
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇంటి యజమాని అశోక్ దారుణానికి పాల్పడ్డాడు. అద్దెకు ఉంటున్న ఇంట్లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసి వివాహిత వీడియోలను రికార్డు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మధురానగర్‌లోని జవహార్ నగర్‌లోని ఓ ఇంట్లో భార్యాభర్తలు అద్దెకు దిగారు. దీంతో అద్దెకు ఉంటున్న వారి బాత్రూంలో అశోక్ సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశాడు. వివాహిత వీడియోలను రికార్డు చేశాడు. ఈ నెల 4న బాత్రూంలో బల్బ్ రిపేర్ చేయించాడు.
ఆ సమయంలో ఎలక్ట్రీషియన్ చింటుతో కలిసి బల్బ్ హోల్డర్‌లో కెమెరాను అమర్చాడు. ఈ నెల 13న భర్త ఆ సీసీ కెమెరాను గుర్తించాడు. ఇంటి యజమాని అశోక్ ప్రవర్తనపై అనుమానం రావడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు అశోక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎలక్ట్రీషియన్ చింటు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే ఎలక్ట్రీషియన్‌పై కేసు పెట్టకుండా ఇంటి యజమాని అశోక్ యాదవ్ అడ్డుపడ్డాడు.