విరాట్ కోహ్లి హాఫ్ సెంచ‌రీ మిస్‌.. అనుష్క శ‌ర్మ రియాక్ష‌న్ వైర‌ల్‌ | Sakshi
Sakshi News home page

CSK vs RCB: విరాట్ కోహ్లి హాఫ్ సెంచ‌రీ మిస్‌.. అనుష్క శ‌ర్మ రియాక్ష‌న్ వైర‌ల్‌

Published Sat, May 18 2024 11:42 PM

Anushka Sharma Reaction As Virat Kohli Misses 50 Against CSK

ఐపీఎల్‌-2024లో విరాట్ కోహ్లి త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి స‌త్తాచాటాడు. తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని విరాట్ కోల్పోయాడు. 

29 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47 పరుగులు చేశాడు. సీఎస్‌కే స్పిన్నర్‌ శాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. డారిల్ మిచెల్ అద్బుతమైన క్యాచ్‌తో కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. 

10 ఓవర్ వేసిన  శాంట్నర్ బౌలింగ్‌లో నాలుగో బంతిని కోహ్లి లాంగాన్ దిశగా బిగ్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో  బౌండరీ లైన్ వద్ద ఉన్న మిచెల్‌  టైమింగ్లో  జంప్‌ చేస్తూ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. 

 కానీ బ్యాలెన్స్‌ కోల్పోయిన అతడు వెంటనే చాకచక్యంగా బంతిని గాల్లోకి లేపి మళ్లీ బౌండర్‌ లైన్ లోపలకి వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే మిచెల్ బౌండరీ రోప్‌కు తాకడాని అంతా భావించారు. కానీ రీప్లేలో అతడు క్లీన్ క్యాచ్ అందుకున్నట్లు తేలింది. 

ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న కోహ్లి సతీమణి అనుష్క శర్మ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement