
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంతోషం వచ్చినా.. కోపం వచ్చినా అస్సలు ఆగరు. తాజాగా టైమ్ మ్యాగజైన్ ఆయన్ని పొడుగుతూ ఓ కథనం ఇచ్చింది. అయినా కూడా ట్రంప్‌కు బాగా కోపం వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
టైమ్ మ్యాగజైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా సోషల్ ట్రూత్‌లో ఓ పోస్ట్ పెట్టారు(Trump Angry On Time Magazine). కవర్ పేజీపై తన ఫొటోలో జుట్టు సరిగా కనిపించకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఇంతకీ ఆయన ఆ పోస్టులో ఏమన్నారంటే..
నా గురించి వచ్చిన కథనం కొంతవరకు బాగానే ఉంది. కానీ కవర్‌పై ఉన్న ఫోటో మాత్రం చరిత్రలోనే చెత్త ఫోటో. వాళ్లు నా జుట్టును కనిపించకుండా చేశారు. నా జుట్టును తలపై చిన్న తలపాగా.. ఏదో తేలియాడుతున్నట్లుగా చూపించారు. ఇది చాలా విచిత్రంగా అనిపించింది. నాకు ఎప్పుడూ కింది యాంగిల్ నుంచి తీసే ఫోటోలు నచ్చవు. ఇది మాత్రం చాలా చాలా చెత్త ఫొటో. అందుకే దీన్ని తప్పక విమర్శించాలి. అసలు వాళ్లు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?’’ అంటూ ట్రంప్ మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డారు.

ఇదిలా ఉంటే టైమ్ మ్యాగజైన్‌ను ట్రంప్ కోపడ్డడం ఇదే తొలిసారేం కాదు. ఫిబ్రవరిలో.. డోజ్ చీఫ్‌గా ఉన్న ఎలాన్ మస్క్ ఓవల్ ఆఫీస్‌లో రెజల్యూట్ డెస్క్ మీద కూర్చున్నట్లు ఓ ఫొటోను ప్రచురించింది. ట్రంప్ ఆ ఫొటోపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తుంది అనుకోలేదు అంటూ వెటకారం ప్రదర్శించారు. అదే సమయంలో.. అయితే మస్క్ పని తీరును ఆ సమయంలో ఆయన ప్రశంసించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ట్రంప్ మీద టైమ్ మాగజైన్ His Triumph అనే శీర్షికతో కవర్ పేజీ ఇచ్చింది. గాజా శాంతి ఒప్పందంలో ఆయన చేసిన కృషికిగానూ ఈ కథనం ప్రచురించింది. ఈ ఒప్పందంతోనే 20 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేయగా.. ఇజ్రాయెల్ సుమారు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను, 360 మంది పాలస్తీనీయుల మృతదేహాలను విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ ఏడాదిలోనే తాను పలు యుద్ధాలను ఆపానంటూ ట్రంప్ నోబోల్ శాంతి బహుమతి డిమాండ్ చేయగా.. రూల్స్ అడ్డురావడంతో ఆయన కల నెరవేరలేదు!. దీంతో వచ్చే ఏడాదైనా దక్కవచ్చనే ఆశ పెట్టుకున్నారాయన.
ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇదీ.. ఇంత భజనా?