నేను గెలిస్తే సినిమాలు మానేస్తా.. కంగనా సంచలన నిర్ణయం | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: సినిమా ఇండస్ట్రీ అనేదే ఫేక్‌.. ఎంపీగా గెలిస్తే యాక్టింగ్‌ వదిలేస్తా..!

Published Sun, May 19 2024 4:46 PM

Kangana Ranaut: I Will Quit Bollywood After Winning Lok Sabha Elections

ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్లలో కంగనా రనౌత్‌ ఒకరు. ఏదీ దాచకుండా, దేనికీ భయపడకుండా డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌గా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే ఈమెను బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ అంటుంటారు. ఈ బ్యూటీ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగింది.

గెలిస్తే అంతే!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా తన సినీప్రయాణంపై షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. 'నేను ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్‌బై చెప్తాను. ఎందుకంటే ఈ సినీ ప్రపంచం అనేది అంతా ఒక అబద్ధం. కనిపించేంత అందంగా, వాస్తవికంగా ఉండదు. పైగా నాకు ఒకే పని ఎక్కువకాలం చేయాలనిపించదు. అందుకే హీరోయిన్‌గా బోర్‌ కొట్టినప్పుడు కథలు రాస్తుంటాను. సినిమాలను డైరెక్ట్‌ చేస్తుంటాను, నిర్మిస్తాను. ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తాను' అని చెప్పుకొచ్చింది.

ఆ చిత్రాలతో ఫేమస్‌
గ్యాంగ్‌స్టర్‌ సినిమాతో హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్‌ క్వీన్‌, తను వెడ్స్‌ మను, తను వెడ్స్‌ మను రిటర్న్స్‌ వంటి సినిమాలతో ఫేమస్‌ అయింది. ఆమె దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీలో కంగనా దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఇది కాకుండా సీత: ద ఇన్‌కార్నేషన్‌, నోటి బినోదిని, అలాగే మాధవన్‌తో ఓ థ్రిల్లర్‌ సినిమా ఆమె చేతిలో ఉన్నాయి.

చదవండి: 40 ఏళ్లుగా కాపురం.. మా బంధం సక్సెస్‌ అవడానికి అదే కారణం!

Advertisement
 
Advertisement
 
Advertisement