తీరు
 • 2020లో కాజ టోల్‌గేట్‌ వద్ద పిన్నెల్లిపై దాడి
 • విజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబు
 • ఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీ
 • అభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం 

 

6:30 AM, May 19th, 2024
అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్

 • రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడు
 • ప్రణాళిక బద్ధంగా  వైస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు
 • గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు
 • ఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడు
 • ఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్‌సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి
 • అమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడు
 • ఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడు
 • టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది
 • కులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడు
 • ప్రజలే బాబుకి బుద్ధి చెబుతారు
 • వైస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండి
 • టీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం

Advertisement
 
Advertisement
 
Advertisement