ఐశ్వర్య రాయ్ చేతికి సర్జరీ.. డాక్టర్స్‌ సూచనతోనే కేన్స్‌లో మెరిసిందా? | Aishwarya Rai Bachchan To Undergo Wrist Surgery Next Week | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య రాయ్ చేతికి సర్జరీ.. డాక్టర్స్‌ సూచనతోనే కేన్స్‌లో మెరిసిందా?

May 19 2024 4:03 PM | Updated on May 19 2024 4:43 PM

Aishwarya Rai Bachchan To Undergo Wrist Surgery Next Week

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసింది. తాజాగా ఆమె తన కూమార్తెతో ఫ్రాన్స్‌ నుంచి ముంబైకి తిరిగొచ్చింది. గత 20 ఏళ్లుగా కేన్స్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌పై ఆమె మెరుస్తూనే ఉంది. అయితే ఈసారి తన చేతికి గాయం అయింది. దానిని ఏమాత్రం లెక్కచేయని ఐశ్వర్య  నూతన డిజైనర్‌ దుస్తుల్లో కార్పెట్‌పై హొయలుపోతూ కనిపించింది.

యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చిత్రోత్సవాల్లో పాల్గొనడం అంటే ఆ హీరోయిన్లకు దక్కిన గౌరం అని అందరూ అంటారు. కానీ, ఐశ్వర్య గ్లామర్‌తో ఆ ఫెస్టివల్‌కు మరింత అందాన్ని ఇచ్చిందని ఆమె అభిమానులు అంటారు. ఐశ్వర్య చేతికి గాయం కావడంతో ఆమె అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. అయితే, తన కుమార్తె ఆరాధ్య సాయంతో ఆమె కేన్స్‌లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఐశ్వర్యరాయ్ గత వారాంతంలో మణికట్టుకు గాయమైంది, గాయం ఉన్నప్పటికీ, ఆమె ఈ సంవత్సరం కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. నిపుణులు, వైద్యులతో చర్చించిన తర్వాతే ఆమె ఫ్రాన్స్ వెళ్లారు. త్వరలో ఆమె చేతికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే వారంలో ఆమె చేతికి శస్త్రచికిత్స చేయించుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement