ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ.. | Sakshi
Sakshi News home page

Thailand Open Final: ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ..

Published Sat, May 18 2024 5:52 PM

Satwiksairaj -Chirag Shetty Pair Enters Thailand Open Final

థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఫైన‌ల్లో అడుగుపెట్టారు. 

శ‌నివారం జ‌రిగిన సెమీఫైన‌ల్లో చైనీస్ తైపీకి చెందిన లు మింగ్-చే-టాంగ్ కై-వీపై  21-11 21-12 తేడాతో సాత్విక్‌-చిరాగ్ ద్వ‌యం విజ‌యం సాధించింది.

కేవ‌లం 35 నిమిషాల్లో మ్యాచ్‌ను ఈ జంట ఫినిష్ చేసింది. వ‌రుస రెండు గేమ్‌ల‌లోనూ వీరిద్ద‌రూ ప్ర‌త్య‌ర్ధి జోడీపై పూర్తి ఆధిప‌త్యం చెలాయించారు.

ఇక ఆదివారం జ‌ర‌గ‌నున్న తుది పోరులో చైనా జోడీ చెన్‌బో యాంగ్‌-లియు యితో భార‌త టాప్ సీడ్ సాత్విక్, చిరాగ్ ద్వ‌యం త‌ల‌ప‌డ‌నుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement