Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Who is Noor Wali Mehsud New Trouble Maker For Pak From Afghanistan1
ఎవడ్రా సామి నువ్వు.. పాక్‌ను ఇంతలా వణికిస్తున్నావ్‌?

అది కాబూల్‌లోని ఓ మారుమూల కొండ ప్రాంతం. ఓ టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ వాహనం నిదానంగా వెళ్తోంది. ఓ క్షిపణి రయ్‌మంటూ దూసుకొచ్చి ఆ వాహనాన్ని ఢీ కొట్టింది. ‘హమ్మయ్యా..’ అంటూ పాక్‌ సైన్యం సంబురాలు చేసుకుంది. కట్‌ చేస్తే.. ఆ మరుసటిరోజే ‘నేను అమరుడ్ని..’ అనే రేంజ్‌లో ఓ వ్యక్తి వాయిస్‌తో ఆడియో క్లిప్‌ బయటకు వచ్చింది. అంతే పాక్‌ సైనికాధికారుల ముఖంలో సంతోషం పోయి.. మళ్లీ తలపట్టుకున్నారు. పాకిస్తాన్‌-అఫ్గనిస్తాన్‌ మధ్య గత 10 రోజులుగా పరస్పర దాడులతో యుద్ధ పరిస్థితులు నెలకొన్నది చూస్తున్నదే!. ఈ దరిమిలా 48 గంటల కాల్పుల విరమణతో పరిస్థితి కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. అయితే.. ఒకప్పుడు జగ్రి దోస్తులుగా ఉన్న ఈ రెండు దేశాలు దుష్మన్‌లుగా మారడానికి కారణం.. ఒకే ఒక్కడు. వాడి పేరు నూర్‌ వాలి మోహ్సూద్‌(Noor Wali Mehsud). పాక్‌కు కొరకరాని కొయ్యగా(వ్యక్తిగా) మారిన ఇతని గురించి ఇంటర్నెట్‌లో ఇప్పుడు తెగ వెతికేస్తున్నారు. నూర్ వాలి మెహ్సూద్(47).. ఒకప్పుడు తాలిబాన్‌ ఉద్యమంలో భాగమైన వ్యక్తి. అయితే ఆ తర్వాతి కాలంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) అనే ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తూ.. పాక్‌ను వణికిస్తున్నాడు. ఇతని నేతృత్వంలో టీటీపీ సంస్థ పాక్‌ గడ్డపై పలు దాడులు జరిపింది. మరీ ముఖ్యంగా సైనిక స్థావరాలు, పోలీసు ఔట్‌పోస్టులను లెక్కలేన్నంటిని నాశనం చేసింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలో ఇతని నేతృత్వంలో జరిగిన దాడులతో పాక్‌కు తీరని నష్టమే వాటిల్లింది. అలా.. తమ దేశ భద్రతా వ్యవస్థకు నూర్‌ వాలి మెహ్సూద్‌ పెనుముప్పుగా మారడంతో పాక్‌ ప్రభుత్వం శాంతి చర్చలకు ఆహ్వానించింది. అయితే.. నూర్‌ మొండి పట్టు వల్లే ఆ చర్చలు విఫలం కావడం గమనార్హం. తాజాగా ఇతగాడి చర్యల వల్ల పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పాక్‌ సైన్యం.. అతను ప్రయాణిస్తు‍న్న కాన్వాయ్‌పై క్షిపణి దాడులు చేసింది. అయితే అనూహ్యంగా నూర్‌ వాలి దాడి నుంచి తప్పించుకున్నాడు. అతని అనుచరులు గాయాలతోనే బయటపడినట్లు తెలుస్తోంది. తన క్షేమసమాచారాన్ని తెలియజేస్తూ ఆ మరుసటిరోజే ఆడియో క్లిప్‌ ఒకటి నూర్‌ బయటకు వదిలాడు. ఈ టీటీపీ ఏంటసలు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) పలు నిషేధిత సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన గ్రూప్‌. అయితే.. ఇది ఏర్పడడానికి ఒక బలమైన కారణం ఉంది. లాల్ మసీదు ఏరియా.. ఇస్లామాబాద్‌లో ఒకప్పుడు మతపరమైన కేంద్రంగా విరజిల్లేది. మౌలానాలు అబ్దుల్ అజీజ్, అబ్దుల్ రషీద్ ఘాజీ సారథ్యంలో షరియా చట్టం అమలు కోసం ఉద్యమించారు. అయితే.. ఉద్యమం మాటున ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అప్పటి సైనికాధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ప్రభుత్వం ఆపరేషన్‌ సైలెన్స్‌ పేరిట చర్యకు ఉపక్రమించింది. జులై 3-11 తేదీ మధ్య ఈ దాడిలో 100 మంది మరణించగా.. 11 మంది సైనికులు, 200 మంది పౌరులు గాయపడ్డారు.మరణించిన వాళ్లంతా మిలిటెంట్లేనని ముషారఫ్‌ నాడు ప్రకటించారు. లాల్ మసీద్‌ ఘటన భావోద్వేగంగా, మతపరంగా ప్రజలను ప్రభావితం చేసింది. అయితే.. ఈ ఘటనను ఇస్లాం మీద దాడిగా భావించిన పలు గ్రూపులు.. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రతీకారంగా కలసి TTPను డిసెంబర్ 2007లో ప్రకటించాయి. దీని లక్ష్యం.. అప్పటి ముష్రాఫ్‌ ప్రభుత్వాన్ని కూల్చేయడం, పాకిస్తాన్‌లో షరియా చట్టం అమలయ్యేలా చూడడం. కాలక్రమంలో.. ఇది పాక్‌ సరిహద్దు ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకుని పాక్‌ భూభాగంపై తరచూ దాడులు చేస్తూ వస్తోంది.నూర్‌ సారథ్యం.. మరో మలుపు!2018లో అఫ్గన్‌ సరిహద్దులో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడుల్లో టీటీపీ కీలక నేతలు ముగ్గురూ మరణించారు. దీంతో నూర్‌ వాలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. నూర్ వాలి మెహ్సూద్ సారథ్యంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) కొత్త పంథా ఎంచుకుంది. టీటీపీ అంటే అప్పటిదాకా పాక్‌ అమాయక పౌరులను బలిగొన్న కరుడుగట్టిన ఉగ్రసంస్థగా ముద్రపడిపోయింది. 2014లో ఓ పాఠశాలలో జరిపిన దాడిలో 130 మంది చిన్నారులు మరణించడం.. ఇందుకు ఓ ఉదాహరణ కూడా. అయితే మత పండితుడైన నూర్‌.. తన సారధ్యంలో అలాంటివి జరగకూడదని బలంగా తీర్మానించాడు. పాక్‌ సైన్యం అనేది ఇస్లాంకు వ్యతిరేకంగా.. 78 ఏళ్లుగా పాక్‌ ప్రజలను బందీఖానాలో ఉంచిందని, రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టిపోయిందని ఘాటు విమర్శలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పౌరుల జోలికి పోకూడదని.. కేవలం పాక్‌ ఆర్మీ, అవసరమైతేనే పోలీసులను లక్ష్యంగా చేసుకోవాలని టీటీపీ కేడర్‌కు సూచించాడు. అలా టీటీపీపై పడ్డ మచ్చను చెరిపేసే ప్రయత్నం చేశాడు నూర్‌. 2021లో అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో.. TTPకు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం కలిగింది. ప్రత్యేకించి.. పాక్‌ ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు పెరిగాయి. పాక్‌ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే.. నూర్‌ వాలి ఆఫ్ఘనిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నాడని, తాలిబాన్‌ తాత్కాలిక ప్రభుత్వ సహకారంతోనే మరింత రెచ్చిపోతున్నాడని. అంతేకాదు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఇస్లాం మతాన్ని వక్రీకరిస్తోందని, అలాంటి సంస్థకు భారతదేశమూ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ వచ్చింది. అయితే, ఈ ఆరోపణలను న్యూఢిల్లీ ఖండించింది, తాము ఎలాంటి మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసింది.

TDP Leader Rambab Audio Leak Over Liquor Belt Shops2
ఎక్సైజ్ సీఐలను కూర్చోబెడదాం.. కమీషన్‌ మాట్లాడదాం.. టీడీపీ నేత ఆడియో లీక్‌

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో టీడీపీ(TDP) నేత మద్యం అక్రమ దందా ఆడియో బయటకు వచ్చింది. ఈ ఆడియోలో ఎక్కడెక్కడ బెల్ట్(Liquor Belt Shop) షాపులు ఉంచాలి.. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి.. ఎవరెవరికి ఎంత కమీషన్‌ ఇవ్వాలనేది మాట్లాడుతున్నారు. దీంతో, ఈ ఆడియో తీవ్ర కలకలం సృష్టించింది. ఏపీలో కూటమి పాలనలో మరోసారి మద్యం అక్రమ దందా వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం.. రాజమండ్రి అర్బన్, రూరల్‌లో ఉన్న 39 షాపులను సిండికేట్ చేసేందుకు మద్యం షాపు నిర్వాహకుడితో రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్‌చార్జ్‌ మజ్జి రాంబాబు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఈ సందర్బంగా.. రాజమండ్రిలో ఎక్కడెక్కడ బెల్టు షాపులు పెట్టాలి. ఎక్కువ ధరకు అమ్మినా ఎక్సైజ్‌ అధికారులు అడ్డు చెప్పకుండా ఉండేందుకు వారికి ఎంత ఇవ్వాలో నిర్ణయిద్దాం. ఇప్పటికే ఎక్సైజ్‌ నార్త్, సౌత్‌ సీఐలను కూర్చోబెట్టి మాట్లాడాను. వాళ్లు ఎంత ఇవ్వాలో ప్రతిపాదించారు. దానికి అనుగుణంగా రూ.2 లక్షల వ్యాపారం జరిగే షాపుల నుంచి ఎంత? రూ.2 లక్షలకు పైగా వ్యాపారం జరిగే షాపుల నుంచి ఎంత మామూళ్లు ఎక్సైజ్‌ అధికారులకు ఇప్పించాలో నిర్ణయిస్తామన్నారు. ఒక ఏరియాలో ఉన్న మద్యం దుకాణం పరిధిలో ఉన్న బెల్టు షాపుల విషయంలో మరొకరు జోక్యం చేసుకోకుండా పకడ్బందీగా రూల్స్ పెట్టుకుందాం. మద్యం అక్రమ వ్యాపారానికి బైలాస్ కూడా రూపొందించుకుందాం. 39 షాపుల నిర్వాహకులను బాండ్లపై సంతకాలు పెట్టించాలి.ఇక, ఎమ్మార్పీకంటే ఎక్కువ రేట్లకు అమ్మాలి. ఏ బ్రాండ్‌పై ఎంత పెంచాలో చర్చించి నిర్ణయం తీసుకుందాం. 39 షాపుల్లో ఎవరిపై కేసు నమోదు చేసిన అందరూ భరించాలి. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా చర్చిద్దాం. ఎవరెవరికి ఎంత కమీషన్ ఇప్పించాలి. రెండోసారి షాపుమీద కేసు పెడితే షాపు క్యాన్సిల్ చేస్తారు కనుక కేసు పడకుండా వాళ్లే చూసుకుంటారు అని మాట్లాడుకున్నారు. అయితే, ఈ సమావేశం వెనుక ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే కూటమి నేతలు మద్యం సిండికేట్‌ ద్వారా ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో మద్యం అక్రమ వ్యాపారాన్ని లీగలైజ్ చేసే విధంగా టీడీపీ నేత మధ్య రాంబాబు మాట్లాడిన ఆడియోపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.ఇది కూడా చదవండి: నకిలీ మద్యం దోపిడీకి క్యూఆర్‌ కోడ్‌ అడ్డమే కాదు..

Bangladesh Players Vehicles Attacked After ODI Series Clean Sweep By Afghanistan3
బంగ్లాదేశ్ క్రికెట‌ర్ల వాహ‌నాల‌పై దాడి!

యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 3-0 తేడాతో బంగ్లాదేశ్ వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న బంగ్లా టైగర్స్‌.. వన్డేల్లో మాత్రం ప్రత్యర్ధి ముందు పూర్తిగా తేలిపోయారు. మెహిదీ హసన్ మిరాజ్ నాయకత్వంలోని బంగ్లా జట్టు మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోగా, రెండో వన్డేలో 81 పరుగులు, చివరి మ్యాచ్‌లో 200 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.అయితే యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన బంగ్లా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అఫ్గాన్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన బంగ్లా అభిమానులు మెహదీ బృందంపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. తొలుత విమానాశ్రయంలో ఆటగాళ్లను ఫ్యాన్స్ హేళన చేయగా.. అనంతరం వారు ప్రయత్నిస్తున్న వాహనాలపై దాడి చేసి నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు మొహమ్మద్ నయీమ్ షేఖ్ సోషల్ మీడియాలో భావోద్వేగ నోట్‌ను షేర్ చేశాడు."మేము మైదానంలో దేశం బ‌రువు బాధ్య‌త‌ల‌నూ మోస్తూ ఆడుతున్నాము. ఎరుపు-ఆకుపచ్చ జెండా మా జెర్సీలపైనే కాదు, మా రక్తంలో కూడా ఉంది. దేశం గర్వపడేలా ఆడేందుకు ప్రతీ మ్యాచ్‌లోనూ ప్రయత్నిస్తాం. ప్రతీ క్రీడలోనూ గెలుపోటములు సహజం. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం.మీరు కూడా దేశాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మేము ఓడిపోయినప్పుడు బాధ కలుగుతుందని నాకు తెలుసు. కానీ మాపై అంత ద్వేషం చూపడం సరికాదు. వాహనాలపై దాడులు నన్ను తీవ్రంగా బాధించాయి. మేము మళ్లీ తిరిగి బలంగా పుంజుకుంటామని" నయీమ్ పేర్కొన్నాడు. కాగా అఫ్గాన్ చేతిలో వైట్‌వాష్ అయిన తొలి ఆసియా జట్టుగా బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూట కట్టుకుంది.చదవండి: IND vs SA: ఇండియా టూర్‌.. సౌతాఫ్రికా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! కెప్టెన్ ఎవ‌రంటే?

Pradeep Ranganathan, Mamitha Baiju Starrer Dude Movie Twitter Review4
డ్యూడ్‌ X రివ్యూ: టాక్‌ ఎలా ఉందంటే?

లవ్‌టుడే, డ్రాగన్‌ సినిమాలతో తెలుగులో ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నాడు ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan). ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రదీప్‌ రంగనాథన్‌, మమిత బైజు జంటగా నటించిన సినిమా డ్యూడ్‌ (Dude Movie X Review). కీర్తిశ్వరన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శుక్రవారం (అక్టోబర్‌ 17న) డ్యూడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో ప్రదీప్‌ హిట్టు కొట్టాడా? మూవీకి ఏది ప్లస్‌ అయింది? ఏది మైనస్‌ అయిందని ఎక్స్‌ (ట్విటర్‌)లో నెటిజన్లు చర్చిస్తున్నారు. డ్యూడ్‌ చాలా బాగుందని కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం సెకండాఫ్‌ పోయిందని చెప్తున్నారు. మరింకా ఎటువంటి రియాక్షన్స్‌ వచ్చాయో కింద చూసేద్దాం.. మంచి సందేశంకీర్తిశ్వరన్‌ ఫస్ట్‌ సినిమాతోనే హిట్‌ కొట్టాడు. ఇది అసలుసిసలైన జెన్‌ జెడ్‌ మూవీ. సాయి అభ్యంకర్‌ ఇచ్చిన బీజీఎమ్‌ సినిమాకు ప్రధాన బలం. హీరోహీరోయిన్లు వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. మంచి సందేశాన్ని వినోదాత్మకంగా అందించారు అని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డాడు. Dude - Winner 🏆 What a fabulous debut for @Keerthiswaran_ 💯👏 A proper Gen Z rom-com ❤️‍🔥 @SaiAbhyankkar BGM & songs are a major plus ✨ Both PR & Mamitha were perfect in their roles 🤩 Much needed social message said in the most entertaining way 🔥#Dude #DudeDiwali #DudeReview pic.twitter.com/SdCJTKqxWD— Alex (@callmeajas) October 17, 2025సెకండాఫే..ఫస్టాఫ్‌ బాగుంది.. సెకండాఫ్‌ పోయింది. కథ నెమ్మదిగా మొదలై ప్రీ ఇంటర్వెల్‌కు వేగం పుంజుకుంటుంది. కానీ ఆ వేగం సెకండాఫ్‌లో ఎక్కడా కనిపించదు. సెకండాఫ్‌ను ఇంకాస్త బాగా ఎడిట్‌ చేయాల్సింది అని ఓ యూజర్‌ రాసుకొచ్చాడు. #Dude A Mid Rom-Com with a Fairly Engaging First Half but a Lackluster Second Half!The film hits all the familiar beats of a typical rom-com. The first half starts off a bit slow but picks up well toward the pre-interval, ending with a well-executed interval block. However, the…— Venky Reviews (@venkyreviews) October 17, 2025సూపర్‌ ఎంటర్‌టైనర్‌డ్యూడ్‌తో ప్రదీప్‌ మళ్లీ అదరగొట్టాడు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అదిరిపోయింది. సంగీతం, విజువల్స్‌ అన్నీ బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీసినట్లు అనిపించినా ఓవరాల్‌గా సూపర్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది అని మరో యూజర్‌ అభిప్రాయపడ్డాడు.Just watched #Dude 🎬🔥Pradeep strikes again with youthful energy & emotions!Fun, fresh & emotional ride!💥Pradeep & #MamithaBaiju chemistry 💯🎧 Music & visuals top-notch😅 Few scenes feel stretched, but overall super entertainer!⭐⭐⭐⭐☆ #DudeReview #PradeepRanganathan pic.twitter.com/NRwyKYDHhx— Dragon (@yours_dragon) October 17, 2025మిక్స్‌డ్‌ ఫీలింగ్‌డ్యూడ్‌ మూవీ చూశాక మిక్స్‌డ్‌ ఫీలింగ్‌ వస్తోంది. కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. పర్ఫామెన్స్‌ అయితే బాగుంది అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.#Dude Might work / Might not....!!Mixed feeling after watching film, Performances are good, 1st half is Good, and 2nd half moves to the different pattern and completes with okayish watch. Might work for some people. Pradeep with performance 🔥OKAYISH ENTERTAINER 🌟🌟.5/5— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) October 17, 2025 #Dude - PR’s Style, his combo with Mamitha Nice. Sarathkumar shines in versatile role. Hridhu Gud addition. Music ok. Slow start, Interval block 20Mins ROFL. Final act could have been better. Though less emotional connect, Humour drives d narration to an extent. ONE TIME WATCH!— Christopher Kanagaraj (@Chrissuccess) October 17, 2025VERY GOOD first half. Right from the first scene, there’s entertainment and the screenplay is engaging. The chemistry of @pradeeponelife and @_mamithabaiju is EXCELLENT. The storyline is good, the moments are cute, emotions land and the music is great. If this holds for the… pic.twitter.com/IrbdKWSbNw— Sharat Chandra (@Sharatsays2) October 17, 2025 First half is simply excellent #Dude 2nd half idey range lo untey good... https://t.co/YGO1ih1SCq— Ajayvinay (@Ajayvinay1) October 17, 2025#Dude is a partly engaging effort with fine performances but limited emotional resonance.written and directed by Keerthiswaran, #Dude is a modest romantic drama that blends light humor with emotional undertones. The film begins on a slow note but gradually finds its energy,…— Thyview (@Thyview) October 17, 2025#Dude 🌟🌟🌟 /5A very Pradeep Ranganathan coded film. The hidden conflict was a great strategic move. The first and second halves sit on completely opposite sides of the spectrum. Though predictable at times.#BiggBossTamil9 #Bisonpic.twitter.com/EMpTj7TGBQ— Cine News (@cinema_online2) October 17, 2025#Dude #Dudefirsthalf Neither good nor Bad .... Just ok !!!No story !! Routine scenes only music n bgm fresh 🔥🔥🔥🔥#SaiAbhyankkar killed it with BGM N songs..... @Chrissuccess @Karthikravivarm @itisprashanth— Movie Addict 😈 (@Madraspayen) October 17, 2025#Dude - 3.5/5🎯 Hat-trick hero! After Love Today and Dragon, #PradeepRanganathan delivers yet another blockbuster with #Dude! Three in a row — the young sensation is on fire! 🔥— Box Office (@Box_Office_BO) October 17, 2025

Chandrababu Govt Conspiracies Police raids at Sakshi office for fifth day5
నకిలీ మద్యం దందా వత్తాసుకే.. ‘సాక్షి’కి వేధింపులు

సాక్షి, అమరావతి: ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం మరింతగా కక్ష సాధింపు చర్యలకు బరితెగిస్తోంది. రాజ్యాంగ హక్కులు, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ కుట్రలకు పదును పెడుతోంది. వరుసగా ఐదో రోజు ‘సాక్షి’ కార్యాలయాల్లో పోలీసులు వేధింపులకు దిగడం విభ్రాంతి కలిగిస్తోంది. వరుసగా మూడో రోజు ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డికి నోటీసుల పేరుతో వేధింపులు కొనసాగిస్తున్నారు. నోటీసులు తీసుకుంటున్నా.. పోలీసులకు ఎప్పటికప్పుడు సహకరిస్తున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. తద్వారా కూటమి సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను వెలుగులోకి తేకుండా, నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించకుండా ‘సాక్షి’ పత్రికను నిరోధించాలన్నదే ప్రభుత్వ పెద్దల పన్నాగమన్నది స్పష్టమవుతోంది. అందుకోసం ఏకంగా సుప్రీంకోర్టు తీర్పులను కాలరాస్తూ పోలీసు జులుంతో విరుచుకుపడుతుండటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ మద్యం దందా వత్తాసుకే... ఏపీలో వెలుగు చూసిన నకిలీ మద్యం మాఫియా దందా యావత్‌ దేశాన్ని కుదిపివేసింది. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, అన్నమయ్య జిల్లాల్లో బయటపడిన నకిలీ మద్యం రాకెట్‌ సంచలనం రేకెత్తించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మద్యం తాగిన కొందరు సందేహాస్పద రీతిలో మరణించడం కలకలం రేపింది. బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా ప్రజలను చైతన్యం చేస్తూ సాక్షి దినపత్రిక ఈ నకిలీ మద్యం వ్యవహారంలో వాస్తవాలను ప్రచురించింది. నకిలీ మద్యం బారిన పడకుండా అమాయకులను కాపాడాలన్న సదుద్దేశంతో వ్యవహరించింది. మరోవైపు నకిలీ మద్యం దందాపై కఠిన చర్యలు తీసుకునేలా అధికార యంత్రాంగానికి ప్రేరణ కల్పించాలని భావించింది. కానీ ‘సాక్షి’ ప్రచురించిన వాస్తవాలు ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారాయి. తమ దోపిడీ వ్యవహారం బట్టబయలు కావడంతో వారు బెంబేలెత్తారు. దాంతో నకిలీ మద్యం దందాపై కథనాలు ప్రచురించకుండా ‘సాక్షి’ మీడియాను నిరోధించాలని ఎత్తుగడ వేశారు. అందుకే ‘సాక్షి’పై అక్రమ కేసులు నమోదు చేశారు. అనంతరం పోలీసులు నోటీసులు, విచారణ పేరుతో వేధింపులు తీవ్రతరం చేశారు. బుధవారం వెళ్లిపోయి.. గురువారం మళ్లీ వచ్చి సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, ఎస్సీఎస్‌ఆర్‌ నెల్లూరు బ్యూరో ఇన్‌చార్జ్‌ మస్తాన్‌రెడ్డిలకు పోలీసులు నోటీసుల మీద నోటీసులు ఇచ్చి వేధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 11 నుంచి వరుసగా విజయవాడ ఆటోనగర్, నెల్లూరులలోని సాక్షి కార్యాలయాలతోపాటు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయాలకు పోలీసులు చేరుకుని రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. నోటీసులు, విచారణ పేరుతో పదే పదే వేధిస్తున్నారు. వార్తకు సంబంధించిన సోర్స్, బాధితుల వివరాలు వెల్లడించాలని అడగటం, పత్రికలో ఉద్యోగుల వివరాలు వెల్లడించాలనడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం. కానీ ప్రభుత్వ పెద్దల కుట్రకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు దీన్ని లెక్క చేయడం లేదు. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డికి నోటీసులంటూ నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసులు దాదాపు 10 గంటలకుపైగా వేధించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్‌చల్‌ చేశారు. పత్రికలో ప్రచురించిన కథనాలకు సంబంధించి ఆధారాలు (సోర్స్‌) చూపించాలంటూ ఒత్తిడి చేశారు. ఓపికగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ పూర్తి సహకారం అందించినప్పటికీ మరుసటి రోజే పోలీసు స్టేషన్‌లో ఆయన తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందేనని చెప్పారు. దీంతో ఎడిటర్‌ తనకు ఈ నెల 29 వరకు గడువు కావాలని కోరారు. అందుకు సమ్మతించిన పోలీసులు సాక్షి ప్రధాన కార్యాలయం నుంచి బుధవారం రాత్రి 7 గంటలకు వెళ్లిపోయారు. ఒక్క రోజులోనే మాట మార్చి.. కానీ పోలీసులు ఒక్క రోజులోనే మాట మార్చారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చిన పోలీసులు.. గురువారం మళ్లీ హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష మయ్యారు. అన్ని రోజులు గడువు ఇవ్వలేమన్నారు. తమ ప్రశ్నావళికి శుక్రవారమే సమాధానాలు చెప్పాలని నోటీసులు ఇచ్చారు. అంటే అమరావతి నుంచి ప్రభుత్వ పెద్దలు, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారన్నది స్పష్టమవుతోంది. హైదరాబాద్‌ కార్యాలయంలో మూడు రోజులుగా పోలీసుల హల్‌చల్‌ ఏపీలో నకిలీ మద్యం ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సీబీఐ విచారణకు పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే అధికార పారీ్టకి చెందిన వ్యక్తులు, సన్నిహితులు కీలక నిందితులుగా ఉండటంతో కూటమి ప్రభుత్వం కేసును నీరుగార్చేందుకు ‘సిట్‌’ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో నకిలీ మద్యం కుంభకోణంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తుండటంతో ‘సాక్షి’ని అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నింది. శనివారం నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసు స్టేషన్‌లో అక్రమ కేసులు నమోదు చేయించింది. ఆ మరుక్షణం పోలీసు యంత్రాంగాన్ని సాక్షిపై దాడులకు ఉసిగొల్పింది. శనివారం ఇంటికి వెళ్లి మరీ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జీకి నోటీసులు జారీ చేసిన పోలీసులు ఆ మరుసటి రోజు ఆదివారం తెల్లవారు జామున సోదాల పేరుతో వీరంగం వేశారు. విచారణకు రావాలని ఒత్తిడి చేశారు. మళ్లీ ఆదివారం అర్ధరాత్రి మరోసారి నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసులు నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. ఇదే రీతిన ఆదివారం తెల్లవారక ముందే కనీసం కార్యాలయం తాళాలు తెరవక ముందే విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి కార్యాలయంపైకి దండెత్తారు. ఎడిటర్‌కు నోటీసులు ఇవ్వాలంటూ సిబ్బందిని, జర్నలిస్టులను వేధించారు. ఎడిటర్‌ హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తున్నారని చెప్పినప్పటికీ వరుసగా సోమవారం, మంగళవారం కూడా విజయవాడ సాక్షి కార్యాలయంపై పోలీసుల దండయాత్రలు ఆగలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున వారం తరువాత విచారణకు వస్తానని ఎడిటర్‌ సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే మంగళవారం సాయంత్రం వాట్సాప్‌ ద్వారా ఎడిటర్‌కు నోటీసులు పంపించిన పోలీసులు.. బుధవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. వాస్తవానికి ఇది సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమైనప్పటికీ, పోలీసులు టీడీపీ పెద్దలకు జీహుజూర్‌ అంటూ చట్టాలను తుంగలో తొక్కేశారు. అయితే ప్రజాస్వామ్య విలువలు, చట్టాలను గౌరవిస్తూ పోలీసులు సూచించినట్లుగా సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి కార్యాలయంలో బుధవారం అందుబాటులో ఉండగా ఏకంగా 10 గంటల పాటు విచారించారు. ఇక గురువారం కూడా అదే రీతిన పోలీసులు అసంబద్ధ ప్రశ్నలు అడుగుతూ వేధింపులకు దిగారు. ఈ స్థాయిలో మీడియాపై చంద్రబాబు సర్కారు అణచివేత చర్యలను ప్రజా సంఘాలతో పాటు జర్నలిస్టు యూనియన్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.‘సాక్షి’ ఒక్కటే కూటమి టార్గెట్‌..రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్‌ 19(1)(ఏ) ప్రకారం పౌరులకు దక్కిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే కాకుండా పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా దాడి చేస్తోంది. అక్రమ కేసులపై పోలీసులను న్యాయస్థానాలు పదేపదే హెచ్చరిస్తూ తప్పుబడుతున్నా వారి వైఖరిలో మార్పు రావడం లేదు. పత్రికలు, మీడియా, సోషల్‌ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో అందే ఫిర్యాదులపై కేసుల నమోదు విషయంలో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసు శాఖతోపాటు జిల్లా మేజిస్ట్రేట్లకు హైకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయితే రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ వ్యవస్థల ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే పాపమన్నట్లు చంద్రబాబు సర్కారు అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది.‘సాక్షి’పై తప్పుడు కేసులు పరిపాటయ్యాయి ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన కొద్ది గంటల్లోనే సాక్షి దినపత్రిక సంపాదకులు ధనంజయరెడ్డికి ‘సిట్‌’ పోలీసులు ఎనభై ప్రశ్నలతో ప్రశ్నావళిని అందజేసి అప్పటికప్పుడు సమాధానం కావాలని ఒత్తిడి చేయడం ఎక్కడా జరిగి ఉండదు. 2024లో కూటమి అధికారంలో వచ్చిన దగ్గర నుండి సాక్షి మీడియా గ్రూప్‌ను కట్టడి చేసేందుకు తప్పుడు కేసులు బనాయించడం పరిపాటిగా మారింది. తాజాగా.. నకిలీ మద్యం కథనాలపై సంపాదకుడిని, రిపోర్టర్లను వేధించడం పత్రికా స్వేచ్ఛకు కచ్చితంగా భంగం కలిగించినట్లే. ఈ ప్రయత్నాల్ని విరమించుకోవాలని పోలీసులను, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. అలాగే, పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. – దేవులపల్లి అమర్, ఐజేయూ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు అరాచక పాలనకు బాబు మూల్యం చెల్లించుకుంటారు.. చంద్రబాబుది ప్రజాస్వామ్య వ్యతిరేక స్వభావం. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆ విషయం బయటపడింది. ఇప్పుడు ఏపీలో ఆయన పాలన తీరు, ప్రతిపక్ష పారీ్టపట్ల ఆయన వైఖరి, మీడియాపట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే మళ్లీ ఆయన స్వభావం స్పష్టమవుతోంది. ఈ బలం శాశ్వతమని చంద్రబాబు విర్రవీగుతున్నారు. నేను చాలామంది ఏపీ ప్రజలతో మాట్లాడితే కూటమి ప్రభుత్వంపట్ల వ్యతిరేకత స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న మీడియాను అణిచివేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సాక్షిపట్ల వరుసగా చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి అరాచక పాలనకు బాబు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – టంకశాల అశోక్, సీనియర్‌ సంపాదకులు పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు హైదరాబాద్‌లోని సాక్షి కార్యాలయంలో నెల్లూరు పోలీసులు సోదాలు నిర్వహించడం తగదు. నోటీసు ఇచ్చేందుకని వచ్చి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని భయపెట్టేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి కానీ భయపెట్టేలా ప్రవర్తించడం దారుణం. – గోరంట్లప్ప, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం ప్రభుత్వాలు ప్రతికా స్వేచ్ఛపై దాడి చేయడం దారుణం. సాక్షి పత్రిక ఎడిటర్‌పై కక్ష సాధింపు చర్యలు విడనాడాలి. విచారణ పేరుతో హైదరాబాద్‌లోని కార్యాలయంలో గంటల తరబడి విచారించి పోలీసలు హల్‌చల్‌ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. – కల్లుపల్లి సురేందర్‌రెడ్డి, ఏపీ మీడియా ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శినోటీసుల్లో అసమంజస డిమాండ్లు⇒ వార్తకు సంబంధించి ఎడిటోరియల్‌ ఫైల్‌.. ఒరిజనల్‌ డ్రాఫ్ట్‌ కాపీ (ప్రింట్‌ అండ్‌ డిజిటల్‌) అందించాలి ⇒ వార్త కథనానికి సంబంధించి ప్రిపరేషన్, ఎడిటింగ్, పబ్లికేషన్‌లతో సంబంధమున్న రిపోర్టర్‌లు, కరస్పాండెంట్లు, ఎడిటోరియల్‌ సిబ్బంది పేర్లు, హోదాలు, ఫోన్‌ నంబర్‌లు ఇవ్వాలి⇒ వార్త కథనానికి ఆధారాలకు సంబంధించిన మెటీరియల్, నోట్స్, ఫొటోలు, వీడియో ఫుటేజ్, స్టేట్‌మెంట్లు, ఈమెయిల్, మెసేజ్‌లు వంటి ఇతర ఆధారాలు ఏమున్నా సమర్పించాలి ⇒ పబ్లికేషన్‌ ఆథరైజేషన్‌ ఆమోదాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించాలి ⇒ వీటికి సమాధానం ఇవ్వాలని నిర్దేశిస్తూ కేవలం 12 గంటల సమయం ఇచ్చారు. అడుగడుగునా ఉల్లంఘనలే⇒ బీఎన్‌ఎస్‌ఎస్‌ 179(1), 94 సెక్షన్ల కింద జారీ చేసిన నోటీసులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) ప్రకారం కల్పించిన పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదా? ⇒ జర్నలిస్టు లేదా ఎడిటర్‌ను వార్త సోర్స్‌ (సమాచార మూలం) వెల్లడించాలని బలవంతం చేయడం, భావప్రకటన స్వేచ్ఛా హక్కును ఉల్లంఘించడం కాదా? ⇒ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వార్త సోర్స్‌ గోప్యతను కాపాడే సుప్రీం కోర్టు తీర్పులు... ఆర్నాబ్‌ రంజన్‌ గోస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (2020).. రోమేశ్‌ థాపర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1950).. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌పేపర్స్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1985)..లను పట్టించుకోకుండా పోలీసులు జరిపిన చర్యలు చట్టపరంగా తప్పు, రాజ్యాంగ విరుద్ధం కాదా? ⇒ వార్త ప్రిపరేషన్, ఎడిటింగ్, పబ్లికేషన్‌కు సంబంధించిన ఫైళ్లను, రిపోర్టర్ల పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌లు ఇవ్వమని డిమాండ్‌ చేయడం వంటి పోలీసుల చర్యలు మీడియా స్వతంత్రతను దెబ్బతీసే ప్రయత్నం కాదా? ⇒ ఈ విధమైన డిమాండ్లు రాజ్యాంగపరంగా, చట్టపరంగా సమంజసమేనా? ⇒ నోటీసులకు స్పందించేందుకు కేవలం 12 గంటల గడువు మాత్రమే ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడం కాదా? ⇒ ఎడిటర్‌ సమయం కావాలని లిఖితపూర్వకంగా అభ్యర్థించినా పోలీసులు స్పందించకుండా వెళ్లిపోవడం దురుద్దేశపూరిత చర్య కాదా? ⇒ ఒకే అంశంపై వరుసగా నోటీసులు ఇవ్వడం, పోలీసులు మళ్లీ మళ్లీ పత్రికా కార్యాలయానికి రావడం ద్వారా ఎడిటర్‌ను భయపెట్టి లొంగదీసుకోవాలనుకోవడం ప్రభుత్వ వ్యూహం కాదా? ⇒ ఈ చర్యలు అధికార దుర్వినియోగం పరిధిలోకి రావా? ⇒ ప్రభుత్వ లేదా పోలీసు యంత్రాంగం మీడియా స్వేచ్ఛను అణచివేసేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకం కాదా? ⇒ ‘‘సాక్షి’’ వంటి పత్రికలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ‘నాణానికి మరొకవైపు ఉన్న అంశాలు’ ప్రజలకు తెలియనీయకుండా, వారికి నిజమైన సమాచారం అందనీయకుండా నిలువరించడం కాదా? ⇒ వార్తా కథనానికి సంబంధించి రెండు వేర్వేరు పోలీస్‌ స్టేషన్లు (నెల్లూరు రూరల్, కలిగిరి) ఒకే రోజున వేర్వేరు నోటీసులు జారీ చేయడం ద్వంద్వ విచారణ లేదా అధికార దుర్వినియోగం కిందకు రాదా? ⇒ సాక్షి పత్రికలో ప్రచురితమైన వార్త ప్రజా ప్రయోజనాలతో ముడిపడి, ప్రజా అవగాహన కోసం ప్రచురితమైనది కా­బట్టి, దానిని ఆధారంగా తీసుకుని కేసులు నమోదు చేయ­డం ప్రజా ప్రయోజన జర్నలిజాన్ని అణిచివేయడం కదా? ⇒ ఈ చర్య మొత్తం జర్నలిస్టుల స్వేచ్ఛను భయపెట్టి, లొంగదీసుకునే చర్యగా ఎందుకు పరిగణించకూడదు?

Bihar Election 2025: Amit Shah Doubt Comments On Nitish CM Again6
నితీశ్‌ మళ్లీ సీఎం.. డౌట్‌ కామెంట్స్‌ చేసిన అమిత్‌ షా!

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార ఎన్డీయే కూటమిలో లుకలుకలు నడుస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. అలాగే.. బీహార్‌ సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపైనా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ స్పష్టత ఇచ్చారు.బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు(Amit Shah On Bihar CM Candidate). బీహార్‌ ఎన్డీయే కూటమిలో పార్టీల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. మీడియా, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పనికి మాలినవని తోసిపుచ్చారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సారథ్యంలోనే బీహార్‌ ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని షా ప్రస్తావించారు. అయితే.. బీహార్‌ ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు.. అంత తొందర ఎందుకంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నితీశ్‌ కుమార్‌ మళ్లీ సీఎం అవుతారా? కారా?(Will Nitish Kumar CM Again) అనేది నేను ఒక్కడినే నిర్ణయించే అంశం కాదు. ప్రస్తుతానికి ఆయన సారథ్యంలోనే మేం ఎన్నికలకు వెళ్తున్నాం. ఎన్నికలయ్యాక.. మిత్రపక్షాలన్నీ కూర్చుని అప్పుడు సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తాయి అని షా స్పష్టత ఇచ్చారు. గత ఎన్నికల్లో(2020) జేడీయూ కంటే బీజేపీ అత్యధిక స్థానాలు నెగ్గింది. ఆ టైంలో నితీశ్‌ కుమార్‌ ప్రధాని మోదీని కలిసి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండడం సబబని అన్నారు. కానీ, మా మిత్రపక్షానికి మేం ఎప్పుడూ గౌరవం ఇస్తాం. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఆయన్ని సీఎం చేశాం అని షా అన్నారు.నితీశ్ తరచూ పార్టీలు మారుతున్న సందర్భాన్ని ప్రస్తావించగా.. షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1974లో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణన్‌ సారథ్యంలో జరిగిన ఆందోళనతో నితీశ్‌ రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని, అది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సందర్భాన్ని గుర్తు చేశారు. పైగా నితీశ్‌ రెండున్నరేళ్లు మాత్రమే కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగించారని.. ఎక్కువ కాలం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇక..నితీశ్‌ ఆరోగ్యం, పబ్లిక్‌లో ఆయన ప్రవర్తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా అమిత్‌ షా స్పందించారు. వయసు కారణంగా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కానీ, ముఖాముఖిగా, ఫోన్‌ ద్వారానూ నితీశ్‌ సుదీర్ఘంగా, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారని షా అన్నారు. అంతేకాదు.. సీఎంగా ఆయన సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు.ఇక.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Elections 2025) ఎన్డీయే కూటమి మునుపెన్నడూ చూడని ఘన విజయం సాధిస్తుందని.. నవంబర్‌ 14న వెల్లడయ్యే ఫలితాలతో గత రికార్డులను బద్దలు కొడతామని షా ధీమా వ్యక్తం చేశారు.74 ఏళ్ల వయసున్న నితీశ్‌కుమార్‌ ఇప్పటికే 9 సార్లు(2000 సంవత్సరంలో తొలిసారి) బీహార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ఆయన బీహార్‌ రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతారని, గవర్నర్‌గానో, రాజ్యసభకో వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. అంతెందుకు మొన్నీమధ్యే ఉప రాష్ట్రపతి పదవి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కూడా. అయితే నితీశ్‌ 10వ సారి బీహార్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని జేడీయూ అంటోంది.ఇదీ చదవండి: కరూర్‌ ఘటన తర్వాత.. విజయ్‌ క్రేజ్‌ మరింత పెరిగిందా?

Pakistan Khawaja Asif Says India could play dirty at border7
భారత్‌ డర్టీ గేమ్స్‌ ఆడుతోంది.. పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి భారత్‌ను టార్గెట్‌ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భారత్‌ డర్టీ గేమ్స్‌ ఆడుతోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్‌ (India) తరఫున ఆప్ఘనిస్తాన్‌ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ నిందలు మోపే ప్రయత్నం చేశారు. భారత్‌, ఆప్ఘన్‌తో రెండు వైపులా యుద్దానికి పాకిస్తాన్‌ సిద్ధంగా ఉందన్నారు.పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ‘పాకిస్తాన్‌ విషయంలో ఆప్ఘన్‌, భారత్‌ అనుచితంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. భారత్‌ సరిహద్దులో డర్టీ గేమ్‌ ఆడుతోంది. ఇస్లామాబాద్ యుద్ధ పరిస్థితులపై ప్రతిస్పందించడానికి వ్యూహాలను రూపొందించింది. యుద్ధానికి సంబంధించి బలమైన అవకాశాలు ఉన్నాయి. యుద్ధ వ్యూహాల గురించి బహిరంగంగా చర్చించలేను. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.🚨🚨 Pakistan is prepared for 2 front war: Khawaja Asif Anchor: According to war analysts, India might play dirty games along the border. Are you anticipating that?Khawaja Asif: No, absolutely, you cannot rule that out. There are strong possibilities. pic.twitter.com/ixIU7ClFrJ— Naren Mukherjee (@NMukherjee6) October 17, 2025అంతకుముందు కూడా ఆసిఫ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆప్ఘనిస్తాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ ఇటీవల భారత్‌లో పర్యటించడంపై అక్కసు వెళ్లగక్కారు. ముత్తాఖీ ఆరు రోజుల పర్యటనలో పలు ప్రణాళికలు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందన్నారు. ఇక, ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయొద్దంటూ హెచ్చరికలు చేశారు. తాలిబాన్ నిర్ణయాలను ఢిల్లీ స్పాన్సర్ చేస్తోంది. ఢిల్లీ కోసం కాబూల్‌ ప్రాక్సీ యుద్ధం చేస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ‘ఆప్ఘన్‌లో భారీ దాడులు జరిగాయి. స్నేహపూర్వక దేశాల జోక్యం తర్వాత కాల్పుల విరమణకు వారు అంగీకరించారు. కానీ, అది పేలవంగా ఉంది. ఇది ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవడం లేదు’ అని అన్నారు.ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీకి ట్రంప్‌ ఫోన్‌ కాల్‌.. అంతా ఉత్తిదే’

Amid Hyderabad CP Sajjanar Warning Content Deleted From Youtube Insta8
సజ్జనార్‌ ఎఫెక్ట్‌.. ఆ చిల్లర ఇంటర్వ్యూలు డిలీట్‌!

ఇటీవల కాలంలో యూట్యూబ్‌ చానళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. దీంతో పాటు ఇతర సోషల్‌ మీడియాలోనూ పోటీ పెరిగిపోయింది. ఎవరికి వారు లైకులు, షేర్లు, వ్యూస్‌ కోసం వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. కొందరైతే విశృంఖలానికి తెర లేపుతున్నారు. ఈ క్రమంలో.. ఇంటర్వ్యూల పేరుతో మైనర్లను ఎంచుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు, చేష్టలు చేయిస్తున్నారు. తాజాగా ఓ మైనర్‌ జంట ఇంటర్వ్యూ సో.మీ. ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా వైరల్‌ అయ్యింది. ఓ షార్ట్‌ఫిల్మ్‌/ఆల్బమ్‌ చేసిన జంట అందులో ముద్దు సీన్‌ చేయడంపై యాంకర్‌ ప్రశ్నిస్తాడు. అయితే ఆ బాలిక దాంట్లో ఏముంది? ఇప్పుడు కూడా పెట్టేస్తా.. అంటూ ఇంటర్వ్యూలో బరితెగించి ఓవరాక్షన్‌కు దిగింది. ఈ పరిణామంతో యాంకర్‌ షాక్‌ కావడం.. మీమ్స్‌, ఫన్నీ ఎడిట్‌ వీడియోల రూపంలోనూ వైరల్‌ అయ్యింది. అయితే ఈ తరహా ఇంటర్వ్యూలు, వీడియోల వ్యవహారంపై నగర పోలీస్‌ బాస్‌ వీసీ సజ్జనార్‌ కన్నెర్ర చేశారు. మైనర్ల అభ్యంతరకరమైన వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్‌ యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్ట్రాగామ్‌ తదితర సోషల్‌మీడియాల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర పోలీసు కమిషనర్‌ విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనార్‌ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వీడియోలు, ఇంటర్వ్యూలను అధ్యయనం చేస్తూ పోక్సోతో పాటు కిడ్నాప్‌ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సజ్జనార్‌ హెచ్చరికల నేపథ్యంలో యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లపై సిటీ పోలీసుల నజర్‌ పెరిగింది. మైనర్లతో అభ్యంతరకర వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి వీడియోలను చేసేవాళ్లనే కాదు, అప్‌లోడ్‌ చేస్తున్నవాళ్లను, మీమ్స్‌ పేరిట పరోక్షంగా ప్రమోట్‌ చేస్తున్నవాళ్లను కూడా వదిలిపెట్టబోమని పోలీసులు అంటున్నారు. అంతా అల్గారిథమ్‌ మహిమ!ఇటీవల కాలంలో సోషల్‌మీడియా ఖాతాలు, ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు తదితరాలన్నీ ప్రత్యేక ఆల్గరిథెమ్‌ ఆధారంగా పని చేస్తున్నాయి. ఈ ఆల్గరిథెమ్‌ సదరు వ్యక్తి ఏ తరహా కంటెంట్‌ను వీక్షిస్తున్నారు? ఎలాంటి వస్తువులు ఖరీదు చేస్తున్నారు? సెర్చ్‌ చేస్తున్నారు? అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. ఐపీ అడ్రస్, మెయిల్‌ ఐడీ ఆధారంగా జరిగే ఈ ప్రక్రియలో ఆ వ్యక్తికి అదే తరహా కంటెంట్, ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు, యాప్స్‌ పదేపదే పంపిస్తుంది. ఈ కారణంగా ఇలాంటి వీడియోలు, రీల్స్‌ను పొరపాటున మైనర్లు ఒక్కసారి వీక్షిస్తే చాలు.. వారికి పదేపదే అదే తరహావి కనిపిస్తాయి. వ్యూస్‌ కోసం విలువలు వదిలేస్తారా? వ్యూస్, లైక్స్‌తో పాటు సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావడానికి చిన్నారుల భవిష్యత్తును ఫణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం? ఇది విలువలను వదిలేయడంతో సమానం. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్‌ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. అలా చేయడం బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు..చట్టరీత్యా నేరం. బాలబాలికల్ని ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్‌ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుంది. ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను తొలగించకున్నా, భవిష్యత్తులో అప్‌లోడ్‌ చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇలాంటి వీడియోలు, రీల్స్‌ గమనిస్తే 1930కు ఫోన్‌ చేసి లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి. పిల్లల బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం కూడా తల్లిదండ్రుల బాధ్యతే.వీసీ సజ్జనార్, నగర కొత్వాల్‌ పోక్సోతో పాటు కిడ్నాప్‌ కేసు కూడా! ప్రేమ, పెళ్లి, భాగస్వామ్యం తదితర అంశాలపై మైనర్లలో సరైన అవగాహన పెరిగేలా, వారు పెడదారి పట్టకుండా వీడియోలు రూపొందిస్తే ఇబ్బంది ఉండదు. అయితే మైనర్ల ప్రేమ వ్యవహారాలు, ముద్దుమచ్చట్లను రీల్స్, వీడియోలు, ఇంటర్వ్యూలుగా చిత్రీకరించి మరింత మందిని పెడదోవ పట్టించడం నేరమే అవుతుంది. ఈ వీడియోలతో పాటు వాటిలో మైనర్లు, యాంకర్లు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో పోక్సో యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద యాంకర్లు, నిర్వాహకులపై కేసులు నమోదు చేయవచ్చు. ఈ ఇంటర్వ్యూల కోసం ఆ మైనర్లను వివిధ ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి తరలించడమూ నేరమే. దీనికి సంబంధించి కిడ్నాప్‌ కేసు నమోదు చేసే అవకాశమూ ఉంది. ఇవన్నీ పరిశీలించిన కొత్వాల్‌ సజ్జనర్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గురువారం కొత్వాల్‌ ‘ఎక్స్‌’ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఇవి చూసిన అనేక మంది తమ వీడియోలు, రీల్స్, ఇంటర్వ్యూలను డిలీట్‌ చేస్తుండటం గమనార్హం.:::సాక్షి, సిటీబ్యూరో

Mumbai Survey Vote Share Percentage Increased To TVK Vijay9
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్‌

సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు(టీవీకే), సినీ నటుడు విజయ్‌కు(TVK Vijay) ప్రజల నుంచి మద్దతు పెరిగినట్టు ఓ సర్వేలో వెలుగు చూసింది. ఆయనకు తాజాగా 23 శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తేలింది. విజయ్‌ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కరూర్‌లో(Karur Stampade) ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆ పార్టీ(Tamil nadu) వర్గాలను కాస్త డీలా పడేలా చేసింది. విజయ్‌ సైతం తీవ్ర మనోవేదనలో పడ్డారు.తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సీబీఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతంపై విజయ్‌ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులలో ఉన్నారు. ఎక్కువ శాతం జిల్లాల కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నట్టు సమాచారం వెలువడింది. ఈ సమావేశాలు, సంప్రదింపులు తదుపరి పార్టీ పరంగా విజయ్‌ కొన్ని మార్పు, చేర్పుల ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్టు చర్చ ఊపందుకుంది.ఈ పరిస్థితులలో విజయ్‌కు మరింత ఉత్సాహం తెప్పించే రీతిలో తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. ఇటీవల ముంబైకు చెందిన ఓ సంస్థ సర్వే జరపగా 2026 ఎన్నికలలో విజయ్‌ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయన్న సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా జరిపిన సర్వేలో కరూర్‌ ఘటనతో విజయ్‌కు ప్రజాదరణ మరింతగా పెరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ప్రజలలో ఆయనపై ఆదరణ అన్నది తగ్గలేదని, అదే సమయంలో తాజాగా 23 శాతం మద్దతు ఆయనకు పెరిగినట్టుగా పేర్కొంటూ వెలువడ్డ సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయి.

detailed breakdown of Infosys Q2 FY26 performance10
మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు

ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో 8,203 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,31,991కు చేరిందని చెప్పింది. ఇన్ఫీ క్యూ2 ఫలితాలను వెల్లడించిన క్రమంలో అందులోని వివరాల ప్రకారం..జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 13 శాతంపైగా ఎగసి రూ.7,364 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.6,506 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం పుంజుకుని రూ.44,490 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ.40,986 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో 1–3 శాతం వృద్ధి(జూన్‌లో ప్రకటించిన) అంచనాలను తాజాగా 2–3 శాతానికి సవరించింది. నిర్వహణ మార్జిన్లు నామమాత్ర క్షీణతతో 21%గా నమోదయ్యాయి.షేరుకి రూ.23 డివిడెండ్‌వాటాదారులకు ఇన్ఫోసిస్‌ బోర్డు షేరుకి రూ.23 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. ఇందుకు ఈనెల 27 రికార్డు డేట్‌ కాగా నవంబర్‌ 7 కల్లా చెల్లించనుంది. దీనికితోడు రూ.18,000 కోట్ల విలువైన సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) కోసం వాటాదారుల అనుమతి తీసుకోనున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో జయేష్‌ సంగ్రాజ్‌కా తెలిపారు.ఇతర విశేషాలుక్యూ2లో 8,203 మంది ఉద్యోగులు జత కలిశారు. దీంతో సిబ్బంది సంఖ్య 3,31,991ను తాకింది. 2025 జూన్‌ చివరికల్లా 3,23,788 మంది ఉద్యోగులున్నారు.ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు గత క్యూ2లో నమోదైన 12.9 శాతం నుంచి 14.3 శాతానికి పెరిగింది.ఈ కాలంలో 3.1 బిలియన్‌ డాలర్ల(రూ. 27,525 కోట్లు) విలువైన కాంట్రాక్టులను సాధించింది. ఆదాయంలో ఫైనాన్షియల్‌ సర్వీసుల విభాగం 5.6 శాతం వృద్ధితో 27.7 శాతం వాటాను ఆక్రమించింది.తయారీ విభాగం 9.3 శాతం, హైటెక్‌ బిజినెస్‌ 8.3 శాతం, కమ్యూనికేషన్స్‌ 5.7 శాతం చొప్పున సమకూర్చాయి. రిటైల్‌ నామమాత్రంగా నీరసించగా.. లైఫ్‌ సైన్సెస్‌ 9 శాతం క్షీణించింది.ఉత్తర అమెరికా వాటా 1.7 శాతం పుంజుకుని ఆదాయంలో 56.3 శాతానికి చేరింది.యూరప్‌ బిజినెస్‌ 10.6 శాతం ఎగసి 31.7 శాతం వాటాను ఆక్రమించింది. భారత్‌ వాటా 2.9 శాతమే.ఇదీ చదవండి: నక్సల్స్‌పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా?

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement