భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా? | Sakshi
Sakshi News home page

భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?

Published Sun, May 19 2024 12:32 PM

Nayanthara And Vignesh Visit Indian Temples

సౌత్‌ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార సిండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు దాటినా ఆమె క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే   దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కాస్మొటిక్స్‌ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది.  తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఈ మధ్య ఎక్కువగా ఆమె పలు దేవాలయాల చుట్టు తిరుగుతూ తన భర్తతో కలిసి పూజలు నిర్వహిస్తుంది. దీంతో వరుసగా పుణ్యక్షేత్రాలు, ప్రత్యేక పూజలు చేయడం వెనుక కారణం ఏమైనా ఉందా..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒకటే చర్చ జరుగుతుంది.

నయనతార జాతకంలో దోషం ఉందని, అందుకే విక్కీతో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఆమె పలు దేవాలయాలను సందర్శిస్తూ పూజలు, పరిహారాలు చేస్తోందని ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలకు కూడా కాస్త బ్రేక్‌ ఇచ్చి మరీ.. పుణ్యక్షేత్రాల చుట్టూ ఆమె తిరగడం విశేషం. వాస్తవంగా నయనతారకు కాస్త దైవభక్తి ఎక్కువేనని చెప్పవచ్చు. తన వివాహం అయిన వెంటనే ఆ పట్టు వస్త్రాలతోనే తిరుమల శ్రీవారిని ఆమె సందర్శించిన విషయం తెలిసిందే. వారి పెళ్లి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

కొద్దిరోజుల క్రితం నయన్‌,విక్కీ విడిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వారు క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పడింది. ఇలాంటి వార్తలు వచ్చిన కొద్దిరోజుల తర్వాత నయనతార జంటగా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారని సమాచారం.  తన భర్తతో కలిసి సంతోషంగా జీవించేందుకు పలు పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement