Lok Sabha Election 2024: అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌కు ఈసీ నోటీసులు | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌కు ఈసీ నోటీసులు

Published Sat, May 18 2024 5:28 AM

Lok Sabha Election 2024: EC issues notice to former Calcutta HC judge Abhijit Gangopadhyay for undignified remarks against Mamata

మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలకు.. 

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హైకోర్టు మాజీ జడ్జి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌కు ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసు జారీచేసింది. ‘మమతా బెనర్జీ మీరు ఎంతకు అమ్ముడుపోయారు? మీ రేటు 10 లక్షలు, ఎందుకంటే మీరు కేయా సేథ్‌తో మేకప్‌ చేయించుకుంటున్నారు. 

మమత అసలు మహిళేనా? అని నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటా’ అని అభిజిత్‌ ఇటీవల  ప్రచారసభలో వ్యాఖ్యానించారు. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఒబ్రియాన్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. న్యాయవ్యవస్థలో ఉన్నత పదవిని నిర్వహించిన వ్యక్తి మహిళల గౌరవానికి భంగం కలించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దీనిపై స్పందించిన ఈసీ ఈనెల 20వ తేదీ  సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌కు నోటీసులు జారీచేసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement