ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నట్లు పాశ్చాత్య, పశ్చిమాసియా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియాలోని తమ స్థావరాలను అమెరికా ఖాళీ చేస్తూనే.. 75 దేశాలకు వీసాలను నిలిపివేసింది. ఈ చిట్టాలో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తోపాటు.. మన పొరుగున ఉన్న ఆరు దేశాలు కూడా ఉండడం గమనార్హం..!
అమెరికా విదేశాంగ శాఖ తాజాగా జారీ చేసిన ఓ మెమో ప్రకారం.. ఈ 75 దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ జనరల్స్ ఆఫీసుల్లో అన్నిరకాల వలస వీసాలను రద్దు చేస్తారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బిగోట్ మాట్లాడుతూ.. ‘‘కొందరు వలసదారులు అమెరికా ప్రజలను దోపిడీ చేస్తున్నట్లు గుర్తించాం. అందుకే ట్రంప్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది’’ అని వ్యాఖ్యానించారు. వీసాల నిలిపివేత అనేది తాత్కాలికమేనని త్వరలో దీనిపై పునఃపరిశీలన జరుగుతుందని వివరించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అభిప్రాయపడ్డారు.
నిషేధిత దేశాల జాబితా పూర్తిస్థాయిలో వెలుగులోకి రాకపోయినా.. రాయిటర్స్ కథనం ప్రకారం ఈ చిట్టాలో బంగ్లాదేశ్‌తోపాటు.. డొమినికా, ఆంటిగ్వా, బార్బుడా కూడా ఉన్నాయి. ఇరాన్‌పై యుద్ధానికి సన్నాహాల్లో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అరబిక్ మీడియా పేర్కొంది.
అమెరికా విడుదల చేసిన జాబితాలోని దేశాలివే..
ఆసియా: ఆఫ్ఘనిస్థాన్, ఆర్మేనియా, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, భూటాన్, బర్మా (మయన్మార్), కంబోడియా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్, కజకిస్తాన్, కువైట్, కిర్గిజిస్తాన్, లావోస్, లెబనాన్, మంగోలియా, నేపాల్, పాకిస్తాన్, సిరియా, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, యెమెన్.
ఆఫ్రికా: అల్జీరియా, కామెరూన్, కేప్ వెర్డే, కోట్ డి ఐవోర్, కాంగో, ఈజిప్ట్, ఎరిట్రియా, ఇథియోపియా, గాంబియా, ఘనా, గినియా, హైతీ, లైబీరియా, లిబియా, మొరాకో, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా, సెనెగల్, సియెర్రా లియోన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, టాంజానియా, టోగో, ట్యునీషియా, ఉగాండా.
ఐరోపా: రష్యా, అల్బేనియా, బెలారస్, బోస్నియా, జార్జియా, కొసావో, మాసిడోనియా (ఉత్తర మాసిడోనియా), మోల్డోవా, మాంటెనెగ్రో.
ఉత్తర అమెరికా: ఆంటిగ్వా మరియు బార్బుడా, బహామాస్, బార్బడోస్, బెలిజ్, క్యూబా, డొమినికా, గ్రెనడా, హైతీ, జమైకా, సెయింట్ కిట్స్ మరియు నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్.
దక్షిణ - మధ్య అమెరికా దేశాలు: బ్రెజిల్, కొలంబియా, ఉరుగ్వే, గ్వాటెమాలా, నికరాగ్వా.


