
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులో మళ్లీ రేవ్ పార్టీ కలకలం రేగింది. మాదకద్రవ్యాలు, మద్యం, క్యాసినో కాయిన్స్‌తో సాగే ఈ రాత్రి పార్టీలకు మరోసారి తెరలేపిన ఘటన ఇది. రాచకొండ పరిధిలోని మహేశ్వరం మండలం చెర్రాపల్లి సమీపంలోని కె. చంద్రారెడ్డి రిసార్ట్స్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా SOT పోలీసులు రాత్రి ఆలస్యంగా దాడులు నిర్వహించి, రిసార్ట్స్‌లో జరిగిన అశ్లీల విందును అడ్డుకున్నారు.

ఈ పార్టీని గుంటూరుకు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన కంపెనీకి చెందిన ఇతర డీలర్లను, వ్యాపార భాగస్వాములను కలిపి “బిజినెస్ గ్యాదరింగ్” పేరుతో ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. రాత్రంతా సాగిన ఈ పార్టీలో 14 మంది మహిళలతో సహా మొత్తం 50 మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు . ఈ మహిళలు హైదరాబాద్, బెంగళూరుకు చెందినవారని సమాచారం. వారితో పాటు పలువురు వ్యాపారవేత్తలు, యువకులు కూడా పార్టీలో పాల్గొన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దాడుల్లో 3 బ్లాక్‌డాగ్ విస్కీ మద్యం బాటిళ్లు, రెండు కాటన్ల బీర్లు స్వాధీనం చేసుకున్నారు.
