థాయ్‌లాండ్ ఓపెన్ విజేత‌గా సాత్విక్‌-చిరాగ్ జోడీ | Satwiksairaj Rankireddy-Chirag Shetty Crowned Thailand Open Mens Doubles Champions | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్ ఓపెన్ విజేత‌గా సాత్విక్‌-చిరాగ్ జోడీ

May 19 2024 5:13 PM | Updated on May 19 2024 5:13 PM

Satwiksairaj Rankireddy-Chirag Shetty Crowned Thailand Open Mens Doubles Champions

థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల  డబుల్స్ టైటిల్ విజేత‌గా  భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి నిలిచారు. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో చైనాకు చెందిన చెన్ బో యాంగ్, లియు యిపై  21-15 21-15 తేడాతో విజ‌యం సాధించిన ఈ భార‌త ద్వ‌యం.. తొమ్మిదవ  వరల్డ్ టూర్ టైటిల్ త‌మ ఖాతాలో వేసుకున్నారు.

వ‌రుస గేమ్‌లలో ప్ర‌త్య‌ర్ధి జోడీని  ప్రపంచ నం.3 సాత్విక్‌ ద్వయం చిత్తు చేసింది. ఏ ద‌శ‌లోనూ ప్ర‌త్య‌ర్ధికి కోలుకునే అవ‌కాశం సాత్విక్‌, చిరాగ్ జంట ఇవ్వ‌లేదు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు టైటిల్‌ను సొంతం చేసుకోవడం ఈ జోడికి మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది. 

ఇక ప్ర‌స్తుత బీడ‌బ్ల్యూఎఫ్‌ సీజ‌న్‌లో ఈ జోడికి ఇది రెండువ టైటిల్ కావ‌డం విశేషం. అంతకుముందు మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ టైటిల్‌ను ఈ జోడీ సొంతం చేసుకుంది. అదేవిధంగా మలేషియా సూపర్ 1000,ఇండియా సూపర్ 750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement