
అవగాహన సదస్సులో నిపుణులు
సాక్షి, అమరావతి: అమెరికాలో స్థిరపడడానికి ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా సులభ మార్గమని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఇల్యా ఫిష్కిన్ (Ilya Fishkin) అన్నారు. ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా గురించిన అవగాహన సదస్సును న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ గురువారం విజయవాడలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఇల్యా ఫిష్కిన్ మాట్లాడుతూ.. అమెరికాలో అనేక మంది భారతీయుల గ్రీన్‌కార్డ్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వారు సకాలంలో గ్రీన్ కార్డ్ పొందలేకపోతే అమెరికా వీడి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
అలాంటి వారికి ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా (EB-5 investor visa) అద్భుత అవకాశమని తెలిపారు. ఈబీ–5 వీసా పొందాలంటే దాదాపు రూ.9.32 కోట్లు(1.05 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందన్నారు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రాజెక్టు పెడితే మాత్రం రూ.7.11 కోట్లు సరిపోతుందన్నారు.
ఈబీ–5 ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పార్టనర్లు సుబ్బరాజు పేరిచర్ల, సంపన్న్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఈబీ–5 వీసా అమెరికాలో ఉన్న భారతీయులు శాశ్వత నివాస హక్కు పొందే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు.
చదవండి: అప్పుడు దివాళా.. ఇప్పుడు రోజుకు 25 లక్షల సంపాదన!