సీఎస్‌కేతో ఆర్సీబీ కీల‌క పోరు.. తుది జట్లు ఇవే | Chennai Super Kings win toss, opt to field first against RCB | Sakshi
Sakshi News home page

IPL 2024: సీఎస్‌కేతో ఆర్సీబీ కీల‌క పోరు.. తుది జట్లు ఇవే

May 18 2024 7:17 PM | Updated on May 18 2024 7:29 PM

Chennai Super Kings win toss, opt to field first against RCB

ఐపీఎల్‌-2024లో కీల‌క పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 

కీల‌క మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు ఒకే మార్పుతో బ‌రిలోకి దిగాయి. ఆర్సీబీ జ‌ట్టులోకి విల్ జాక్స్ స్ధానంలో మ్యాక్స్‌వెల్ రాగా.. సీఎస్‌కే జ‌ట్టులోకి మిచెల్ శాంట్న‌ర్ వ‌చ్చాడు. కాగా ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధించాలంటే ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కం.

తుది జ‌ట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్‌), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్

చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్‌), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement