విజయవాడ: వాహనం ఢీ కొట్టి ఏఎస్‌ఐ మృతి | Sakshi
Sakshi News home page

విజయవాడ: వాహనం ఢీ కొట్టి ఏఎస్‌ఐ మృతి

Published Sun, May 19 2024 11:34 AM

ASI Died In Road Accident

ఎన్టీఆర్ జిల్లా:  ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళ్తండగా మృత్యువు రూపంలో వచ్చిన కారు ఏఎస్‌ఐ ప్రాణాలను బలిగొంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన హైదరాబ్‌ టు విజయవాడ హైవేలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

హైవేకి ఆనుకుని ఉన్న సడక్ రోడ్డు వద్ద అధికారులు పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. సరిగ్గా ఆ ప్రదేశంలోనే రోడ్డు దాటుతుండగా సీపీఎస్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ రమణ మీదకు కారు దూసుకుపోయింది. దీంతో ఏఎస్‌ఐ రమణ తీవ్రగాయాల పాలయ్యారు. సంఘటన స్థలంలో ఉన్న మిగతా పోలీసులు స్పందించి హుటహుటాని రమణను విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement