
హీరో రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌లది హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘జైలర్’ 2023 ఆగస్టు 10న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కలయికలో ‘జైలర్ 2’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘జైలర్’ సూపర్ హిట్ కావడంతో ‘జైలర్ 2’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
2026 జూన్‌లో ‘జైలర్ 2’ విడుదల కానుంది. ఇదిలా ఉంటే... రజనీకాంత్– నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుందని కోలీవుడ్ టాక్. ఇప్పటికే ‘జైలర్ 2’ చిత్రీకరణ సుమారు 70 శాతం పూర్తయిందట. ఈ సినిమా తర్వాత మరోసారి రజనీకాంత్‌తో ఓ మూవీ కోసం నెల్సన్ దిలీప్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ స్టోరీ లైన్‌ని ఇటీవల రజనీకాంత్‌కి వినిపించగా ఆయన కూడా పచ్చజెండా ఊపారట. మరి... రజనీ–నెల్సన్ కాంబినేషన్‌లో మూడో చిత్రం ఉంటుందా? అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.