సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్‌, అఖిలేష్‌ | Sakshi
Sakshi News home page

సభలో గందరగోళం... మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్‌, అఖిలేష్‌

Published Sun, May 19 2024 3:45 PM

Stampede Like Situation In Rahul Ak​hilesh Meeting

లక్నో: తొక్కిసలాట పరిస్థితులు తలెత్తడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఒక బహిరంగ సభ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ ఘటన ఆదివారం(మే19) ప్రయాగ్‌రాజ్‌లోని పుల్పూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో  జరిగింది.

సభా వేదికను చేరుకోవడానికి ఇటు ఎస్పీ, అటు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలకు సర్దిచెప్పడానికి రాహుల్‌, అఖిలేష్‌ ప్రయత్నించినప్పటికీ వారు వినకపోవడంతో భద్రతా పరమైన సమస్యలు వస్తాయని పోలీసులు హెచ్చరించారు. దీంతో రాహుల్‌,అఖిలేష్‌ ప్రసంగించకుండా మధ్యలోనే వెనుదిరిగారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement