ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు | Sakshi
Sakshi News home page

ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు

Published Sun, May 19 2024 5:14 PM

Actress Faima Introduce her Boyfriend

తమదైన కామెడీ టైమింగ్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని నవ్వించే ఫైమా నేడు పుట్టినరోజు జరుపుకుంది. ఈ క్రమంలో తన అభిమానులకు పెద్ద షాకింగ్‌ న్యూస్‌ షేర్‌ చేసింది.  తన బాయ్‌ఫ్రెండ్‌ను ఆమె రివీల్‌ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

తాజాగా ఫైమా తన బాయ్‌ఫ్రెండ్‌తో పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసుకుంది.  తన ప్రేమికుడు ప్రవీన్‌ నాయక్‌ అని పరిచయం చేసింది. ఆ ఫోటోలను ప్రవీన్‌ నాయక్‌ కూడా షేర్‌ చేశాడు. ఈ క్రమంలో అతను ఇలా చెప్పుకొచ్చాడు. 'నా ప్రియిమైన లవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మన ప్రేమ మొదలయ్యి 5 సంవత్సరాలైంది. ఇన్నిరోజులు ఎలా గడిచిపోయాయో తెలీదు.   నా జీవితం మొత్తం నీతోనే గడపాలని ఉంది. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను.' అని అతను తెలిపాడు. దీనికి ఫైమా మద్ధతు ఇస్తూ వాటిని షేర్‌ చేసింది.

ప్ర‌వీణ్‌తో ల‌వ్‌!
ప్రముఖ కామెడీ  షోలోని మ‌రో క‌మెడియ‌న్ ప్ర‌వీణ్‌తో ఫైమా ప్రేమాయ‌ణం న‌డుపుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఒక ఇంటర్వ్యూలో ప్ర‌వీణ్ మాట్లాడుతూ తన ప్రేమన ఫైమా రిజెక్ట్‌ చేసిందని కూడా వెళ్లడించాడు. ఫైమాతో బ్రేకప్‌ అయినట్లు చెప్పాడు. కానీ ఫైమా మాత్రం ప్రవీణ్‌ను ప్రేమించలేదని తెలిపింది. ఆన్‌స్క్రీన్‌లో జోడీగా చూపించేందుకే తమను జంటగా ఆదరించారని పేర్కొంది. కానీ,  ప్ర‌వీణ్‌కు, తనకు మ‌ధ్య కొన్ని వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లున్నాయని, అవి చెప్పుకోలేమని అందుకే దూరం కావాల్సి వ‌చ్చినట్లు ఆమె తెలిపింది. ప్రవీణ్‌ మాత్రం తామిద్దరం లవ్‌లో ఉన్నామని తెలిపాడు.

నెటిజన్లు నుంచి విమర్శలు
ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నప్పుడు ప్రవీణ్‌తో ఎందుకు ప్రేమలో ఉన్నావ్‌ అని కొందరు నెట్టింట ఫైమాను ప్రశ్నిస్తున్నారు. అతన్ని బకరాను చేసి ఆడుకున్నావ్‌ కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రవీణ్‌ను బాగా ఉపయోగించుకున్నావ్‌ నీ లిస్ట్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారు రాధికా అక్క అంటూ డీజే టిల్లు డైలాగ్స్‌ పేలుస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement