మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్‌ | Sakshi
Sakshi News home page

మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్‌

Published Sun, May 19 2024 3:17 PM

Vuyyuru Lokesh Arrested Again At Gannavaram Airport

సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్‌ బాబును మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్‌ అనుమానాస్పదంగా తిరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటన ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు లోకేష్‌ ప్లాన్ చేయగా, తనిఖీల్లో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41ఏ నోటిస్‌ ఇచ్చిన శనివారం పంపించారు.

తిరిగి ఆదివారం మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్‌ వచ్చాడు. ఎయిర్ పోర్ట్ అధికారుల తనిఖీల్లో లోకేష్‌ నుంచి శాటిలైట్ ఫోన్‌ బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇవ్వగా, లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా లోకేష్‌ శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నాడు. తుళ్ళూరు మండలం వెంకటాయపాలెంకు చెందిన లోకేష్.. గతంలో అమెరికాలో డాక్టర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. లోకేష్‌ను గన్నవరం పోలీసులు విచారిస్తున్నారు.

లోకేష్‌ గురించి షాకింగ్‌ నిజాలు..
గన్నవరం ఎయిర్‌పోర్టులో అరెస్టయిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ ఉయ్యూరు లోకేష్‌ గురించి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు ప్రముఖ వైద్య నిపుణులు వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి. తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేయడం.. కోర్టు చేత చివాట్లు తినడం.. టీడీపీ సానుభూతిపరుడైన ఇతగాడి చరిత్ర.. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై ఆధారాలు లేకుండా వేసిన తప్పుడు కేసులను వాషింగ్టన్ డీసీ కోర్టు కొట్టివేయడంతో పాటు లోకేష్‌కు ఫైన్‌ కూడా వేసిందని వాసుదేవారెడ్డి తెలిపారు. వైద్య వృత్తిలో నిర్లక్ష్యం కారణంగా గతంలో న్యూయార్క్‌, వర్జీనియా వంటి కొన్ని రాష్ట్రాలు.. లోకేష్‌ మెడికల్‌ లైసెన్స్‌  కూడా రద్దు చేశాయి.. లోకేష్‌ గురించి షాక్‌ అయ్యే నిజాలను పూర్తి వీడియోలో చూడొచ్చు.

 


 

Advertisement
 
Advertisement
 
Advertisement