
సాక్షి, నల్గొండ: హౌరా-సికింద్రాబాద్ హౌరా ఎక్స్‌ప్రెస్(Howrah Express) రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ క్రమంలో రైలును మిర్యాలగూడ (Miryalaguda) రైల్వేస్టేషన్ నిలిపివేశారు. టెక్నికల్ సమస్య కారణంగా రైలు.. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్-1పై గంటలకు పైగా నిలిచిపోయింది. దీంతో, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్య కారణంగా రామన్నపేట నుంచి మరో ఇంజిన్ తెప్పించేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.