ఈ డివైజ్‌తో క్షణాల్లో సిల్కీ హెయిర్‌ సొంతం! | Sakshi
Sakshi News home page

ఈ డివైజ్‌తో క్షణాల్లో సిల్కీ హెయిర్‌ సొంతం!

Published Sun, May 19 2024 4:36 PM

This Devise To Get Shiny Smooth Hair

సాఫ్ట్‌ అండ్‌ సిల్కీ హెయిర్‌ని ఇష్టపడనిదెవరు.. దానికోసం కష్టపడనిదెవరు! ఆ తలకట్టు కోసం పార్లర్‌లు, హెయిర్‌ స్పాల చుట్టూ తిరగడం ఆపి ఈ చిత్రంలోని హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ అప్లికేటర్‌ను తెచ్చుకోండి. ఇది జుట్టును క్షణాల్లో మృదువుగా మార్చేస్తుంది.

ఈ డివైస్‌.. అరచేతిలో అమరిపోయే చంద్రవంకలా కనిపిస్తుంది. వెనుకవైపు ఉన్న మినీ ట్యాంకర్‌లో నీళ్లతో పాటు.. సీరమ్‌ లేదా లోషన్‌  వంటివి మిక్స్‌ చేసి బటన్‌ నొక్కితే ఆవిరి రూపంలో బయటికి వస్తుంది. ఆ ఆవిరిని జుట్టు మొత్తానికి పట్టించుకుంటే చాలు.. సెట్‌ చేసిన హెయిర్‌ స్టైల్‌ సెట్‌ చేసినట్లుగా.. కదలకుండా ఆకర్షణీయంగా నిలుస్తుంది.

అధునాతన మైక్రోటెక్నాలజీతో రూపొందిన ఈ మెషిన్‌తో.. జుట్టుకే కాదు ముఖానికీ ఆవిరి పట్టుకోవచ్చు. ఈ మినీ ట్యాంకర్‌ను డివైస్‌ నుంచి సులభంగా వేరు చేసుకోవచ్చు. అలాగే ఆ ట్యాంకర్‌కి ప్రత్యేకమైన లాకర్‌ లాంటి మూత ఉంటుంది. దాన్ని బాటిల్‌ మూతలా బిగించుకుంటే సరిపోతుంది. ఈ డివైస్‌ చాలా రంగుల్లో లభిస్తోంది. ఇది అన్ని రకాల జుట్టు స్వభావాలకు అనుకూలమైనది! 

(చదవండి: 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement