ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్‌తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ | Sakshi
Sakshi News home page

ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్‌తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ

Published Sat, May 18 2024 9:25 PM

Citroen To Supply 1000 Electric Cars to OHM E Logistics Details

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఎప్పటికప్పుడు తన ఉనికిని పెంచుకుంటూనే ఉంది. ఫ్యూయెల్ కార్లతో పాటు, ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఈ కంపెనీ ఇటీవల హైదరాబాద్‌కు చెందిన OHM E లాజిస్టిక్స్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

OHM E లాజిస్టిక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సిట్రోయెన్ 1000 ఈ-సీ3 ఎలక్ట్రిక్ వాహనాలను దశల వారీగా సరఫరా చేయనుంది. మొదటి ఫ్లీట్ ఇండక్షన్ దశలో కంపెనీ 120 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేయనుంది. ఆ తరువాత 12 నెలల్లో మరో 880 కార్లను డెలివరీ చేస్తుంది.

అక్టోబర్ 2022లో కేవలం 100 ఎలక్ట్రిక్ క్యాబ్‌లతో ప్రారంభమైన ఓహెచ్ఎమ్ ఇప్పుడు విస్తృతమైన సేవలు అందిస్తోంది. సిట్రోయెన్ ఈ-సీ3 ఎలక్ట్రిక్ కార్లు ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతూ భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని ఉత్పత్తులను దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Advertisement
 
Advertisement
 
Advertisement